Fashion

వేలానికి “రాజీవ్ “స్వగృహ” ఇళ్లు

వేలానికి “రాజీవ్ “స్వగృహ” ఇళ్లు

రాజీవ్‌ స్వగృహ గృహాల వేలానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇందులో కొన్ని ఫ్లాట్లు, స్థలాలు, పూర్తికాని అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. హైదరాబాద్‌, ఖమ్మం, వికారాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లోని గృహాలు, స్థలాల వేలంతో ఖజానాకు రూ. 3,000కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో 2007లో రాజీవ్‌ స్వగృహ స్కీమ్‌ ప్రారంభించారు. పేద లు, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలనేది స్కీమ్‌ ఉద్దేశం. వివిధ ప్రాంతాల్లో సిద్ధం చేసిన ఇండ్ల స్థలాలు, అపార్ట్‌మెంట్లకు ఆరుసా ర్లు నిర్వహించిన వేలంలో 2956 ఫ్లాట్లు విక్రయించగా, 760ఫ్లాట్లు మిగిలి ఉన్నా యి. వీటి ధరలు నిర్ణయించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నిర్మాణం పూర్తయిన ఇండ్లను ప్రజలకు, పూర్తికాని వాటిని బిల్డర్లకు విక్రయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z