* సూపర్ హీరో కథకు ఇతిహాసాన్ని ముడిపెట్టి ప్రశాంత్ వర్మ (Prasanth varma) తెరకెక్కించిన చిత్రం ‘హను-మాన్’ (Hanuman). ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దీనికి కొనసాగింపుగా ‘శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి?’ అనే ప్రశ్నకు సమాధానంగా ‘జై హనుమాన్’ (jai hanuman movie) రూపుదిద్దుకోనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని చిత్ర బృందం పంచుకుంది. ‘జై హనుమాన్’ ఫస్ట్‌లుక్‌ను అక్టోబరు 30న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (jai hanuman movie update) ప్రకటించింది.
* తాను దావౌ నగర మేయర్‌గా ఉన్న సమయంలో నగరంలోని నేరాలను అణచివేయడానికి తన ఆధీనంలో ఓ డెత్‌స్క్వాడ్ ఉండేదని ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టో అంగీకరించారు. ఆయన ప్రారంభించిన ‘మాదక ద్రవ్యాలపై యుద్ధం’ పలు విమర్శలను ఎదుర్కొంది. దానికి సంబంధించిన దర్యాప్తులో తొలిసారి ఆయన వాంగ్మూలం ఇచ్చారు. తాను దావౌ నగర మేయర్‌గా ఉన్న వేళ కొందరు గ్యాంగ్‌స్టర్లతో ఓ ముఠాను ఏర్పాటు చేశానని.. తాను సూచించిన వ్యక్తిని మట్టుబెట్టకపోతే.. వారినే అంతం చేస్తానని ఆ ముఠాకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. 2016లో రోడ్రిగో దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాను దావౌ నగరంలో చేసిందే.. దేశం మొత్తం అమలు చేస్తానని ఆయన వాగ్దానం చేశారు. ‘మాదక ద్రవ్యాలపై యుద్ధం’ కారణంగా దేశ వ్యాప్తంగా పోలీస్ అపరేషన్లలో వేల మంది అనుమానాస్పద స్థితిలో మరణించారు. ప్రస్తుతం దానిని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు విచారిస్తోంది. ఈ సందర్భంగా రోడ్రిగో మాట్లాడుతూ తానే అనుమానితులను రెచ్చగొట్టి వారు తిరగబడేలా చేయమని పోలీసు అధికారులకు చెప్పానని.. అప్పుడే వారు చేసే ఎన్‌కౌంటర్లను తగిన సాకులు లభిస్తాయని సూచించినట్లు వెల్లడించారు. తాను చేసిన పనులకు ఎలాంటి క్షమాపణలు చెప్పనని తేల్చి చెప్పారు. తాను దేశం కోసం ఏం చేయాలో అదే చేశానని వ్యాఖ్యానించారు. ‘‘నేను డ్రగ్స్‌ను ద్వేషిస్తాను. వాటి విషయంలో తప్పు చేయలేదు. మీకు కావాలంటే నేను ఇప్పుడే అంగీకరిస్తాను. ఏడుగురితో కూడిన ఓ డెత్ స్క్వాడ్ నాకు ఉండేది. వారు పోలీసులు కాదు. గ్యాంగ్‌స్టర్లు’’ అని పేర్కొన్నారు.
* వైకాపా అధినేత జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తి పంపకాల వివాదం నేపథ్యంలో వారి తల్లి వైఎస్ విజయమ్మ స్పందించారు. ఈ మేరకు వైఎస్‌ఆర్ అభిమానులకు ఆమె బహిరంగ లేఖ రాశారు. ‘‘జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధేస్తోంది. జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరిగిపోతున్నాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. అబద్ధాల పరంపర కంటిన్యూ కాకూడదు. ఈ ఘటనలు నా పిల్లలిద్దరికే కాదు.. రాష్ట్రానికీ మంచిది కాదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
* పేద, ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ‘ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన’ (PMJAY) కింద తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ప్రారంభించారు. ధన్వంతరి జయంతి, తొమ్మిదో ఆయుర్వేద డే సందర్భంగా ఈ పథకానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, గర్భిణులు, చిన్నారుల వ్యాక్సినేషన్ కోసం ఉద్దేశించిన యూ-విన్ పోర్టల్ (U-WIN)ను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు.
* బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) మంచి మనసు చాటుకున్నారు. దీపావళి సందర్భంగా అయోధ్య (Ayodhya) రామమందిరం చుట్టూ ఉండే కోతులకు (monkeys) ఆహారం అందించారు. మందిరానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా.. మూగ జీవాలకు దీపావళి కానుకగా (Diwali gift) తన వంతు కృషి చేశారు.
* నిషేధిత మాదక ద్రవ్యం మెథాంపెటమైన్(మెథ్) తయారీ ల్యాబ్‌ను దిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో ఎన్‌సీబీ అధికారులు గుర్తించారు. దీని నిర్వహణ వెనుక ఏకంగా తిహాడ్ జైలు వార్డెన్ హస్తం కూడా ఉందని తెలుసుకొని నిర్ఘాంతపోయారు. అక్టోబర్ 25వ తేదీన గ్రేటర్ నోయిడా పరిధిలో ఎన్‌సీబీ దాడులు నిర్వహించింది. ఒక ఇంట్లో నిర్వహిస్తున్న మెథ్ ల్యాబ్‌ను గుర్తించింది. దీనిని తిహాడ్ జైలు వార్డెన్, దిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త, ముంబయికి చెందిన కెమిస్ట్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ దేశీయ వినియోగానికి, అంతర్జాతీయ ఎగుమతుల కోసం సింథటిక్ డ్రగ్స్‌ను తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘన, ద్రవ రూపాల్లో ఉన్న దాదాపు 95 కిలోల మెథ్‌ను వారు స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఫ్యాక్టరీ ఆవరణలో ఎసిటోన్, సోడియం హైడ్రాక్సైడ్, మిథాలిన్ క్లోరైడ్, ప్రీమియం గ్రేడ్ ఎథనాల్, రెడ్ పాస్ఫరస్, ఈథైల్ ఎసిటేట్ వంటివి లభించాయి. తయారీ కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న పరికరాలు కూడా ఇక్కడ ఉన్నాయి.
* మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ముందడుగు వేయడమే తప్ప.. వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందే వెయ్యి సార్లు ఆలోచిస్తామని.. తీసుకున్నాక వెనక్కి వెళ్లేది లేదన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. నవంబరు 1న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు ప్రకటించారు. తొలుత బాపూఘాట్ నుంచి పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. నవంబరులో ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలతో చర్చలకు సిద్ధమన్నారు. త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు.
* మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రబృందం దృష్టి అంతా #SSMB29కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులపైనే ఉంది. ఈనేపథ్యంలో రాజమౌళి తాజాగా పంచుకున్న ఓ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఎడారి ప్రాంతంలో తిరుగుతున్న ఫొటో షేర్ చేసిన రాజమౌళి ‘కనుగొనడం కోసం తిరుగుతున్నా’ అని దానికి క్యాప్షన్ పెట్టారు. దీంతో ఆయన మహేశ్ సినిమా కోసం లొకేషన్స్ సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అప్‌డేట్ షేర్ చేయాలని అభిమానులు కోరుతున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త వైరలైన సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి ఏఐ టెక్నాలజీని వినియోగించనున్నట్లు వార్తలు వినిపించాయి. దీనికోసం ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెగ వైరలైంది. సినిమాలోని కొన్ని పాత్రలు, జంతువుల కోసం ఆయన ఏఐ టెక్నాలజీని ఉపయోగించనున్నారట. మాములుగానే రాజమౌళి సినిమాల్లో వీఎఫ్‌ఎక్స్‌లు భారీస్థాయిలో ఉంటాయి. ఇక ఈ సినిమాలో అవి రెట్టింపుగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
* మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ధర్మారం, టీకనపల్లి గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపింది. మంగళవారం బుగ్గగట్టు ప్రాంతంలో గొర్రెల మందపై దాడి చేసి మూడు గొర్రెలను హతమార్చింది. గమనించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పాదముద్రల ఆధారంగా పెద్దపులిగా గుర్తించారు. అప్రమత్తంగా ఉండాలని సమీప గ్రామాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
* టీమ్‌ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)పై ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) ప్రశంసలు కురిపించాడు. తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ బుమ్రానే అని పేర్కొన్నాడు. బ్యాటర్లను ఇబ్బందిపెట్టడానికి బుమ్రా వద్ద ఎన్నో అస్త్రాలు ఉంటాయని వివరించాడు. ‘‘నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా. అతను ప్రపంచంలోనే అన్ని ఫార్మాట్లలో ఆల్‌టైమ్ బెస్ట్ బౌలర్‌గా ఎదుగుతున్నాడు. అతను బంతిని వదిలే స్థానం భిన్నంగా ఉంటుంది. చివరి నిమిషంలో బంతి గమ్యాన్ని మార్చగలడు. ఎవరూ ఊహించనివిధంగా స్లో బాల్‌ను వేయగలడు. అద్భుతమైన యార్కర్‌ను సంధించగలడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం అతని సొంతం. బుమ్రాకు అద్భుతమైన మణికట్టు ఉంది. మంచి ఫాస్ట్ బౌలర్ వద్ద ఉండాల్సిన అన్ని అస్త్రాలు అతని దగ్గర ఉన్నాయి’’ అని మ్యాక్స్‌వెల్ పేర్కొన్నాడు.
* మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి నడుస్తోంది. నామినేషన్లు వేసే ఆఖరి నిమిషం వరకు అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడంలో ఒక కొలిక్కి రాలేకఇబ్బందిపడ్డాయి. మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్ (Nawab Malik)కు అజిత్ పవార్ (Ajit pawar) వర్గం ఎన్‌సీపీ (NCP) నుంచి టికెట్ లభించదని, ఆయన స్వతంత్రంగా పోటీచేస్తారని వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో ఆయన పోటీకి క్లియరెన్స్ వచ్చింది. దాంతో మాన్‌ఖుర్ద్- శివాజీనగర్ స్థానం నుంచి ఆయన నామినేషన్ వేశారు. మామూలుగా ఆయన సిట్టింగ్ స్థానం అణుశక్తి నగర్. అయితే అక్కడి నుంచి ఈసారి కుమార్తె సనా మాలిక్ బరిలో ఉండటంతో మాన్‌ఖుర్ద్- శివాజీనగర్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఇక్కడే శివసేన (శిందే వర్గం)(Shiv Sena) ట్విస్ట్ ఇచ్చింది. సురేశ్ పాటిల్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. మహారాష్ట్ర అధికార కూటమి ‘మహాయుతి’లో భాగమైన ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో కలిసే ముందుకెళ్తున్నాయి. కానీ ఈ స్థానంలో మాత్రం వేర్వేరుగా అభ్యర్థులను నిలబెట్టాయి. రెండూ మిత్రపక్షాలు కావడంతో ఇద్దరిలో ఎవరు తమ నామినేషన్‌ను ఉపసంహరించుకుంటారోనన్న విషయం ఆసక్తిగా మారింది.
* భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్.. ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో కలిసి ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుపై చర్చించారు. సమావేశం అనంతరం కపిల్ దేవ్ మీడియాతో మాట్లాడారు. ‘‘క్రీడలపై సీఎం చాలా ఆసక్తిగా ఉన్నారు. గోల్ఫ్ గురించి ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఇండియన్ గోల్ఫ్‌కు అధ్యక్షుడిగా ఉన్నా. ఎక్కడ భూమి ఇస్తారనేది ప్రభుత్వానిదే నిర్ణయం. స్పోర్ట్స్ సిటీ ఇస్తే చాలా సంతోషిస్తా’’ అని కపిల్ దేవ్ తెలిపారు. అనంతపురం, అమరావతి, విశాఖలో గోల్ఫ్‌కోర్సులు పెడతామని కేశినేని చిన్ని తెలిపారు. ‘‘ఏపీ అంబాసిడర్‌గా ఉండాలని కపిల్‌దేవ్‌ను కోరాం. రాష్ట్రంలో గోల్ఫ్ అభివృద్ధి చేయాలనే యోచనలో ఉన్నాం. గోల్ఫ్ డ్రైవింగ్‌కు రేంజ్‌లు సిద్ధం చేస్తాం. తదుపరి సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటాం. ఏపీ క్రీడాకారులు అంతర్జాతీయంగా ఆడేలా చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ క్రీడాకారులను వెలికి తీస్తాం’’ అని తెలిపారు.
* మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు (Maharashtra Assembly Elections) రసవత్తరంగా మారాయి. భాజపా-శివసేన- ఎన్సీపీ (అజిత్‌పవార్) నేతృత్వంలోని మహాయుతి (Mahayuti), కాంగ్రెస్-శివసేన (యూబీటీ)- ఎన్సీపీ (శరద్ పవార్) నేతృత్వంలోని మహా వికాస్ (Maha Vikas) అఘాడీ కీలక పోరుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహాయుతికి పెద్దన్నలా వ్యవహరిస్తున్న భాజపాతోపాటు కూటమిలోని మిగతా పార్టీలకు రెబల్స్ బెంగ పట్టుకుంది. పొత్తుల్లో భాగంగా పార్టీ సీనియర్ నేతలకు వారు కోరుకున్న స్థానాల్లో భాజపా సీట్లు కేటాయించలేకపోయింది. దీంతో వారంతా స్వతంత్రులుగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కీలక నియోజకవర్గాలైన బొరివలి, ముంబాదేవి, అకోలా పశ్చిమ నియోజకవర్గాల్లో ముఖ్యమైన నేతలు తిరుగుబావుటా ఎగురవేయడం పార్టీ అధిష్ఠానాన్ని చిక్కుల్లో పడేసింది.
* మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ సన్నిహితుడే తనకు వెన్నుపోటు పొడిచాడని ఆరోపించారు. మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి ఆర్‌ఆర్ పాటిల్‌ను ఉద్దేశిస్తూ అజిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. నీటిపారుదల కుంభకోణం కేసులో తనపై విచారణకు ఆదేశించడం ద్వారా వెన్నుపోటు పొడిచారని ఆర్‌ఆర్ పాటిల్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘నీటిపారుదల కుంభకోణంలో నాపై ఆరోపణలు వచ్చాయి. నన్ను అప్రతిష్ఠ పాలు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రాజెక్టులో రూ.70వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణ చేయాలని నిర్ణయించారు. అసలు దానికయ్యే ఖర్చు రూ.42వేల కోట్లు అయితే, దాదాపు అంతకు రెట్టింపు కుంభకోణం జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించి ఓ ఫైల్ తయారు చేసి హోంమంత్రిత్వశాఖ (ఆర్‌ఆర్ పాటిల్)కు పంపించారు. ఆయన దానికి అంగీకరిస్తూ నాపై విచారణ చేపట్టాలని నోట్‌లో రాశారు. ఇది కచ్చితంగా వెన్నుపోటు పొడవటమే. సన్నిహితుడే అలా చేయడంతో తీవ్ర కలత చెందాను’’ అని అజిత్ పవార్ పేర్కొన్నారు.
* మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దిల్లీలోని ఏఐఐఏ నుంచి వర్చువల్‌గా ఆయన ఈ సేవలను ఆవిష్కరించారు. అనంతరం ఎయిమ్స్‌లో అధికారులు ప్రయోగాత్మకంగా డ్రోన్ పరీక్ష చేపట్టారు. ఎయిమ్స్ నుంచి నూతక్కి పీహెచ్‌సీ వరకూ డ్రోన్‌ను పంపించారు. ఓ మహిళా రోగి నుంచి రక్త నమూనా సేకరించి ఎయిమ్స్‌కు అది తిరిగొచ్చింది. ఎయిమ్స్ నుంచి ఈ పీహెచ్‌సీ దాదాపు 12 కి.మీ దూరంలో ఉంది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డ్రోన్ల ఉపయోగంపై ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
* కష్ట కాలంలో అండగా ఉండాల్సిన నాయకులే పట్టించుకోకపోతే ఎలా అని వైకాపా కార్యకర్తలు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని నిలదీశారు. కృష్ణా జిల్లా పామర్రులో మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ ఇంటికి సజ్జల వచ్చారు. ఈ విషయం తెలుసుకుని పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. నేతలతో మాట్లాడి ఆయన వెళ్లిపోతుండగా.. కార్యకర్తలు అడ్డుకుని నిలదీశారు. ఇంతమంది కార్యకర్తలు వస్తే కనీసం పలకరించకుండా వెళ్లిపోవడమేంటని ప్రశ్నించారు. ధైర్యంగా ఉండి పార్టీ కోసం పోరాడాలనే భరోసా ఇవ్వకుండా అలా ఎలా వెళ్లిపోతారని నిలదీశారు. దీంతో చేసేదేమీ లేక సజ్జలతో పాటు అక్కడి నేతలు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
* ఓ ఖాళీ స్థలంపై కన్నేసిన కొందరు.. ఏకంగా ఆ స్థలం యజమాని మృతి చెందినట్లు నకిలీ ధ్రువపత్రాన్ని సృష్టించారు. సబ్ రిజిస్ట్రార్ సాయంతో రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఇందులో కీలక సూత్రధారిగా ఉన్న భారాస మహిళా నేత, మరో ఐదుగురిని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు సబ్‌రిజిస్ట్రార్ జ్యోతిని మంగళవారం అరెస్టు చేసి మేడ్చల్ కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది.
* మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ముందడుగు వేయడమే తప్ప.. వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందే వెయ్యి సార్లు ఆలోచిస్తామని.. తీసుకున్నాక వెనక్కి వెళ్లేది లేదన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. నవంబరు 1న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు ప్రకటించారు. తొలుత బాపూఘాట్ నుంచి పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. నవంబరులో ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలతో చర్చలకు సిద్ధమన్నారు. త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు.
* రైతులు తీసుకొచ్చిన పత్తిలో కోత విధిస్తే సహించేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వేబ్రిడ్జి కాటాలో తేడా వస్తే మిల్లు సీజ్ చేయిస్తామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడారు. ‘‘ఈ సంవత్సరం అధిక వర్షాలతో రైతులు పత్తి పంట నష్టపోయారు. తొమ్మిది సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. వారికి ఎక్కడా ఇబ్బంది కలగకూడదని విప్లవాత్మక మార్పులు చేశాం. ఇప్పటికే రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశాం. రుణమాఫీపై ప్రతిపక్షాలు కారుకూతలు కూస్తున్నాయి. అర్హులైన రైతులందరికీ తల తాకట్టు పెట్టయినా రుణమాఫీ చేస్తాం. డిసెంబర్‌లోపే రూ.13 వేల కోట్ల రుణమాఫీ అమలు చేస్తాం.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z