ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్‌గా నియమితులైన న్యూజెర్సీకి చెందిన గుంటూరు ప్రవాసాంధ్రుడు మన్నవ మోహనకృష్ణ శుక్రవారం సాయంత్రం గుంటూరు సిద్ధార్థ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో తెదేపా నేతలు, కార్యకర్తలు, మన్నవ స్నేహితులు, అభిమానులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తన పట్ల, రాష్ట్రాభివృద్ధి పట్ల నమ్మకం ఉంచి తనకు ఈ బాధ్యతలు అప్పగించిన చంద్రబాబుకు, తెదేపాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అరచేతిలో ప్రపంచాన్ని ఇముడ్చుకున్న ప్రస్తుత సాంకేతిక యుగంలో గ్రామీణ ప్రాంతాలకు, ఏపీ ప్రజలకు టెక్నాలజీ సేవలు మరింతగా విస్తృతపరచాలనేది తన లక్ష్యమని, సాంకేతికత అంటే స్మార్ట్‌ఫోన్ ఒక్కటే గాకుండా భవిష్యత్తుకు బాటలు వేసుకునే వారధిగా మారాలనేది తన ఆకాంక్ష, ఆ దిశగా కృషి చేస్తానని మన్నవ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జూలకంటి బ్రహ్మారెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z