Kids

ఏపీ నాటక అకాడమీ అధ్యక్షుడిగా గుమ్మడి గోపాలకృష్ణ

ఏపీ నాటక అకాడమీ అధ్యక్షుడిగా గుమ్మడి గోపాలకృష్ణ

ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణను ఏపీ నాటక అకాడమీ అధ్యక్షుడిగా నియమించారు. నేడు తెదేపా విడుదల చేసిన జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. తనపై ఇంతటి గురుతర బాధ్యత నెలకొల్పిన పార్టీకి, చంద్రబాబుకు గుమ్మడి ధన్యవాదాలు తెలిపారు.

గతంలో 2017-19 మధ్య గోపాలకృష్ణ ఈ పదవి చేపట్టారు. “చంద్రన్న వరం-నాటకవారం-శనివారం” పేరిట సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన చేశారు. రాష్ట్రంలోని నాటక సమాజాలను గుర్తించి ప్రతి శనివారం వారిచే రాష్ట్రవ్యాప్తంగా నాటకాలు ప్రదర్శించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రణాళికను పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తానని గోపాలకృష్ణ తెలిపారు. దీని ద్వారా నాటకరంగ కళాకారులకు ఉపాధి లభిస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. నాటకం జరిగే ప్రాంతంలోని స్థానికులతో సమన్వయం చేసుకుని ప్రదర్శనలను ఏర్పాటు చేస్తామని, ఈ బృహత్తర ప్రణాళికకు ఆర్థిక వనరులను సైతం సమీకరించే పనిలో ఉన్నామని గుమ్మడి పేర్కొన్నారు.

తెలుగు నాటకాన్ని, పద్యాన్ని ఎల్లలు దాటించిన కళాకారుడిగా గుమ్మడి వినుతికెక్కారు. అమెరికాలో పలు జాతీయ స్థాయి తెలుగు సభల్లో ఆయన పద్యనాటకాలు ప్రదర్శించి అలరించారు. సిలికానాంధ్ర సంస్థ ఆధ్వర్యంలో అమెరికావ్యాప్తంగా ఉన్న ప్రవాస చిన్నారులతో శ్రీకృష్ణ రాయబారం నాటకం ప్రదర్శించారు. సెప్టెంబరు నెలలో అమెరికాలో తొలిసారిగా “సత్యహరిశ్చంద్ర” నాటకాన్ని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రదర్శించి ప్రవాసుల మన్ననలు పొందారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z