* తెలంగాణ హైకోర్టులో మార్గదర్శికి ఎదురుదెబ్బ తగిలింది. ఖాతాదారుల వివరాలను పిటిషనర్ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు పెన్‌డ్రైవ్‌లో ఇవ్వాల్సిందేనని కోర్టు గురువారం ఆదేశించింది. ఫిజికల్ కాపీ ఉన్నప్పుడు.. పెన్‌డ్రైవ్‌లో వివరాలు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని ఈ సందర్భంగా మార్గదర్శి తరఫు లాయర్‌ను ప్రశ్నించింది న్యాయస్థానం. ఉండవల్లికి పెన్‌డ్రైవ్‌లోని వివరాలు ఇవ్వాల్సిందేనని కోర్టు తెలిపింది. ఎస్ క్రో అకౌంట్‌లో ఉన్న డబ్బులు ఎవరివో మార్గదర్శి చెప్పాలంటూ ఉండవల్లి కోర్టులో వాదనలు వినిపించారు. చందాదారులు ఎందుకు డబ్బులు తీసుకోవటం లేదో మార్గదర్శి చెప్పాలన్నారు. తాను బాధిత ప్రజల కోసం పోరాడుతున్నానని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. లూద్రా లాగా లిటిగెంట్ కోసం పోరాటం చేయటం లేదని తెలిపారు. అనంతరం పిటిషన్ విచారణను వాయిదా వేసింది.
* ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy IPO) రెండో రోజైన గురువారం నాటికి 35 శాతం మాత్రమే అందుకుంది. మొత్తం 16 కోట్ల షేర్లకు గానూ 5.56 కోట్ల షేర్లకు మాత్రమే బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్ పోర్షన్ 84 శాతం సబ్‌స్క్రిప్షన్ పొందగా.. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల కోటా 28 శాతం, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ కోటా 14 శాతం చొప్పున సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. మొత్తం రూ.11,327 కోట్లు సమీకరించేందుకు ఉద్దేశించిన ఐపీఓ రేపటి వరకు కొనసాగనుంది. ధరల శ్రేణిని రూ.371-390గా కంపెనీ నిర్ణయించింది. ఇందులో తాజా షేర్ల జారీ ద్వారా రూ.4,499 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.6828 కోట్లు సమీకరించనుంది. తొలిరోజు 12 శాతం మాత్రమే సబ్‌స్క్రిప్షన్ మాత్రమే అందుకుంది.
* ఇప్పటికే ఆర్థికంగా కుదేలవుతున్న దిగ్గజ దేశీయ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్‌వేస్’కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. లిక్విడేషన్‌కు ఆదేశాలు జారీ చేస్తూ గురువారం తీర్పునిచ్చింది. సంస్థకు సంబంధించిన ఆస్తుల విక్రయాలకు లిక్విడేటర్‌ను నియమించాలని ‘నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్’ (NCLAT) ముంబయి బెంచ్‌ను ఆదేశించింది. దివాలా పరిష్కార ప్రక్రియలో కంపెనీ విఫలమైన కారణంగా.. కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. రుణదాతలు, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో భారతీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ శకం ముగిసినట్లే అని స్పష్టమవుతోంది. ఆర్ధిక పరిస్థితులు మందగించడం చేత 2019లోనే జెట్ ఎయిర్‌వేస్ తన కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్‌లో ముందడుగు వేసింది. ఈ వ్యవహారం అప్పట్లోనే ఎన్‌సీఎల్‌టీ దృష్టికి వెళ్ళింది. దివాళా ప్రక్రియకు బీజం అక్కడే పడింది. ఆ తరువాత బిడ్డింగ్‌లో జెట్ ఎయిర్‌వేస్‌ను.. జలాన్ కర్లాక్ కన్సార్షియం దక్కించుకుంది. జెట్ ఎయిర్‌వేస్‌ను.. జలాన్ – కర్లాక్ కన్సార్షియం దక్కించుకోవడంలో.. రుణదాతల నుంచి కొంత వ్యక్తిరేఖత మొదలైంది. అదే సమయంలో స్టాట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని రుణదాతలందరూ కలిసి ఎన్‌సీఎల్‌టీకు వెళ్లారు. ఈ క్రమంలో యాజమాన్య హక్కుల బదిలీ విషయంలో ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన ఆదేశాలను అప్పిలేట్ ట్రైబ్యునల్ కూడా సమర్ధించింది. కానీ ఈ ఆదేశాలకు రుణదాతలు నచ్చలేదు. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారా? అయితే ఈఎమ్ఐ చెల్లిస్తున్న వారు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన.. హెచ్‌డీఎఫ్‌సీ తాజాగా కొన్ని పీరియడ్ లోన్‌లపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) ఐదు బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఇది హోమ్ లోన్‌లు, పర్సనల్ లోన్‌లు, ఆటో లోన్‌లతో సహా అన్ని రకాల ఫ్లోటింగ్ లోన్‌ల ఈఎంఐను ప్రభావితం చేస్తుంది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు పెరగడం వల్ల వడ్డీ రేట్లు ఇప్పుడు 9.15 శాతం నుంచి 9.50 శాతం మధ్య ఉన్నాయి. కొత్త వడ్డీ రేట్లు ఈ రోజు నుంచే (నవంబర్ 7) అమలులోకి వస్తాయి. ఎంసీఎల్‌ఆర్ పెరిగినప్పుడు, లోన్ వడ్డీ పెరుగుతుంది. దీంతో లోన్ కడుతున్న కస్టమర్ల ఈఎంఐ కూడా పెరుగుతుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z