NRI-NRT

10వ వార్షికోత్సవం జరుపుకున్న సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం

10వ వార్షికోత్సవం జరుపుకున్న సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం

సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం దశమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సహస్ర లింగార్చన, కుంకుమార్చన, లక్ష బిల్వార్చన తదితర పూజాది కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దాదాపు 50 మంది తెలుగు బ్రాహ్మణ రుత్వికులు ఇందులో పాల్గొన్నారు. లిటిల్ ఇండియా ఆర్య సమాజ్ ప్రాంగణం వేదికగా జరిగిన ఈ పూజా క్రతువులో గణపతి పూజ, పుణ్యాహవచనం, మృత్తికా శోధన, మహన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు. పుట్ట మన్నుతో 1136 శివ లింగములు చేసి వాటిని మంత్ర పూర్వకంగా మూల మంత్రముతో అర్చన చేశారు. ఆ తర్వాత లలిత సహస్రనామములతో హరిద్రాకుంకుమార్చన నిర్వహించారు. సహస్రనామ పూర్వక లక్ష బిల్వార్చనా అంతర్గత రుద్రాక్రమార్చన పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో చేశారు.

ఈ కార్యక్రమాన్ని సింగపూర్ బ్రాహ్మణ సమాజ బ్రహ్మలు ప్రసాద్ కప్పగంతుల, నేమాని సత్య రమేశ్‌, రాజేశ్‌ శ్రీధర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించగా, భారతదేశం నుంచి వచ్చిన ఘనాపాఠి వంశీ(రాధే) సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వర్కింగ్ టీం సభ్యులు గణపతి శాస్త్రి ఆకెళ్ళ, సూర్య పవన్ యనమండ్ర, వంశీ కృష్ణ శిష్ట్లా, ముఖ్యదాతలు రంగనాథ్ వల్లభజోస్యుల, ఆదిత్య కర్రా , రామన్, భాను ఆకుండి, సంపూర్ణ స్వదేశ్, వీర ఫ్లవర్స్, వేద ఫ్లవర్స్ వాలంటీర్స్ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేశారు. వేదికను అందించిన ఆర్యసమాజ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న రిత్విక్‌లు, భక్తులకు పెరుమాళ్ దేవాలయం ప్రసాద వితరణ చేసింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతిఒక్కరికి నిర్వాహకులు శ్రీప్రదాయ చల్లా, రాజేష్ యనమండ్ర, వేణు మాధవ్ మల్లవరపు, రత్నకుమార్ కవుటూరు ధన్యవాదాలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z