ScienceAndTech

బెంజ్ కంపెనీని నిలబెట్టిన మహిళ-BusinessNews-Nov 17 2024

బెంజ్ కంపెనీని నిలబెట్టిన మహిళ-BusinessNews-Nov 17 2024

* విశాఖ డెయిరీ నిర్వాహకుల దోపిడీని అడ్డుకోవాలని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రభుత్వాన్ని కోరారు. స్వలాభమే పరమావధిగా పనిచేస్తోన్న పాలకవర్గం రైతులను నిలువునా ముంచుతోందని ఆరోపించారు. విశాఖపట్నంలో 7.95 ఎకరాల భూమిని విశాఖ డెయిరీ పెద్దలు ఆక్రమించారన్న జనసేన నేత మూర్తియాదవ్‌ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఆక్రమణలు నిజమని తేలితే బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఆవు పాల ధరను ఒక్కసారిగా లీటరుకు రూ.3 తగ్గించడం దారుణమన్నారు.

* అమెరికాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్‌ (Boeing) పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగా తాజాగా 400 మందికి పైగా ఉద్యోగులకు లేఆఫ్‌ నోటీసులు జారీ చేసింది. కార్మికులు సమ్మె చేయడంతో వాటిల్లిన నష్టం పూడ్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. తీవ్రమైన ఆర్థిక ఒత్తిడులు, ఉత్పత్తి ఆలస్యం వేళ బోయింగ్ లేఆఫ్‌ల నిర్ణయం తీసుకుంది. ఏరోస్పేస్‌ లేబర్‌ యూనియన్‌లోని 438 మంది ఉద్యోగులకు లేఆఫ్‌ నోటీసులను అందించింది. వీరిలో 218 మంది ఇంజినీర్లు, సొసైటీ ఆఫ్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్ ఎంప్లాయీస్ ఇన్ ఏరోస్పేస్ (SPEEA) యూనిట్‌లోని సభ్యులుకాగా.. మిగిలిన వారు టెక్నికల్‌ యూనిట్‌లో విధులు నిర్వర్తిస్తున్న వాళ్లు, సాంకేతికత నిపుణులు, విశ్లేషకులు ఉన్నారు. అయితే అర్హత కలిగిన ఉద్యోగులకు మూడు నెలల వరకు కెరీర్‌ ట్రాన్సిషన్‌ సేవలు, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు అందించనుంది.

* దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (FPI) విక్రయాల పర్వం కొనసాగుతూనే ఉంది. దేశీయ కంపెనీల షేర్ల విలువలు భారీగా పెరిగాయనే ఆందోళనలు నెలకొనడం.. ఇదే సమయంలో చైనాలో షేర్ల విలువలు అందుబాటులో ఉండటంతో ఎఫ్‌పీఐలు పెద్ద ఎత్తున నిధులను దేశీయ మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నారు. నవంబర్‌లో ఇప్పటివరకు ఏకంగా రూ.22,420 కోట్లను మార్కెట్‌ నుంచి వెనక్కితీసుకున్నారు.

* 2024-25 మదింపు సంవత్సరానికి దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌ల్లో (ఐటీఆర్‌) అధిక విలువున్న విదేశీ ఆదాయం, ఆస్తులను వెల్లడించని పన్ను చెల్లింపుదార్లకు సంక్షిప్త సందేశాల (మెసేజ్‌లు)ను పంపిస్తున్నట్లు ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం శనివారం వెల్లడించింది. ఆదాయపు పన్ను రిటర్న్‌ల్లో విదేశీ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయాలు, విదేశీ ఆస్తులకు సంబంధించి కచ్చితమైన వివరాల వెల్లడిని పూర్తి చేయడంలో పన్ను చెల్లింపుదార్లకు సాయం అందించేందుకు కాంప్లియన్స్‌ కమ్‌ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌ను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 2024-25 మదింపు సంవత్సరానికి రిటర్న్‌లు దాఖలు చేసిన దేశీయ పన్ను చెల్లింపుదార్లకు విదేశీ ఆదాయం, ఆస్తుల వివరాల వెల్లడిపై ఎస్‌ఎమ్‌ఎస్, ఇ-మెయిల్‌ ద్వారా సమాచారం ఇస్తున్నట్లు సీబీడీటీ తెలిపింది. విదేశాల్లో ఖాతాలు లేదా ఆస్తులు ఉండొచ్చని లేదా విదేశాల నుంచి ఆదాయాలు వచ్చి ఉండొచ్చని ద్వైపాక్షిక, బహుళపాక్షిక ఒప్పందాల కింద అందిన సమాచారం ద్వారా గుర్తించిన పన్ను చెల్లింపుదార్లకు ఈ మెసేజ్‌లు పంపుతున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా అధిక విలువ ఉన్న విదేశీ ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించని వారికి ఆ విషయాన్ని గుర్తు చేయడం, మార్గనిర్దేశం చేయడంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపింది.

* మెర్సిడెస్ బెంజ్ ఈ రోజు ఆటోమోటివ్ పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన సంస్థగా గుర్తింపు పొందింది అంటే.. దానికి కారణం ‘బెర్తా బెంజ్’ అనే చెప్పాలి. మొదటిసారిగా ప్రపంచానికి కార్లను పరిచయం చేసిన ఘనత కూడా ఈమె సొంతమే. ఈమె మరెవరో కాదు.. కార్ల్ ఫ్రెడరిక్ బెంజ్ భార్య. 1888లో ఒకరోజు ఉదయం.. బెర్తా నిద్రలేచి, కార్ల్ బెంజ్‌కి తెలియజేయకుండా తన ఇద్దరు కుమారులు యూజెన్, రిచర్డ్‌లతో కలిసి కారులో ప్రయాణాన్ని ప్రారంభించింది. రోడ్డుపై వస్తున్న ఆ వాహనం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే దాన్ని మహిళ నడపడం చూసి చాలామంది మరింత ఆశ్చర్యపోయారు. నిజానికి కార్ల్ బెంజ్ తన మొదటి వాహనాన్ని రూపొందించినప్పుడు, దానిని విక్రయించడానికి చాలా కష్టపడ్డాడు. దాదాపు మూడేళ్ళ పాటు దాని అమ్మకాలు జరగలేదు. ఈ వాహనంలో బెర్తా 106 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత.. పేటెంట్ మోటర్‌వాగన్‌ను ప్రపంచం గుర్తించింది. ఆ తరువాత కంపెనీ అమ్మకాలు మొదలయ్యాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z