ఎన్‌ఆర్‌ఐ బీఆర్ఎస్ బహరేన్ శాఖ అద్యక్షులు రాధారపు సతీష్ కుమార్ , ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి మాట్లాడుతూ 2009, నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన మర్చిపోలేని రోజు స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినం. నాలుగు కోట్ల తెంగాణ ప్రజలు ముక్త కంఠంతో మా తెలంగాణ మాకు కావాలని నినదించారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని తెగువను ప్రదర్శించిన నాయకుడికి అండగా నిలబడి దేశ రాజకీయ వ్యవస్థను కదిలించిన సందర్భం దీక్షా దివస్. కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలు సంక్షేమ ఫలాలు అనుభవించాయని తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అమలైన హామీలు ప్రతి ఇంటికీ చేరినయి అని అన్నారు.
రేవంత్ పాలనలో రైతన్న ఆగమవుతున్నారని పేర్కొన్నారు. హామీలను మరిచిన సీఎం రేవంత్‌రెడ్డి విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ఆరు గ్యారంటీలను అమలు చేసేదాకా ప్రజల పక్షాన పోరాడుతాం , ప్రశ్నిస్తాం అని వెల్లడించారు.
ఈ కార్యక్రమములో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ ప్రధాన కార్యదర్శి మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్, కార్యదర్శులు, చెన్నమనేని రాజేందర్ , ఉత్కం కిరణ్ గౌడ్, చిలుకూరి రాజలింగం , వెంకటేష్ , సాగర్,మహేష్. బిఆర్ఎస్ నాయుకులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z