డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్(డిటిఎ) ఆధ్వర్యంలో శనివారం నాడు స్థానిక హిందు దేవాలయంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. స్థానిక చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. రఘు కుంచే-అంజనా సోమ్యాల సంగీత విభావరి అలరించింది. “చక్రవాకం” ఫేమ్ ఇంద్ర నీల్ ప్రత్యేక ప్రదర్శన ఆకట్టుకుంది.
30 ఏళ్లకు పైగా డిటిఎలో కీలకంగా ఉన్న వెంకట్ ఎక్కకు వడ్లమూడి వెంకట రత్నం అవార్డు, సన్నీ రెడ్డికి డిటిఎ కమ్యూనిటీ లీడర్ షిప్ అవార్డు, జ్ఞానేశ్వర గుబ్బలకి డిటిఎ అవుట్స్టాండిరగ్ కమ్యూనిటీ సర్వీస్ అవార్డును ప్రదానం చేశారు.
ఈ వేడుకలకు మేరిలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణ కాట్రగడ్డ మిల్లర్ హాజరై, ప్రవాసులు భవిష్యత్ నిర్మాణంలో కీలకమని స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. డిటిఎ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సుబ్రతా గడ్డం, రాజా తొట్టెంపూడి, కుసుమ కళ్యాణి అక్కిరెడ్డి, అర్చన చవళ్ల, మంజీరా పాలడుగు, ప్రణీత్ వెళ్లొరె, స్వప్న ఎల్లెందుల, తేజ్ కైలాష్, సంజీవ్ పెడ్డి తదితరులు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z