లండన్లో ఘనంగా కేసీఆర్ – దీక్షా దివస్
-కేసీఆర్ శాంతియుత తెలంగాణ పోరాటం ప్రపంచానికే ఆదర్శం, ఎన్నారై బీ.ఆర్.యస్ సెల్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం
-రాబోయే తరాలకు మన తెలంగాణ – కేసీఆర్ చరిత్ర చెప్పడం మన బాధ్యత , ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి
లండన్: లండన్లో కేసీఆర్ – దీక్షా దివస్ ని ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.
ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే విభాగం అధ్యక్షుడు నవీన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూకే నలుమూలల నుండి బీ.ఆర్.యస్ నాయకులు తెలంగాణ వాదులు పాల్గొన్నారు.
ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే విభాగం అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ…
నవంబర్ 29, 2009 నాడు ‘తెలంగాణ వచ్చుడో -కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదం తో కేసీఆర్ తల పెట్టిన దీక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కీలక ఘట్టంగా బావించి, ఆ రోజును దీక్ష దివస్ గా జరుపుకుంటున్నామన్నారు.
తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే క్రమంలో తన ప్రాణాలను పణంగా పెట్టి సకల జనులను ఏకం చేసి, శాంతి యుత పోరాటం తో రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ గారి ఉద్యమ ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శమని తెలిపారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో.. ఎన్నారై బీ.ఆర్.యస్ వ్యవస్థాపక అద్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ నాడు భారత స్వాతంత్ర ఉద్యమానికి గాంధీజీ గారు ఎంచుకున్న అహింసా పద్దతిని మన తెలంగాణ గాంధీజీ – కేసీఆర్ గారు పాటించి రాష్ట్ర సాధనోద్యమంలో ఎటువంటి హింసకు తావు లేకుండా, శాంతియుత పంధా తో ఏదైన సాధించవచ్చు అనే గొప్ప సందేశాన్ని, అటు భారత దేశ పౌరులకే కాకుండా, ప్రపంచానికే గొప్ప సందేశాన్నీ, మార్గాన్ని చూపిన గొప్ప స్పూర్తి దాత నాయకుడు మన కేసీఆర్ గారని ప్రశంసించారు.
అంతేకాకుండా లండన్ నుండి కెసిఆర్ గారు తలపెట్టిన దీక్ష నుండి నేటి వరకు వారికి మద్దతుగా ఉంటూ, చేపట్టిన కార్యక్రమాలని, ఉద్యమ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. కెసిఆర్ గారి నాయకత్వాన్ని బలపర్చడం మన చారిత్రాత్మక అవసరమని, ఎన్నారై బీ.ఆర్.యస్ సెల్ కి ఎప్పటికప్పుడు కెసిఆర్ గారు మరియు యావత్ బీ.ఆర్.యస్ నాయకులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. కెసిఆర్ గారి ఆదేశాల మేరకు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వారి వెంట ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై బీ.ఆర్.యస్ సెల్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, అధ్యక్షులు నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్, సతీష్ రెడ్డి గొట్టిముక్కుల,సత్య మూర్తి చిలుకుల, రవి రేటినేని, వైస్ చైర్మన్ గణేష్ కుప్పాల, సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ వీర, కార్యదర్శులు సురేష్ గోపతి, అబ్దుల్ జాఫర్, కార్యదర్శి – ఐటీ, మీడియా & పీఆర్ రవి ప్రదీప్ పులుసు, కోశాధికారి సురేష్ బుడగం, కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ రమేష్ ఇస్సంపల్లి, కమ్యూనిటీ అఫైర్స్ వైస్ చైర్మన్ శ్రీధర్ రావు తక్కలపల్లి, సంయుక్త కార్యదర్శులు నవీన్ మాదిరెడ్డి, ప్రశాంత్ రావు కటికనేని, రామకృష్ణ కలకుంట్ల, సోషల్ మీడియా కన్వీనర్స్ అంజన్ రావు, ఈవెంట్స్ ఇంచార్జ్ తరుణ్ లునావత్, సాయికిరణ్ రావు, నర్సింగ రావు, పవన్ కళ్యాణ్, భరత్ రావు, హర్ష వర్ధన్ రెడ్డి, సంజయ్ రెడ్డి, నందీప్ దొగ్గల హాజరైన వారిలో వున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z