NRI-NRT

అర టన్ను ఆహారాన్ని విరాళంగా అందజేసిన నాట్స్

అర టన్ను ఆహారాన్ని విరాళంగా అందజేసిన నాట్స్

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) డల్లస్ విభాగం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు వివిధ రకాల ఆహార పదార్ధాలు, వెయ్యికి పైగా ఫుడ్ క్యాన్స్‌ను సేకరించింది. వీటిని టెక్సాస్ ఫుడ్ బ్యాంక్‌కు నాట్స్ సభ్యులు అందించారు. 918 పౌండ్లు బరువు (500కిలోలు) ఉన్న ఆహారపు పదార్ధాలను ఫుడ్ బ్యాంక్‌కు ఇవ్వడం ద్వారా దాదాపు 765 మందికి ఒక పూట భోజన సదుపాయం కల్పించవచ్చని నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంకు తెలిపింది.

గత పద్నాలుగు ఏళ్లుగా ప్రతి సంవత్సరం నాట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నాట్స్ మాజీ అధ్యక్షుడు బాపు నూతి, కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రవణ్ నిడిగంటి, అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల, డల్లాస్ చాప్టర్ సభ్యులు శ్రీధర్ న్యాలమడుగుల, బద్రి బియ్యపు, ఉదయ్ పాకలపాటి, నాట్స్ యువ సభ్యులు వేద శ్రీచరణ్, అద్వైత్, అర్ణవ్, అరిహంత్, అథర్వ్‌లతో పాటు నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల, ఎస్సీ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, నాట్స్ జాయింట్ కోశాధికారి రవి తాండ్ర, మీడియా రిలేషన్స్ కోఆర్డినేటర్ కిషోర్ నారె తదితరులు పాల్గొన్నారు. డల్లాస్ విభాగాన్ని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటిలు అభినందించారు. 2025 జులైలో టాంపాలో నాట్స్ 8వ ద్వైవార్షిక సంబరాలు నిర్వహిస్తున్నారు. వివరాలకు https://www.sambaralu.org/ సందర్శించవచ్చు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z