NRI-NRT

నార్ల పేరిట ఉత్తమ పాత్రికేయ పురస్కారాలు: యార్లగడ్డ

నార్ల పేరిట ఉత్తమ పాత్రికేయ పురస్కారాలు: యార్లగడ్డ

ప్రముఖ పాత్రికేయులు దివంగత నార్ల వెంకటేశ్వరరావు పేరిట ఇకపై ప్రతి సంవత్సరం ఉత్తమ పాత్రికేయ అవార్డులను అందించనున్నట్లు పద్మ భూషణ్, అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ తెలిపారు. పత్రికా సంపాదకీయలను ఒక ఉద్యమంగా, సామాజిక సంస్కరణలకు స్పూర్తిగా ఉపయోగించిన నార్ల, పత్రికా సమాజానికి దిక్సూచి వంటి వారని కొనియాడారు.

లోక్ నాయక్ ఫౌండేషన్ నేతృత్వంలో ఇకపై ప్రతి సంవత్సరం ముగ్గురు జర్నలిస్టులకు ఒక్కొక్కరికీ రూ.50వేల నగదు పురస్కారంతో విజయవాడ వేదికగా నార్ల ఉత్తమ పాత్రికేయ అవార్డులను అందిస్తామన్నారు. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల నుండి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తామని, ఇందుకోసం లబ్దప్రతిష్టులతో కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అవార్డులను ప్రతి ఏటా డిసెంబరు 1వ తేదీన అందజేస్తామని యార్లగడ్డ తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z