* హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాజకీయాల్లో సమోసా (samosa) వివాదం నడుస్తోంది. ఈ స్నాక్ పేరును ఉపయోగించుకొని అధికార కాంగ్రెస్‌పై భాజపా వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తోంది. తాజాగా సీఎంకు ఒక ఎమ్మెల్యే 11 సమోసాలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశారు. అక్టోబర్ 21న జరిగిన ఘటన అది. ఆ రోజు ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు (CM Sukhvinder Singh Sukhu) సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమం కోసం అధికారులు ప్రముఖ హోటల్ నుంచి సమోసాలు (samosas) తెప్పించారని, అయితే వాటిని ఆయన సెక్యూరిటీ స్టాఫ్ ఆరగించారని వార్తలు వచ్చాయి. సీఎం వద్దకు చేరాల్సిన అవి ఎవరి వల్ల మధ్యలో మిస్ అయ్యాయో గుర్తించేందుకు సీఐడీ విచారణకు ఆదేశించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దాంతో ప్రతిపక్ష భాజపా నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. వాటిని సీఎం, సీఐడీ ఖండించారు.
* మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఫాంటసీ డ్రామా ‘కన్నప్ప’. ముకేశ్ కుమార్‌సింగ్ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రానున్న ఈ చిత్రం నుంచి ప్రభాస్ (Prabhas) లుక్ లీకైన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై చిత్రబృందం ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి చేసింది. ఆ ఫొటోను లీక్ చేసిన వారిని కనిపెడితే రూ.5 లక్షల బహుమానం ఇస్తామని వెల్లడించింది.
* ఏం కోల్పోయారో తెలంగాణ (Telangana News) ప్రజలకు తెలిసొచ్చిందని భారాస (BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) అన్నారు. మళ్లీ భారాస అధికారంలోకి వస్తుందని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. సిద్దిపేటలో పాలకుర్తి నియోజకవర్గ భారాస నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారాస నేతలు హైరానా పడాల్సిన అవసరం లేదన్నారు. సమాజాన్ని నిలబెట్టి, నిర్మాణం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. కూలగొడతామని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతోందని మండిపడ్డారు. ప్రజలు బాధ్యత ఇస్తే.. అంతే బరువుతో సేవ చేయాలన్నారు. గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకంటే 90 శాతం ఎక్కువే చేశామని కేసీఆర్ స్పష్టం చేశారు.
* హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈనెల 11న (సోమవారం) తాగునీటి సరఫరాకు (Drinking Water) అంతరాయం ఏర్పడనుంది. మరమ్మతుల దృష్ట్యా ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా ఉండబోదని అధికారులు వెల్లడించారు. ఆర్సీపురం, అశోక్‌నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, గంగారం, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్‌పూర్, ఎర్రగడ్డ, కేపీహెచ్‌పీ, మూసాపేట, చందానగర్, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండబోదని.. స్థానికులు సహకరించాలని కోరారు.
* పవిత్ర కార్తికమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో (TTD NEWS) పుష్పయాగాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. సువాసనలు వెదజల్లే 17 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాభరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్ప కైంకర్యం నిర్వహించారు. చామంతి, సంపంగి, నూరు వరహాలు, రోజా, గన్నేరు, మల్లె, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మానసంపంగి పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. వేదపండితులు వేదాలను పఠించారు. పుష్పయాగానికి మొత్తం 9 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు అందించారు.
* ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన నవంబర్ 11న రాష్ట్ర మంత్రిమండలి ప్రత్యేకంగా భేటీ కానుంది. 11న ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం ఛాంబర్ లోనే కేబినెట్ (AP Cabinet) సమావేశం నిర్వహించనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ (Budget) ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించనుంది. కేబినెట్ ఆమోదించిన అనంతరం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్‌కు సంబంధించిన ప్రతిపాదనలు, అంశాలను రాష్ట్ర గవర్నర్‌కు మంత్రి పయ్యావుల వివరించారు.
* వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహా ఇతర నేతలను కించపరిచేలా పెడుతున్న పోస్టులపై డీజీపికి వైఎస్సార్‌సీపీ బృందం ఫిర్యాదు చేసింది. ఆధారాలతో సహా వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, ఆదిమూలపు సురేష్, మల్లాది విష్ణు, కైలే అనిల్ కుమార్ తదితరులు ఫిర్యాదు చేశారు.
* ఒట్లు పెట్టి దేవుళ్లను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేవుళ్లను మోసం చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన రైతు గర్జన కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు పూర్తిగా అమలు కాలేదని అన్నారు. రుణమాఫీ విషయంలో వాయిదాలు వేస్తున్నారని విమర్శించారు.
* ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ అయిన ఇయాన్ బోథమ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. అక్కడ ఆసీస్ మాజీ ఆటగాడు మెర్వే హ్యూస్‌తో కలిసి చేపలు పట్టేందుకు మొయ్లే నది సమీపానికి వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి పడవలో వెళ్లి నదిలో సరదాగా చేపలు పడుతుండగా.. బోథమ్ కాలి చెప్పు జారి నీళ్లలో పడింది. ఆ చెప్పును తీయబోయిన బోథమ్ ప్రమాదవశాత్తూ నీళ్లలో పడిపోయాడు. ఆ నదిలో భారీ షార్క్‌లు, మొసళ్లు ఉంటాయనే విషయం అతడికి తెలియదు. నీళ్లలో పడిన బోథమ్‌ను గమనించిన ఓ భారీ మొసలి గబగబా వచ్చేసింది. అతడిని అమాంతం నోట కరచుకొని తినేయాలని అనుకుంది. వచ్చీ రావడమే ఆలస్యం అతడిపై దాడికి దిగింది. ఏం జరుగుతుందో అర్దమయ్యేలోపే బోథమ్‌ను మొసలి తన దంతాలతో కొరకడం మొదలెట్టింది. ఇదంతా చూసి అప్రమత్తమైన హ్యూస్ పరుగున వెళ్లి బోథమ్‌ను పైకి లాగాడు. అప్పటికే మొసలి దాడిలో బోథమ్ఎడమ వైపు వీపు భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. ‘ఆ సమయంలో హ్యూస్ గనుక నన్ను కాపాడకుంటే తన శరీరంలో ముక్క కూడా దొరికేది కాద’ని బోథమ్ ఆ భయంకరమైన రోజును గుర్తు చేసుకున్నాడు.
* శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం రానున్నారు. విజయవాడ పున్నమి ఘాట్‌లో సీ ప్లెయిన్‌ను ప్రారంభించి శ్రీశైలానికి సీ ప్లెయిన్ ద్వారా రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z