బ్రూక్స్విక్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు నూతన వస్త్రాలు ధరించి కాలుష్య రహితమైన దీపావళి టపాసులు కాలుస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెలుగు రాష్ట్రాలలో పండుగలను తలపించేలా అమెరికాలో దీపావళి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కిశోర్ కంచర్ల మాట్లాడుతూ… తెలుగువారందరూ ఒకచోట చేరి అన్ని పండుగలు సంప్రదాయబద్ధంగా జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కిశోర్ కంచర్ల, అరవింద యడ్లపాటి సమన్వయపరిచారు. ఈ కార్యక్రమంలో రాజేశ్ కొల్లి, రూపేష్ చౌదరి కోనేరు, రమేష్ గరికపాటి, మురళీకృష్ణ ఇంటూరి, వాసు తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z