ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సేవా విభాగమైన ఫౌండేషన్‌లో నిధుల గోల్‌మాల్ జరిగింది. ఫౌండేషన్ మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు నిబంధనలకు విరుద్ధంగా, అధికారిక సమాచారం లేకుండా అర్వింగ్‌లోని తన సొంత ఐటీ కన్సల్టింగ్ కంపెనీ బృహత్ టెక్నాలజీస్ సంస్థకు సెప్టెంబరు 2022 నుండి ఫిబ్రవరి 2024 మధ్య $3.01 మిలియన్ డాలర్లు (సుమారు ₹25కోట్లు) ఫౌండేషన్ అధికారిక బ్యాంకు ఖాతా నుండి బదలాయించుకున్నాడు. సరైన అనుమతులు లేకుండా తాను చేసిన ఈ చర్యలకు పూర్తి బాధ్యత తనదేనని శ్రీకాంత్ బోర్డుకు ఈమెయిల్ ద్వారా తెలియజేశాడు.
ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన తానా బోర్డు నిన్న జరిగిన సమావేశంలో శ్రీకాంత్‌కు, అప్పటి ఫౌండేషన్ ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరమణలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 25వ తేదీన జరిగే బోర్డు సమావేశానికి హాజరయి విచారణలో పాల్గొనవల్సిందిగా సూచించింది.
ఆపత్కాల పరిస్థితుల్లో ఆపన్నులకు, తెలుగు రాష్ట్రాల్లో పేదలకు, అమెరికాలోని పేద విద్యార్థులకు, వైద్య శిబిరాలకు తానా ఫౌండేషన్ నిధులను ఉపయోగిస్తారు. అలాంటి అత్యధిక విలువ కలిగిన నిధులను దారి మళ్లించి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి, సంస్థ నైతిక స్థైర్యంపైనే దెబ్బకొట్టిన ఇలాంటి చర్యలను ప్రవాసులు అసహ్యించుకుంటున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z