మేషం
విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. అధికారుల సహకారం ఉంటుంది. హనుమంతుడిని ఆరాధించాలి.
వృషభం
ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. కర్మసిద్ధి ఉంది. ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీ వేంకటేశ్వర సందర్శనం శుభప్రదం.
మిథునం
మొదలు పెట్టిన పనులను పూర్తిచేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. సాహసోపేతమైన విజయాలున్నాయి. శివ ఆరాధన మంచినిస్తుంది.
కర్కాటకం
చేపట్టే పనుల్లో మంచి ఫలితాలు రాబడతారు. మీ మీ రంగాల్లో అనుకూల వాతవరణం ఉంటుంది. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ఆంజనేయుడిని ఆరాధిస్తే మంచిది.
సింహం
చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లాభాన్నిస్తాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. శని శ్లోకాన్ని చదవండి.
కన్య
చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. గణపతి ఆరాధన శుభప్రదం.
తుల
కీలక వ్యవహారాలలో పెద్దల సలహాలు, సూచనలు మేలు చేస్తాయి. కుటుంబసభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. కోపతాపాలకు పోకండి. మనసు చెడ్డ పనులమీదకు మళ్లుతుంది. శివాష్టోత్తరం పఠించాలి.
వృశ్చికం
తలపెట్టిన పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. దగ్గరి వారిని దూరం చేసుకోకండి. శ్రీరామ నామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.
ధనుస్సు
శుభకాలం. మీ మీ రంగాల్లో చక్కటి శుభ ఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు ఆరాధన చేస్తే మంచిది.
మకరం
కీలక విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా పఠించాలి.
కుంభం
వృత్తి, ఉద్యోగ, వ్యపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. సమయ పాలన తో పనులను పూర్తిచేస్తారు. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.
మీనం
మిశ్రమ వాతావరణం కలదు. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరమవుతాయి. ఎలాంటి పరిస్థితులలోనూ మనో దైర్యాన్ని కోల్పోరాదు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. అనవసరంగా ఆందోళనపడతారు. దైవారాధన మానవద్దు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z