* స్టార్‌లైనర్‌లో తలెత్తిన సమస్యల వల్ల అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఇద్దరు నాసా (NASA) వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita williams), బుచ్ విల్‌మోర్ భూమికి తిరిగివచ్చేందుకు వచ్చే ఏడాది వరకు ఆగాల్సి వచ్చింది. జూన్ 5న వీరిని తీసుకెళ్లిన స్టార్‌లైనర్ ప్రొపల్షన్ వ్యవస్థలో తీవ్ర సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాసా వెల్లడించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఎక్కువ రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండటం వల్ల సునీత విలియమ్స్ అనారోగ్యానికి గురయినట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. అందులో సునీతా విలియమ్స్ బరువు తగ్గినట్లుగా, బుగ్గలు లోపలికి వెళ్లినట్లుగా కనిపిస్తున్నారు. ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని, అందువల్లే బలహీనంగా కనిపిస్తున్నారని అమెరికాకు చెందిన శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిపుణుడు డాక్టర్ వినయ్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు.
* సాంకేతిక సమస్య కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. మద్యం డిపోల నుంచి డీలర్లు మద్యం తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మద్యం సరఫరా పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి లోపు సర్వర్ సమస్య పరిష్కారమవుతుందని అధికారులు చెబుతున్నారు.
* అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US Elections 2024) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విజయ దుందుభి మోగించారు. తన ప్రత్యర్థి కమలా హారిస్ (Kamala harris)తో జరిగిన ఉత్కంఠ పోరులో మ్యాజిక్ ఫిగర్ (270) దాటేసి అపూర్వ విజయం సాధించారు. పలు సర్వేలు ఆయనకు వ్యతిరేకంగానే ఫలితాలు వస్తాయని అంచనా వేసినా.. ఎలాంటి నిరుత్సాహానికి గురికాకుండా తనదైన తెంపరితనంతో ప్రచారం చేసిన ట్రంప్.. రెండోసారి అధ్యక్ష పీఠం దక్కించుకొని తన సత్తా చాటారు. పలు సంచలనాలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే ట్రంప్ అమెరికా ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించి మరోసారి అధ్యక్ష పీఠం అధిరోహించబోతున్నారు.
* కివీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ అవమానకర రీతిలో 0-3తో కోల్పోయింది. న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం చవిచూసిన టీమ్‌ఇండియా ఇప్పుడు కీలక సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) ప్రారంభంకానుంది. త్వరలోనే భారత జట్టు ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది. ఈ సిరీస్‌కు సీనియర్ పేసర్ మహ్మద్ షమి (Mohammed Shami) అందుబాటులో లేడు. అతడు ఇంకా గాయం నుంచి పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో ఎంపిక చేయలేదు. పేస్ బౌలింగ్‌కు అనుకూలించే ఆస్ట్రేలియా పిచ్‌లపై షమి ఇంతకుముందు సిరీస్‌ల్లో మంచి ప్రభావం చూపించాడు. ఇప్పుడతను లేకపోవడం టీమ్‌ఇండియాకు గట్టిదెబ్బే. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ బోర్డర్-గావస్కర్ ట్రోఫీ గురించి మాట్లాడాడు. సిరీస్‌ను ఆసీస్ 3-1తో కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. షమి ఆడకపోవడం ఆస్ట్రేలియాకు కలిసొస్తుందని పేర్కొన్నాడు.
* అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాల్లో ఇండియన్ అమెరికన్లు జోరు చూపించారు. ప్రతినిధుల సభ (House of Representatives)కు ఆరుగురు ఎన్నికయ్యారు. గతంలో ఆ సంఖ్య ఐదుగాఉండేది. శ్రీ తానేదార్, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, డాక్టర్ అమిబెరా, ప్రమీలా జయపాల్ మరోసారి విజయం దక్కించుకున్నారు. వారితో పాటు న్యాయవాది అయిన సుహాస్ సుబ్రహ్మణ్యం (Suhas Subramanyam) వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ పార్టీ తరఫున గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మైక్ క్లాన్సీపై విజయం సాధించారు. ఈ సరికొత్త విజయంతో సమోసా కాకస్ (ప్రతినిధుల సభ, సెనెట్‌కు ప్రాతినిధ్యం వహించే ఇండియన్ అమెరికన్ల గ్రూప్)లో సభ్యుల సంఖ్య ఆరుకు చేరింది.
* దసరా ఉత్సవాల సందర్భంగా పున్నమి ఘాట్ వద్ద ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శక్తి విజయోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆధ్యాత్మికత, సాధికారత మేళవింపుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. విజయదశమిని జరుపుకోవడానికి 25 వేల మందికి పైగా ప్రజలు మూడు రోజుల పాటు ఒక చోట చేరడం విశేషం. మహిళల్లోని బలం, ధైర్యాన్ని సూచించేలా శక్తి విజయోత్సవం నిర్వహించారు. నదీ తీరంలో సూర్యుడు అస్తమిస్తుండగా.. ఘాట్‌లు మరింత అద్భుతంగా కనిపించాయి. శంఖనాదాలు, పవిత్ర మంత్రోచ్ఛారణల నడుమ మహా హారతి కార్యక్రమం జరిగింది. దుర్గా మాత నవ అవతారాలను సూచించే విధంగా తొమ్మిది మెగాబోట్లు కృష్ణా నదిలో ప్రయాణిస్తూ మరింత శోభను తీసుకొచ్చాయి. ఈ సందర్భంగా 300 మందికి పైగా మహిళా కళాకారులు, ప్రదర్శనకారులు అనేక నృత్య రూపకాలు.. ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.
* అమెరికాకు 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ (Trump) రెండోసారి అధికారం చేపట్టనున్నారు. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ (JD Vance) వ్యవహరించనున్నారు. అంటే ఆంధ్రా అల్లుడు అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షుడు కానున్నరన్నమాట. ఆయన భార్య ఉష (Usha chilukuri vance) తెలుగమ్మాయి కావడం ఇందుకు నేపథ్యం. ఆమె అమెరికాకు సెకండ్ లేడీగా వ్యవహరించబోతున్నారన్నమాట. ఒహాయో రాష్ట్ర సెనేటర్‌గా జేడీ వాన్స్‌ను ఉపాధ్య అభ్యర్థిగా ట్రంప్ ఎంపిక చేసుకున్నప్పటి నుంచే ఉష పేరు మార్మోగింది. ఎన్నికల్లో రిపబ్లికన్ల విజయం వేళ ఆమె పేరు మరోసారి తెరపైకి వచ్చింది.
* అమెరికా ఎన్నికల ఫలితాలు (US Election Results) వెల్లడవుతున్నాయి. ఈనేపథ్యంలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో డెమోక్రటిక్ అభ్యర్థి నాన్సీ పెలోసీ (Nancy Pelosi) విజయం సాధించారు. కాలిఫోర్నియాలోని 12వ కాంగ్రెషనల్ డిస్ర్టిక్ట్‌కు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, తాజా ఫలితాలతో ప్రతినిధుల సభ ఎన్నికల్లో 20వ సారి గెలిచిన మహిళగా నాన్సీ నిలిచారు. 1987లో తొలిసారిగా కాలిఫోర్నియాలో జరిగిన ప్రత్యేక ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. ఆ తర్వాత అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి మహిళా స్పీకర్‌గా చరిత్ర సృష్టించారు. 2007- 2011 వరకు, ఆ తర్వాత 2019- 2023 వరకు హౌస్ స్పీకర్‌గా వ్యవహరించారు. మరోవైపు అమెరికా కాంగ్రెస్ చరిత్రలో డెమోక్రటిక్ పార్టీ నుంచి ఎక్కువ కాలం పనిచేసిన నాయకురాలుగా నిలిచారు. ట్రంప్ హయాంలో ఆయనకు, నాన్సీకి మధ్య తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ట్రంప్‌పై అభిశంసన తీర్మానం వంటి ముఖ్యమైన ప్రక్రియల్లో డెమోక్రటిక్ పార్టీకి నాయకత్వం వహించారు.
* అమెరికా (USA).. మహిళా అధినేతకు దూరంగానే ఉంటోంది. 248 ఏళ్ల ఆ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇప్పటి వరకూ ‘వుమెన్ ప్రెసిడెంట్’ పాలన లేదు. ఈ అగ్ర పీఠం కోసం కొందరు మహిళలు పోటీ పడినప్పటికీ.. విజయ తీరాలకు చేరుకోలేకపోయారు. తాజాగా భారత సంతతి వ్యక్తి కమలా హారిస్ (Kamala Harris) కూడా డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఓవల్ ఆఫీస్‌కు దూరంగానే ఉండిపోయారు. సింగపూర్, ఫిన్లాండ్ సహా అనేక దేశాల్లో మహిళలే సారథులు ఉండి దేశాన్ని నడిపిస్తున్నారు. కానీ, అమెరికాలో మాత్రం మహిళలు ఓటు హక్కు పొందేందుకే అనేక ఏళ్లు వేచిచూడాల్సి వచ్చింది. 1920లో అమెరికా మహిళలకు ఓటు హక్కు లభించినప్పటికీ.. అది కొందరికే పరిమితమైంది. ఏళ్ల పోరాటం అనంతరం చివరకు 1960ల్లో అన్ని వర్గాల మహిళలకు అమెరికాలో ఓటు హక్కు దక్కింది. ఈ క్రమంలో రాజకీయ చైతన్యం పొందిన వారు.. చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అధ్యక్ష పీఠానికి మాత్రం దగ్గర కాలేకపోతున్నారు.
* అగ్రరాజ్యం అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎన్నికయ్యారు. అమెరికాలోని పత్రికలు జరిపిన సర్వేలన్నీ ఆయనకు వ్యతిరేకమని తేల్చినా.. ప్రజలు మాత్రం అండగా నిలిచారు. కొంత విరామంతో ఒక అభ్యర్థి అమెరికా అధ్యక్ష స్థానంపై తిరిగి కూర్చోవడం 131 ఏళ్ల తర్వాత ఇదే. అంతేకాదు.. ఎన్నికలకు ముందు కోర్టు కేసులు ఇబ్బంది పెట్టినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా చివరి వరకూ పోరాడారు. 2016 నాటి ఫలితాలకు భిన్నంగా ఈసారి పాపులర్ ఓటు కూడా ట్రంప్‌నకే లభించింది. ఆయనకు దాదాపు 51 శాతానికి పైగా ఓట్లు లభించగా.. హారిస్ (Kamala Harris) 47 శాతం వద్దే ఆగిపోయారు. సంప్రదాయ రిపబ్లికన్ రాష్ట్రాలను నిలబెట్టుకోవడంతో పాటు.. గంపగుత్తగా స్వింగ్ స్టేట్స్ ఏడింటా ట్రంప్ హవా నడిచింది. ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణం, ఉద్యోగాలు, వేతనాలు, అక్రమ చొరబాట్లు వంటి అంశాలు ఈ ఎన్నికల్లో తిరుగులేని విధంగా ప్రభావాన్ని చూపాయి.
* అగ్రరాజ్యం అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎన్నికయ్యారు. అమెరికాలోని పత్రికలు జరిపిన సర్వేలన్నీ ఆయనకు వ్యతిరేకమని తేల్చినా.. ప్రజలు మాత్రం అండగా నిలిచారు. కొంత విరామంతో ఒక అభ్యర్థి అమెరికా అధ్యక్ష స్థానంపై తిరిగి కూర్చోవడం 131 ఏళ్ల తర్వాత ఇదే. అంతేకాదు.. ఎన్నికలకు ముందు కోర్టు కేసులు ఇబ్బంది పెట్టినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా చివరి వరకూ పోరాడారు. 2016 నాటి ఫలితాలకు భిన్నంగా ఈసారి పాపులర్ ఓటు కూడా ట్రంప్‌నకే లభించింది. ఆయనకు దాదాపు 51 శాతానికి పైగా ఓట్లు లభించగా.. హారిస్ (Kamala Harris) 47 శాతం వద్దే ఆగిపోయారు. సంప్రదాయ రిపబ్లికన్ రాష్ట్రాలను నిలబెట్టుకోవడంతో పాటు.. గంపగుత్తగా స్వింగ్ స్టేట్స్ ఏడింటా ట్రంప్ హవా నడిచింది. ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణం, ఉద్యోగాలు, వేతనాలు, అక్రమ చొరబాట్లు వంటి అంశాలు ఈ ఎన్నికల్లో తిరుగులేని విధంగా ప్రభావాన్ని చూపాయి.
* విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ వైకాపా నేత, ఎంపీ విజయసాయి రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నవంబరు 15 నుంచి 30 వరకు అమెరికా, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. విజయసాయి పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన సీబీఐ.. అనుమతి ఇవ్వొద్దని కోర్టుకు విన్నవించింది. అయితే, ట్రయల్ కోర్టు గతంలో విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ నెల 8 వరకు తీర్పును రిజర్వ్ చేసింది.
* అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌నకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. తమ దేశాన్ని ముందుకు నడిపించే ప్రక్రియలో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ట్రంప్ మొదటి పదవీ కాలంలో ఇండో-యూఎస్ సంబంధాలు గణనీయంగా బలోపేతమయ్యాయని చంద్రబాబు గుర్తు చేశారు.
* తెలంగాణలో రాజకీయ, విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రారంభించామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. సర్వే ఆధారంగా న్యాయపరంగా హక్కును కల్పించనున్నట్లు చెప్పారు. ఈ సర్వేతో రేషన్‌కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు పోతాయని అపోహలు చెందుతున్నారని, ఏ కార్డులు పోవని సంక్షేమ పథకాలను అభివృద్ధి చేసేందుకే ఈ సర్వే చేస్తున్నామని మంత్రి వివరించారు.
* విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. పీఎం-విద్యాలక్ష్మి (PM Vidyalaxmi scheme) పథకానికి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
* న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టులో రెండు అర్ధ సెంచరీలు చేసిన రిషభ్ పంత్ మళ్లీ (Rishabh Pant) ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి దూసుకొచ్చాడు. పంత్ ఐదు స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచాడు. కివీస్‌తో సిరీస్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) కేవలం 93 పరుగులే చేసి తీవ్ర నిరాశపర్చాడు. అతడు ఎనిమిది స్థానాలు దిగజారి టాప్-20 ర్యాంకింగ్స్ నుంచి బయటికి వచ్చాడు.
* ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా గూగుల్ (Google) తన యాప్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది. కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌కు పరిమితమైన మెసేజ్ ఎడిట్ ఫీచర్‌ను పరిచయం చేసిన గూగుల్.. తాజాగా మరో సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. త్వరలోనే తన యాప్ వేదికగా హెచ్‌డీ, హెచ్‌డీ + ఫొటోలు పంపేందుకు యూజర్లకు వీలు కల్పించనుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z