* నారాయణపేట్ జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తుండగా విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకొని అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారిలో కొంత మందికి ప్రాథమిక చికిత్స అందించి వారి ఇళ్లకు పంపించారు. 9 మంది విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
* జమ్మలమడుగులో అదానీ పేరు చెప్పి వైకాపా వాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదినారాయణరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం జరిగిన గొడవ వైకాపా వాళ్ల మీదే తప్ప అదానీతో కాదని స్పష్టం చేశారు. అదానీ సంస్థను జమ్మలమడుగుకు స్వాగతిస్తున్నామన్నారు. అదానీ పేరు చెప్పుకొని వచ్చే దొంగ వైకాపా కంపెనీలను అనుమతించేది లేదని తేల్చి చెప్పారు.
* టీమ్‌ఇండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా (AUS vs IND) పర్యటనలో ఉంది. బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో (Border – Gavaskar Trophy) ఐదు టెస్టుల సిరీస్‌ను ఆడనుంది. ఈ క్రమంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్‌ను (Ajit Agarkar) ఆస్ట్రేలియాలోనే ఉండాలని బీసీసీఐ ఆదేశించింది. జట్టును ఎంపిక చేసిన తర్వాత ఏ పర్యటనకైనా కోచ్‌తోపాటు ఆటగాళ్లు మాత్రమే వెళ్తారు. కానీ, ఇప్పుడు అజిత్ అగార్కర్‌ను ఐదు టెస్టులు జరిగేవరకూ ఆసీస్‌లోనే ఉండాలని చెప్పడం వెనక పెద్ద కారణమే ఉంది. సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాతోపాటు రవిచంద్రన్ అశ్విన్ భవిష్యత్తుపై చర్చించేందుకు అగార్కర్‌ను ఉండమని చెబుతున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
* ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన భార్య సైరా బాను విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ అధికారికంగా వారి వివాహబంధానికి స్వస్తి పలికారు. ఈ మేరకు భావోద్వేగపూరిత ఒత్తిడి కారణంగా విడిపోతున్నట్లు వారి న్యాయవాది ప్రకటించారు (#arrsairaabreakup). ఇక ఈ విషయంపై వారి పిల్లలు రహీమా, ఖతీజా, అమీన్ స్పందిస్తూ పోస్ట్‌లు పెట్టారు. ‘మా తల్లిదండ్రుల విడాకుల విషయంలో గోప్యత పాటిస్తూ.. గౌరవంగా వ్యవహరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు’ అంటూ రహీమా పోస్ట్ పెట్టారు. ‘ఈ సమయంలో మా కుటుంబ గోప్యతను గౌరవించాలని మేము ప్రతిఒక్కరినీ వేడుకుంటున్నాం. మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు’ అని ఖతీజా, అమీన్‌లు పేర్కొన్నారు.
* టీమ్‌ఇండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి దూసుకొచ్చాడు. ఏకంగా 69 స్థానాలు ఎగబాకి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)ను వెనక్కి నెట్టి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్ వరుసగా మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. తిలక్ వర్మ తన టీ20 కెరీర్‌లో టాప్-10లో నిలవడం ఇదే మొదటిసారి. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఈ హైదరాబాదీ కుర్రాడు అదరగొట్టాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో శతకాలు బాది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. సఫారీలతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో తిలక్ 198 స్ట్రైక్‌రేట్‌తో 280 పరుగులు చేశాడు. నాలుగు మ్యాచ్‌ల్లో కలిపి 20 సిక్సర్లు బాదాడు.
* ఉక్రెయిన్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అమెరికా (US) పేర్కొంది. కీవ్‌లోని తమ దౌత్య కార్యాలయంపై రష్యా (Russia) బుధవారం భారీ వైమానిక దాడులకు(major air attack) పాల్పడే అవకాశం ఉందని తమకు సమాచారం వచ్చిందని అమెరికా వెల్లడించింది. ఈనేపథ్యంలోనే ఎంబసీని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. నవంబర్ 20న దాడి జరగబోతోందని తమకు కచ్చితమైన సమాచారం అందిందని వెల్లడించింది. రాయబార కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఎయిర్ అలర్ట్‌లు ప్రకటించగానే కీవ్‌లోని అమెరికా పౌరులు షెల్టర్లలోకి వెళ్లిపోవాలని కోరింది.
* చంద్రబాబు లాంటి క్రూర రాజకీయాలు ఎవరూ చేయరంటూ మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
* మహరాష్ట్రలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 58:22 శాతం పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు మహారాష్ట్రలో 45.53శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 32.18 శాతం పోలింగ్ నమోదు. ఇంకా క్యూలైన్‌లో ఉన్న ఓటర్లు.
* గ్యారెంటీల పేరుతో గద్దెనెక్కి రాష్ర్టాన్ని దివాలా తీయించిన హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ సర్కారుకు మరో భంగపాటు ఎదురైన సంగతి తెలిసిందే. ఓ విద్యుత్తు సంస్థకు చెల్లించాల్సిన రూ.150 కోట్లను రికవరీ చేసేందుకు ఢిల్లీలోని హిమాచల్ భవన్ జప్తుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ భవనాన్ని వేలం వేసి బకాయిలు తీర్చేసుకోవాలని సదరు కంపెనీకి సూచించిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. గద్దెనెక్కడం కోసం అడ్డగోలుగా గ్యారెంటీలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి పరిపాటిగా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. చేతికందినన్ని అప్పులు చేయడం.. ఆఖరికి ఉన్న ఆస్తులు జప్తు చేయించుకునే పరిస్థితికి రావడం దారుణమన్నారు. ఇది ఏ జూదగాని ఇంటి కథ కాదు..సాక్షాత్తు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అని కేటీఆర్ పేర్కొన్నారు. గ్యారెంటీలు అమలు చేయలేక, గంజాయి కూడా అమ్మకునే పరిస్థితి మొన్న! మీరు చెల్లించాల్సిన అప్పు తేల్చకపోతే, ఢిల్లీలో మీ హిమాచల్ భవన్‌ను జప్తు చేస్తాం అని హైకోర్టు నేడు తీర్పునిచ్చింది. ఎంత సిగ్గుచేటు? అని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను నడపడానికి బదులుగా సర్కస్‌లను నడుపుతుందన్నారు. మరి తెలంగాణలో మీరు ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి మీరు ఏం విక్రయిస్తారని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z