NRI-NRT

వైభవంగా చికాగో ఆంధ్ర సంఘం సాంస్కృతిక దినోత్సవం

వైభవంగా చికాగో ఆంధ్ర సంఘం సాంస్కృతిక దినోత్సవం

చికాగో ఆంధ్ర సంఘం(CAA) సాంస్కృతిక దినోత్సవ వేడుకలు శనివారం నాడు ఓస్వెగొ ఈస్ట్ హైస్కూల్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.
సంస్థ అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి, ఛైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు, ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి పర్యవేక్షించారు. సంస్థ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ధర్మకర్తలు, వ్యవస్థాపకులు దీపప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి ఈ ఏడాది పొడవునా సంస్థ నిర్వహించిన అన్ని కార్యక్రమాలు విజయవంతమవడానికి ఆర్ధిక సహాయాన్ని అందించిన స్పాన్సర్లను సత్కరించారు. ఈ కార్యక్రమానికి కాన్సలర్‌ జనరల్ ఆఫ్‌ ఇండియా (Consular general of India), సోమనాధ్ ఘోష్ విశిష్ట అతిధిగా హాజరయి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నేపర్విల్ల్ సిటీ కౌన్సిల్ బరిలో ఉన్న మేఘనా బన్సాల్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. పూర్వ అధ్యక్షులు గౌరీశంకర్-రాధికలను సత్కరించారు. 2025 సంవత్సరానికి అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న శ్రీకృష్ణ మతుకుమల్లి టీం 2025ను సభకు పరిచయం చేశారు. 2026 సంవత్సరానికి అధ్యక్షురాలిగా తమిశ్ర కొంచాడను ప్రకటించారు.
 సంస్థ సేవా విభాగమైన చికాగో ఆంధ్ర ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను సవితా మునగ-అనురాధ గంపాలలు వివరించారు.

రెండు భాగాలుగా నిర్వహించిన ఈ కార్యక్రమం తొలి భాగం గురుకిృప మ్యూజిక్ స్కూల్ వైదేహి చంద్రశేఖరన్ విద్యార్థుల గీతాలాపన, నృత్య రూపకాలు, నాట్య ప్రదర్శనలు, ప్రవాసుల సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించింది. కూచిపూడి నృత్య గురువు జానకి ఆనందవల్లి నాయర్ విద్యార్ధుల థిల్లాన మంత్రముగ్ధులను చేసింది. రెండో భాగంలో భోజనానంతర కార్యక్రమాన్ని “రాగిన్” తెలుగు బాండ్ (Raagin – First Telugu Band in USA) ఫ్యూజన్ సంగీతంతో అలరించారు.

నరేశ్ చింతమాని, మురళి రెడ్డివారి, గిరిరావు కొత్తమాసు, శ్రీనివాస్ పద్యాల, సురేష్ ఐనపూడి, బోస్ కొత్తపల్లి, మల్లిక్ గోలి, సతీష్ పసుపులేటి, నరసింహా రెడ్డి ఒగ్గు, సునీల్ ఆకులూరు, రాజు బొజ్జ, కళ్యాణ్ కొండిశెట్టి, సుబ్బు బెస్త, చందు గంపాల, అనురాధ గంపాల, శ్రీకాంత్ ప్రెక్కి, మార్కండేయులు కందుల, రామకృష్ణ దోనూరి, సునీల్ చిట్లూరి, సాయిప్రకాశ్ ఆళ్ళ, నరేంద్ర నూకల, శాంతి చిట్లూరి, వీరబ్రహ్మం ఆదిమూలం, రాఘవ జాట్ల, ఆశ్రిత్ కొత్తపల్లి, శివ జాట్ల, లక్ష్మణ్ రెడ్డిశెట్టి, లక్ష్మణ్ చల్లా, అనిల్ మానేపల్లి, రామారావు కొత్తమాసు, మెహెర్ కటకం, శ్రీను అర్వపల్లి, సురేష్ గ్రంధి, శ్రీశైలేష్ మద్ది, విజయ్ దారా, శ్రీనివాస్ రాచపల్లి, సూర్య దాట్ల, అరుణ దాట్ల, కృష్ణ జాస్తి , తమిశ్ర కొంచాడ, శ్రీవాసవి టెంకుమళ్ళ, ప్రియ మతుకుమల్లి, నరసింహారావు వీరపనేని, రామారావు కొత్తమాసు, సుజాత అప్పలనేని, పావని కొత్తపల్లి, సమత పెద్దమారు, శైలజ సప్ప, అనూష బెస్త, మాధవ్, శ్రీనివాస్ సుబుద్ధి, బోస్ కొత్తపల్లి, శ్రీ కృష్ణ మతుకుమల్లి, పద్మారావు అప్పలనేని, మాలతి దామరాజు, జై అనికేత్ మేడబోయిన, విశృత్ చింతపల్లి, రితేష్ బొమ్మినేని,శ్వేత కొత్తపల్లి, కళ్యాణ్ కొత్తపల్లి, ఆద్య బెస్త, శ్వేతిక బొజ్జ, శ్రీనివాస్ పద్యాల, సిరిప్రియ బచ్చు, రీతిక భోగాది, శ్రియ కొంచాడ, కావ్య శ్రీ చల్లా, పద్మారావు అప్పలనేని, అనురాధ గంపాల, హరచంద్ గంపాల, శ్రీశైలేష్‌ మద్ది, మురళీ రెడ్డివారి, గిరిరావు కొత్తమాసు, లోహిత గంపాల, రితేష్ బొమ్మినేని, సువిజ్ఞ వీర్, మనస్వి తూము, కావ్య శ్రీ చల్లా, అన్వితా పంచాగ్నుల, లక్ష్మి నాగ్ సూరిభొట్లలు సహకరించారు. సంస్థ కార్యదర్శి గిరిరావు కొత్తమాసు వందన సమర్పణ చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z