Business

మైక్రోసాఫ్ట్‌పై మస్క్ దావా-BusinessNews-Nov 16 2024

మైక్రోసాఫ్ట్‌పై మస్క్ దావా-BusinessNews-Nov 16 2024

* చాట్‌జీపీటీని మాతృసంస్థ ఓపెన్‌ ఏఐ (Open AI) సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman)పై దావా వేసిన టెస్లా అధినేత ఎలాన్‌మస్క్‌ (Elon Musk).. తాజాగా అందులోకి మైక్రోసాఫ్ట్‌ను లాగారు. గతంలో దావా వేసి ఉపసంహరించుకున్న ఆయన.. తాజాగా మైక్రోసాఫ్ట్‌ పేరు కూడా జోడించి మరోసారి దావా వేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఏఐ మార్కెట్లో గుత్తాధిపత్యం సాధించేందుకు మైక్రోసాఫ్ట్‌, ఓపెన్‌ ఏఐ.. రెండు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయంటూ తాజాగా ఆరోపించారు. మైక్రోసాఫ్ట్‌తో పాటు లింక్డిన్‌ సహ వ్యవస్థాపకుడు రీడ్‌ హాఫ్‌మన్‌, ఓపెన్‌ ఏఐ మాజీ బోర్డ్‌ మెంబర్‌, మైక్రోసాఫ్ట్‌ పీవీ డీ టెంపుల్టన్‌ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

* దేశంలోనే తొలి ‘మహిళా’ బస్‌ డిపో (first all-women bus depot)ను రాష్ట్ర రవాణా మంత్రి కైలాశ్‌ గహ్లోత్‌ (Kailash Gehlot) దిల్లీలో ప్రారంభించారు. దిల్లీలోని సరోజిని నగర్‌ (Sarojini Nagar)లో పూర్తిస్థాయి మహిళా సిబ్బందితో కూడిన ఈ డిపోకు సఖి డిపో(Sakhi Depot) అని పేరు పెట్టినట్లుగా పేర్కొన్నారు. ఇందులో డిపో మేనేజర్‌, డ్రైవర్లు, కండక్టర్లు ఇలా సిబ్బంది అంతా మహిళలే అని..దీని కోసం మొత్తం 225 మంది సిబ్బందిని కేటాయించామని ఆయన తెలిపారు. అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న మహిళలు రవాణా రంగంలోనూ తమ హక్కులను పొందాలనే ఉద్దేశంతో ఈ డిపోను ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే చాలామంది మహిళలు బస్‌ కండక్టర్లుగా, ఇతర సిబ్బందిగా తమ సేవలు అందిస్తున్నారని..ఇకపై డ్రైవర్లుగానూ తమ ప్రతిభను చాటుకుంటారని అన్నారు. దేశంలో ఇది ఒక కొత్త ట్రెండ్‌ను సెట్‌ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

* ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ కవాసాకీ ఇండియా భారత్ మార్కెట్లోకి 2025 జడ్ హెచ్2 (2025 Z H2), జడ్ హెచ్2 ఎస్ఈ (Z H2 SE) మోటారు సైకిళ్లను ఆవిష్కరించింది. 2025 జడ్ హెచ్2 (2025 Z H2) మోటారు సైకిల్ రూ.24.18 లక్షలు (ఎక్స్ షోరూమ్), జడ్ హెచ్2 ఎస్ఈ (Z H2 SE) మోటారు సైకిల్ రూ.28.59 లక్షలు పలుకుతుంది. రెండు మోటారు సైకిళ్లు ఒకేలా ఉన్నా, జడ్ హెచ్2 ఎస్ఈ (Z H2 SE) మోటారు సైకిల్‌లో మరింత ప్రీమియం హార్డ్ వేర్ ఉంటుంది. మెటాలిక్ మ్యాట్టె గ్రాఫెన్ స్టీల్ గ్రే లేదా మిర్రర్ కోటెడ్ బ్లాక్, స్టాండర్డ్ మోడల్ ఎమరాల్డ్ బ్లేజ్డ్ గ్రీన్ లేదా మెటాలిక్ మ్యాట్టె గ్రాఫీన్ స్టీల్ గ్రే లేదా మెటాలిక్ డియాబ్లో బ్లాక్ మెషిన్ 2025 పవర్ ఫుల్ సూపర్ చార్జిడ్ జడ్ హెచ్2 ఎస్ఈ (Z H2 SE) లభిస్తుంది.

* మరో 45 రోజుల్లో 2024 కాలగర్భంలో కలిసిపోవడంతోపాటు 2025 సంవత్సరం ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) కార్ల కొనుగోలుదారులకు ఇయర్ ఇండ్ ఆఫర్లు అందిస్తోంది. ఈ మేరకు గ్లాన్జా (Glanza), అర్బన్ క్రూయిజర్ (Urban Cruiser), టైసర్ (Taisor), అర్బన్ క్రూయిజర్ హై రైడర్ (Urban Cruiser Hyryder) స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ కార్లు ఆవిష్కరించింది. స్పెషల్ ఎడిషన్ కార్లను ఆవిష్కరించడంతోపాటు వాటిపై ఎక్స్‌క్లూజివ్ ఇయర్ ఎండ్ ఆఫర్లు అందిస్తోంది టయోటా. ఈ ఇయర్ ఎండ్ ఆఫర్లు వచ్చేనెలాఖరు వరకూ కంపెనీ డీలర్ల వద్ద అందుబాటులో ఉంటాయి. గరిష్టంగా రూ.లక్ష వరకూ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. టయోటా గ్లాన్జా అన్ని మోడల్ కార్లపై రూ.17,381 రాయితీ అందిస్తున్నది. వీటితోపాటు 9టీజీఏ యాక్సెసరీస్, 3డీ ఫ్లోర్ మ్యాట్స్, ప్రీమియం డోర్ విజర్స్, లోయర్ గ్రిల్ గార్నిష్, ఓఆర్వీఎం గార్నిష్ క్రోమ్, రేర్ ల్యాంప్ గార్నిష్ క్రోమ్, ఫ్రంట్ బంపర్ గార్నిష్, ఫెండర్ గార్నిష్ క్రోమ్, బంపర్ కార్నర్ ప్రొటెక్టర్, రేర్ బంపర్ గార్నిష్ క్రోమ్ వంటి విడి భాగాలు అందిస్తోంది. టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ మీద రూ.17,931 లతో కూడిన ప్యాకేజీ అందిస్తున్నది. ఈ, ఎస్, ఎస్+ (పెట్రోల్ వేరియంట్ల)కు ఈ ప్యాకేజీ ఉంటుంది. ఇందులో 9టీజీఏ యాక్సెసరీస్, ఆల్ వెదర్ 3డీ మ్యాట్స్, హెడ్ ల్యాంప్ గార్నిష్, ఫ్రంట్ గ్రిల్లె గార్నిష్, బాడీ కవర్, ఇల్యూమినేటెడ్ డోర్ సిల్ గార్డ్, రేర్ బంపర్ కార్నర్ గార్నిష్ (బ్లాక్ గ్లాస్ అండ్ రెడ్), రూఫ్ ఎండ్ స్పాయిలర్ ఎక్స్‌టెండర్ (బ్లాక్ గ్లాస్ అండ్ రేర్), ఫ్రంట్ బంపర్ గార్నిష్ (బ్లాక్ గ్లాస్ అండ్ రెడ్) వంటి యాక్సెసరీలు లభిస్తాయి. టయోటా అర్బన్ క్రూయిజర్ హై రైడర్ మోడల్ కారుపై రూ.50,817 విలువైన ప్యాకేజీ ఉంటుంది. నియో డ్రైవ్ – ఎస్, జీ, వీ, హైబ్రీడ్ – జీ అండ్ వీ వేరియంట్లకు ఈ ప్యాకేజీ వర్తిస్తుంది. ఈ ప్యాకేజీ కింద 13 టీజీఏ యాక్సెసరీస్, మడ్ ఫ్లాప్, డోర్ విజన్ ప్రీమియం, ఆల్ వెదర్ 3డీ ఫ్లోర్ మ్యాట్స్, ఫ్రంట్ బంపర్ గార్నిష్, రేర్ బంపర్ గార్నిష్, హెడ్ ల్యాంప్ గార్నిష్, హుడ్ ఎంబ్లం, బాడీ క్లాడింగ్, ఫెండర్ గార్నిష్, రేర్ డోర్ లిడ్ గార్నిష్, లెగ్ రూమ్ ల్యాంప్, డిజిటల్ వీడియో రికార్డర్, డోర్ క్రోమ్ హ్యాండిల్ వంటి విడి భాగాలు ఉంటాయి.

* దసరా, దీపావళి సమయంలో బంగారం ధరలు తారాజువ్వలా పైకి లేసాయి. ఈ పండుగలు ముగియడం, అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తవ్వడం జరిగిన తరువాత పసిడి ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. దీపావళి నుంచి గోల్డ్ రేట్లు దాదాపు 6 శాతం క్షీణించాయి. 2024 నవంబర్ 1న 80,710 రూపాయలుగా ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. ఈ రోజు (నవంబర్ 16) 75,650 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే ఈ నెల ప్రారంభంలో ఉన్న ధరలకు, ప్రస్తుత ధరలకు చాలా వ్యత్యాసం ఉన్నట్లు స్పష్టమవుతోంది. బంగారం ధరలు పెరిగినా.. తగ్గినా డిమాండ్ మాత్రం తగ్గే అవకాశం లేదు. ముఖ్యంగా భారతదేశంలో కొనసాగుతున్న పెళ్లిళ్ల సీజన్ బంగారం విక్రయాలను గణనీయంగా పెంచాయని మల్హోత్రా జ్యువెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ధృవ్ మల్హోత్రా పేర్కొన్నారు. అయితే బంగారం ధరల తగ్గుదల మరింత ఎక్కువ మందిని బంగారం కొనేలా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

* ప్రముఖ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో (Zomato) కొత్త సేవలు ప్రారంభించింది. ఇప్పటికే క్విక్ కామర్స్ ( రంగంలో దూసుకెళ్తున్న జొమాటో .. తన సేవల విస్తరణకు సిద్ధమైంది. తాజాగా డిస్ట్రిక్ట్ (District) అనే పేరుతో కొత్త యాప్ ప్రారంభించింది. దీంతో టికెట్ బుకింగ్, డైనింగ్ సహా పలు రకాల సేవలను యూజర్లకు అందుబాటులోకి వస్తాయి. జొమాటో తచ్చిన తాజా డిస్ట్రిక్ట్ (District) యాప్‌లో సినిమా టికెట్ల బుకింగ్, ఈవెంట్ల టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ టికెటింగ్, లైవ్ షోలు, షాపింగ్, డైనింగ్ సేవలు కూడా ఈ యాప్‌లో జత చేసింది. గత ఆగస్టులో ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎం నుంచి రూ.2,048 కోట్లకు టికెటింగ్ బిజినెస్‌ను కొనుగోలు చేసిన జొమాటో.. తాజాగా కొత్త సేవలకు తన వ్యాపార విస్తరణకు శ్రీకారం చుట్టింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z