* వాట్సప్‌లో (Whatsapp) సుదీర్ఘ విషయాన్ని చెప్పడానికి చాలా మంది వినియోగించే ఫీచర్ వాయిస్ మెసేజ్. అయితే, నలుగురిలో ఉన్నప్పుడు ఈ ఆడియో సందేశాలు వినాలంటే కాస్త ఇబ్బందే. లేదంటే వినేందుకు ఆ సమయానికి ఇయర్‌ఫోన్స్ ఉండాలి. ఈ రెండూ వీలుకానప్పుడు ఆ వాయిస్ చాట్‌ను అలా వదిలేయాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు వాట్సప్ కొత్త ఫీచర్ తెచ్చింది. అవతలి వ్యక్తులు పంపించిన సందేశాన్ని టెక్ట్స్ రూపంలో చదువుకునేందుకు వీలుగా వాయిస్ ట్రాన్స్‌స్క్రిప్ట్స్ (Voice Message Transcripts) ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ సదుపాయం ద్వారా వాయిస్ మెసేజ్‌ను వినొచ్చు. వినలేని సందర్భంలో ట్రాన్స్‌స్క్రిప్ట్ చేయొచ్చు. అలాగని, ఇది ట్రాన్స్‌లేటర్ కాదు. కేవలం ఏ భాషలో ఉంటుందో ఆ భాషకు అక్షర రూపాన్ని మాత్రమే ఇస్తుంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటే వాయిస్ సందేశాలకు ఆటోమేటిక్ కింద టెక్ట్స్ రూపం కనిపిస్తుంది. కేవలం సందేశం అందుకున్న వ్యక్తి మాత్రమే ఈ టెక్ట్స్‌ను చూడగలరని, పంపించిన వారు దీన్ని వినియోగించలేరని కంపెనీ పేర్కొంది.
* ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసనసభాపతి నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. అనర్హత పిటిషన్ల విషయమై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ తీర్పుపై ఆయన స్పందించారు. మొన్నటి వరకు సభాపతిని ఆదేశించే అధికారం కోర్టుకు లేదని వాదించారని కేటీఆర్ గుర్తు చేశారు. రీజనబుల్ పీరియడ్‌లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సీజే స్పష్టం చేశారని, రీజనబుల్ పీరియడ్ అంటే మూడు నెలలు అని మణిపుర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
* కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి శుక్రవారం రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు (Defamation Notice) అందాయి. తనపై చేసిన ఆరోపణలకు గానూ భాజపా నేత వినోద్ తావ్డే (Vinod Tawde) వాటిని పంపారు. ఆ నోటీసుల్లో వారితో పాటు సుప్రియా శ్రినేట్ పేరు కూడా ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ (Maharashtra Elections) ఎన్నికలకు కొన్ని గంటల ముందు అధికార, ప్రతిపక్షాల మధ్య హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. పాల్‌ఘర్ జిల్లాలోని విరార్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్‌లో భాజపా నేతలు డబ్బులు పంచుతున్నారని అప్పుడు ప్రాంతీయ బహుజన్ వికాస్ అఘాడీ (Bahujan Vikas Aghadi) పార్టీ ఆరోపించింది. నాలసోపరా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి రాజన్ నాయక్‌కు ఓటు వేయాలని కోరుతూ భాజపా ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి వినోద్ తావ్డే (Vinod Tawde), మరికొందరు నాయకులు ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొంది.
* కృష్ణా జిల్లా గుడివాడలో తాగునీరు ‘నాడు-నేడు’ పేరుతో అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తాగునీటి శాంపిల్ ప్రదర్శన పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఏం చేశారో తాగునీరు చూస్తే తెలుస్తోంది. గుడివాడ ప్రజలు 20ఏళ్లుగా నరకం అనుభవించారు. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా ప్రజలకు మంచినీరు ఇవ్వలేకపోయారు. గుడివాడలో పచ్చగా ఉన్న నీళ్లు మేం వచ్చాక స్వచ్ఛంగా మారాయి. తాగునీటి సమస్య గురించి చెప్పగానే డిప్యూటీ సీఎం పవన్ (Pawan Kalyan) స్పందించారు. ఫిల్టర్‌బెడ్‌లు మార్చేందుకు చొరవచూపి రక్షితనీరు వచ్చేలా చూశారు. పవన్ కల్యాణ్ చొరవకు గుడివాడ ప్రజల తరఫున కృతజ్ఞతలు. సీఎం చంద్రబాబు (Chandrababu) సమన్వయంతో గుడివాడ ప్రజలకు మంచి రోజులు వచ్చాయి’’ అని ఎమ్మెల్యే అన్నారు.
* వైకాపా హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠ, బ్రాండ్‌ను దెబ్బతీసేలా ప్రవర్తించారని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఆయన ప్రసంగించారు. ‘‘జగన్ చేసిన అవినీతి అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.
* లక్షల కోట్ల రూపాయలు దోచేసిన జగన్ రెడ్డి (YS Jagan)కి ఇప్పటికీ శిక్ష పడకపోవడమేంటో అర్థం కావడం లేదని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) అన్నారు. ఉత్తర భారతంలో రూ.100 కోట్ల అవినీతి కేసుల్లోనూ అనేక మంది సీఎంలు జైలుపాలయ్యారని గుర్తు చేశారు.
* తెదేపా కార్యకర్తల ధైర్యాన్ని, వైకాపా నేతల పిరికితనాన్ని ప్రజలు గమనిస్తున్నారని మంత్రి నారాలోకేశ్ అన్నారు. గత ఐదేళ్లులో అక్రమ కేసులతో ఎంత వేధించినా తెదేపా శ్రేణులు ధైర్యంగా నిలబడ్డారని తెలిపారు. సోషల్‌మీడియాలో అసభ్య పోస్టులపై పోలీసులు ఇచ్చిన నోటీసులకే వైకాపా నేతలు రాజకీయ సన్యాసం అంటున్నారని ఎద్దేవాచేశారు.
* రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని.. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని చెప్పారు.
* దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితం శనివారం తేలనుంది. ఇక్కడ అధికార మహాయుతి, విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిల మధ్య హోరాహోరీగా పోటీ ఉండనున్నట్లు పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.‘‘నిరాడంబర రైతు కుటుంబం నుంచి ఏయన్నార్ (ANR) వచ్చారు. కనీసం కరెంటు సౌకర్యం కూడా లేని చిన్న గ్రామంలో పుట్టారు. ఎంతో కష్టపడి గుర్తింపు తెచ్చుకున్నారు. 1944లో రైల్వేస్టేషన్‌లో చిత్ర నిర్మాత ఘంటసాల బలరామయ్యతో పరిచయంతో ఏయన్నార్ సినీ ప్రయాణం ప్రారంభమైంది. ‘నటిస్తావా’ అని ఆయనే నాన్నను అడిగారు. అలా ప్రారంభమైన ఆయన ప్రయాణం ఒక చరిత్ర. తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. తొలినాళ్లలో స్త్రీ పాత్రలు పోషించినప్పుడు ఎంతో మంది ఆయన్ని హేళన చేశారు. దీంతో మెరీనా బీచ్‌కు వెళ్లి సముద్రంలో మునిగి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. అయితే, తనను తాను నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎన్నో కఠినమైన పాత్రలు చేసి ఎంతోమంది మనసుల్లో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు’’ అని నాగార్జున చెప్పారు.
* గాజాలో (Gaza) యుద్ధ నేరాలు, అమానుష చర్యలకు సంబంధించి తనపై అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేయడాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) తీవ్రంగా ఖండించారు. దేశాన్ని రక్షించకుండా తనను ఏ శక్తీ ఆపలేదని పునరుద్ఘాటించారు. ఇజ్రాయెల్ (Israel) రక్షణకు వ్యతిరేకంగా తీసుకున్న ఏ నిర్ణయమైనా తనను నిలువరించలేదని, అన్ని మార్గాల్లోనూ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఎలాంటి ఒత్తిడులు ఎదురైనా.. తలొగ్గే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడినట్లు అంతర్జాతీయ న్యాయస్థానం ఆరోపిస్తోందని, అయితే, ఇజ్రాయెల్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలువురు వ్యక్తులపై జరిగిన భయంకరమైన నేరాలు న్యాయస్థానానికి కనిపించలేదా? అని ప్రశ్నించారు. మానవాళికి రక్షణ కల్పించేందుకు ఏర్పాటైన ప్రపంచ న్యాయస్థానం.. ఇవాళ మానవాళికే శత్రువుగా మారిందని విమర్శించారు. న్యాయస్థానం చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవన్నారు.
* ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌లో ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు పౌర విమానాలకు ప్రాణాంతకంగా మారిన విషయం వెల్లడైంది. నాడు ప్రయోగించిన దాదాపు 200 బాలిస్టిక్ మిసైల్స్ పౌర విమానాలపై నుంచి ఎగురుతూ వెళ్లినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంలో పేర్కొంది. అవి ఇజ్రాయెల్ దిశగా దూసుకు వెళ్లే సమయంలో ఆ మార్గంలో దాదాపు డజను విమానాలు ఉన్నట్లు తెలిపింది. ఇవన్నీ అప్పుడు ఇరాన్, ఇరాక్ గగనతలాల్లో ఉన్నాయి. కొందరు పైలట్లు, ప్యాసింజర్లు ఈ అగ్ని గోళాలను స్వయంగా చూశారు.
* భారత నౌకాదళానికి చెందిన స్కార్పియన్ శ్రేణి జలాంతర్గామి భారీ ప్రమాదానికి గురైంది. గోవా తీరానికి 70 నాటికల్ మైళ్ల దూరంలో నౌకాదళ సబ్‌మెరైన్‌ను చేపల వేట పడవ మారథోమా ఢీకొంది. ఈ విషయాన్ని శుక్రవారం రక్షణశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో పడవలో 13 మంది ఉన్నారు. వీరిలో 11 మందిని రక్షించినట్లు భారత నౌకాదళం పేర్కొంది. మరో ఇద్దరు ఆచూకీ గల్లంతైంది. నౌకాదళ ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. వీరి కోసం కూడా గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన అదనపు సామగ్రిని రప్పించారు. ఈ ప్రాంతం మొత్తాన్ని కోస్ట్‌గార్డ్ ఆధీనంలోకి తీసుకొని.. నౌకల మార్గాలను మళ్లించింది. జలాంతర్గామికి ఏమేరకు నష్టం జరిగిందనే విషయం వెల్లడి కాలేదు.
* ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (Ar Rahman), సైరా బాను (Saira Banu) విడాకులు తీసుకున్న తర్వాత వస్తోన్న కథనాలపై వారి తనయుడు అమీన్ స్పందించాడు. తన తండ్రి గురించి వస్తోన్న అసత్య వార్తలు చూస్తుంటే ఎంతో బాధగా ఉందన్నాడు. వృత్తిపరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అన్నాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ‘‘మా నాన్న ఒక లెజెండ్. ఎన్నో ఏళ్ల నుంచి వృత్తిపరంగా అద్భుతమైన మ్యూజిక్‌ను అందించడమే కాదు.. ఎంతో మంది ప్రేమాభిమానాలను పొందిన వ్యక్తి. ఎలాంటి ఆధారాల్లేకుండా వదంతులు వ్యాప్తి చెందడం చూస్తుంటే బాధగా ఉంది. ఒక వ్యక్తి జీవితం, లెగసీ గురించి మాట్లాడేటప్పుడు నిజం విలువ తెలుసుకోవాలి. దయచేసి ఇలాంటి అవాస్తవాలు వ్యాప్తి చేయడం ఇకనైనా ఆపండి. ఆయన్ని, వృత్తిని గౌరవిద్దాం’’ అని పేర్కొన్నాడు.
* ‘‘డాల్బీ విజన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ని రూపొందించాలని రాజమౌళి అనుకున్నప్పుడు మనదేశంలో దానికి సంబంధించిన సదుపాయాల్లేవు. దాంతో ఆయన జర్మనీ వెళ్లి.. ఆ పనులు పూర్తి చేశారు. ఆ టెక్నాలజీని ఇక్కడ అందుబాటులోకి తీసుకురావాలని మేము నిర్ణయించుకున్నాం. డాల్బీ సినిమాను స్టూడియోలో ఏర్పాటు చేశాం. ‘పుష్ప 2’తో మేము దానిని ప్రారంభిస్తున్నాం. ఇదే తొలిసారి కావడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు. సినిమా ప్రమాణాలు పెంచి ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించేందుకు ఈ డాల్బీ విజన్ ఉపయోగపడుతుంది. డాల్బీ లేబొరేటరీస్ దీనిని రూపొందిస్తుంటుంది.
* గోవాలోని పణజీలో భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ (ఇఫ్ఫీ) వేడుకగా జరుగుతోన్న విషయం తెలిసిందే. తొలిరోజు జరిగిన వేడుకల్లో సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ (Kushboo) పాల్గొన్నారు. ‘సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ’ అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె భాగమయ్యారు. ఇటీవల చర్చనీయాంశంగా మారిన ఈ టాపిక్ గురించి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు అన్నిచోట్లా ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. విషయం ఏదైనా నిర్ణయం మన చేతిలోనే ఉంటుందన్నారు. ఇందులోభాగంగా ఒకానొక సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘గతంలో ఓ సినిమా సెట్‌లో ఒక హీరో నాతో ఇబ్బందికరంగా మాట్లాడాడు. నాకు ఏదైనా ఛాన్స్ ఉందా? అన్నాడు. వెంటనే నేను నా చెప్పుల సైజు 41. ఇక్కడే చెంప పగలకొట్టనా? లేదా సెట్‌లో అందరి ముందు పగలకొట్టనా? అని అడిగా? సినిమా మాధ్యమంగా ప్రేక్షకులను అలరించాలని నేను పరిశ్రమలోకి వచ్చా. సమానత్వం, గౌరవంలో ఎక్కడా రాజీ పడకూడదనేది నా సిద్ధాంతం. ఆవిధంగానే వర్క్ చేశా’’ అని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఆ హీరో ఎవరై ఉంటారా? అని మాట్లాడుకుంటున్నారు.
* ఉత్తర భారతదేశంలో ఆందోళన కలిగిస్తోన్న వాయుకాలుష్యం (Air Pollution).. జాతీయ అత్యవసర పరిస్థితేనని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో (Parliament Sessions) దీనిపై కూలంకషంగా చర్చించి పరిష్కార మార్గాలను కనుగొనాలని సహచర ఎంపీలకు పిలుపునిచ్చారు. వాయు కాలుష్యం రూపంలో ముప్పు ముంచుకొస్తోందని, దానిని ఎదుర్కొనేందుకు సమష్టిగా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ మేరకు ఇండియా గేట్ వద్ద పర్యావరణవేత్త ఝాతో కలిసి మాట్లాడిన వీడియోను రాహుల్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z