NRI-NRT

నార్త్ కరోలినా విభాగాన్ని ప్రారంభించిన నాట్స్

నార్త్ కరోలినా విభాగాన్ని ప్రారంభించిన నాట్స్

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) నార్త్ కరోలినా విభాగాన్ని ప్రారంభించారు. అపెక్స్ సీనియర్ సెంటర్లో నార్త్ కరోలినా చాప్టర్‌ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ చాప్టర్ కోఆర్డినేటర్‌గా ఉమా నార్నెకు బాధ్యతలు అప్పగించారు. నార్త్ కరోలినా నాట్స్ చాప్టర్ సభ్యులుగా వేణు వెల్లంకి, రాజేష్ మన్నెపల్లి, రవితేజ కాజ, దీపికా దండు, కల్పన అధికారి, శ్రీను కాసరగడ్డలను నియమించారు.

నాట్స్ తెలుగువారికి చేరువ అయిందని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు. నాట్స్ లక్ష్యాలను పిన్నమనేని వివరించారు. నాట్స్ వైద్య శిబిరాలు, నాట్స్ హెల్ప్‌లైన్ ద్వారా అందించిన సేవలను వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ మధు కొర్రపాటి గుర్తు చేశారు. నార్త్ కరోలినా లో తెలుగువారికి నార్త్ కరోలినా నాట్స్ సభ్యులు, నాయకులు భరోసా కల్పించాలని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి కోరారు.

తెలుగు వారిలో ఐక్యతను పెంపొందించి వారందరిని ఒక చోట కలిపే వేదికగా నాట్స్ ఎదిగిందని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అన్నారు. నాట్స్ ప్రాంతీయ వైస్ ప్రెసిడెంట్ వెంకటరావు దగ్గుబాటి, మార్కెటింగ్ నేషనల్ కోఆర్డినేటర్ కిరణ్ మందాడి, న్యూ జెర్సీ చాప్టర్ వెబ్ చైర్ వెంకటేష్ కోడూరి, న్యూజెర్సీ చాప్టర్ ఈవెంట్ ఎగ్జిక్యూషన్ హరీష్ కొమ్మాలపాటి తదితరులు పాల్గొన్నారు.

* NATS LA Team Financial Seminar
నాట్స్ ఆన్‌లైన్ వేదికగా ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించింది. నాట్స్ మహిళా సాధికారత జాతీయ సమన్వయకర్త రాజలక్ష్మి చిలుకూరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో ఆర్ధిక ప్రణాళిక ఎలా ఉండాలి.? ఆర్ధిక అంశాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి.? ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధిగమించే మార్గాలు ఏమిటి.? వంటి అంశాలపై అవగాహన కల్పించారు. వర్జీనియాకు చెందిన ఆర్థిక నిపుణులు శ్రీలత గూడూరు వివరించారు. నెట్‌లా సంస్థ వైస్ ప్రెసిడెంట్ మార్క్ స్టిర్నెమాన్ వీలునామాలు, ట్రస్ట్‌ల గురించి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సదస్సుకు శ్రీనివాస్ చిలుకూరి అనుసంధానకర్తగా వ్యవహరించారు. నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ రాజేష్ కాండ్రు, లాస్మ్ ఎంజిల్స్ నాట్స్ సభ్యులు విజయవంతానికి కృషి చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z