DailyDose

Horoscope in Telugu – Nov 15 2024

Horoscope in Telugu – Nov 15 2024

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో ధనాదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారాలలో కూడా లాభాలకు లోటుండదు. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యయ ప్రయాసలు ఎక్కువగానే ఉన్న ప్పటికీ ముఖ్యమైన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆదాయం బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. బంధువులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ధరపరంగా ఎవరికీ వాగ్దానాలూ చేయవద్దు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

బంధువర్గలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. బంధువుల నుంచి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. డాక్టర్లు, లాయర్లు, రియల్ ఎస్టేట్ రంగంవారు, లిక్కర్ వ్యాపారులు రాబడిపరంగా బాగా పురోగతి చెందుతారు. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతా‍యి. ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభదాయకంగా పురోగమిస్తాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందజేస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. కొద్ది మార్పులతో వ్యాపారాలను లాభాల బాట పట్టిస్తారు. ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు సంతృప్తి కలిగి స్తుంది. ఇంటా బయటా అదనపు బాధ్యతల వల్ల శారీరక శ్రమ బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ మార్గాల నుంచి ఆశించిన ఫలితాలందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులు నిదా నంగా పూర్తవుతాయి. వాహన యోగం పట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదే శాల నుంచి సానుకూల సమాచారం అందుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఇంటా బయటా పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అందుకు తగ్గట్టుగా పెరుగుతాయి. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం ఉంటుంది. వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడు తుంది. వృత్తి జీవితం బాగా బిజీగా మారిపోతుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపో వడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి, ఆర్థిక అవసరాల నుంచి బయటపడడం జరుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఏ పని తలపెట్టినా కార్యసిద్ధి ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. రావలసిన సొమ్ము, బాకీలు వసూలవుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారి రాబడి బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి. పెండింగ్ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది., ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాలలో ఒత్తిడి, సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యాపారాల్లో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. అదనపు ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది. నిరు ద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభి స్తుంది. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రోజంతా అనుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు సజావుగా కొనసాగు తాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొం టారు. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాలు పురోగతి బాటపడతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబపరంగా కూడా పని భారం ఎక్కువగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యో గంలో పదోన్నతులకు అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయ మార్గాలను విస్తరించే ప్రయత్నం చేస్తారు. అవసరానికి తగ్గట్టుగా డబ్బు చేతికి అందుతుంది. రావలసిన డబ్బు వసూలవుతుంది. తలపెట్టిన వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తయి ఊరట లభిస్తుంది. గృహ నిర్మాణం మీద దృష్టి పెడతారు. ఆరోగ్యం అనుకూలంగా సాగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, వ్యాపారాల్లో భారీ లాభాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులకు నమ్మకం పెరుగు తుంది. ఆర్థిక వ్యవహారాలతో సహా ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా ముందుకు సాగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు. జీవిత భాగస్వామితో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో సర దాగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z