* సువెన్ ఫార్మాస్యూటికల్స్ యూఎస్- ఆధారిత ఎన్‌జే బయో కంపెనీలో 64.4 మిలియన్ల డాలర్లకు నియంత్రణ వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ప్రిన్స్‌టన్, ఎన్‌జే బయోలో 56 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు సువెన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ వివేక్ శర్మ తెలిపారు. ఎన్‌జే బయో సామర్థ్యాలు తమకు ఉపయోగపడతాయన్నారు.
* ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం బ్రాండ్ వన్97 జపాన్ పేపేలో తన స్టాక్ అక్విజిషన్ హక్కులను విక్రయించనుంది. దీనివల్ల కంపెనీకి రూ. 2,364 కోట్లు సమకూరుతాయి. పేపేకి సాంకేతిక సేవలను అందించడానికి పేటీఎం, పేటీఎం సింగపూర్ జపాన్ డిజిటల్ వాలెట్ సంస్థ, సాఫ్ట్‌బ్యాంక్ కార్ప్, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్, యాహూ జపాన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. సేవలకు బదులుగా పేటీఎం సింగపూర్ పేపేలో 7.2 శాతం వాటా పొందింది.
* బట్టలు ఉతికేందుకు వాషింగ్ మిషన్లను మనం చూశాం.. కానీ మనిషిని క్లీన్ చేసే వాషింగ్ మిషన్లను చూశారా.. హ్యూమన్ వాషింగ్ మిషన్ వచ్చేసింది. జపాన్ కు చెందిన ఇంజనీర్లు ఈ మెషిన్లను తయారు చేశారు. ఈ మానవ వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మిరాయ్ నింగెన్ సెంటకుకి పేరుతో హ్యూమన్ వాషింగ్ మెషీన్ ఆఫ్ ది ఫ్యూచర్ ను ఆవిష్కరించారు జపాన్ ఇంజనీర్లు.. ఇది AI, హైటెక్ వాట్ జెట్లతో కలయిక మనిషి పూర్తి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. దీంతో పాటు మనసును కూడా క్లీన్ చేస్తుందట ఈ AI వాషింగ్ మిషన్. ఈ మానవ వాషింగ్ మిషన్ ఒసాకా బేస్డ్ సైన్స్ కో చేత డెవలప్ చేయబడింది. ఈ వాషింగ్ మిషన్ కేవలం 15 నిమిషాల్లో వాష్ అండ్ డ్రై ప్రక్రియ ద్వారా కస్టమర్ శరీరాన్ని శుభ్రపరుస్తుంది.ఈ మెషీన్లో సున్నితమైన భాగాలను క్లీన్ చేసే పరిశ్రమ్లలో ఉపయోగించే చిన్న చిన్న గాలి బుడగలగల హైస్సీడ్ వాటర్ జెట్ లను ఉపయోగిస్తారట. ఈ హ్యూమన్ వాషింగ్ మెషీన్ లో అద్బుతమైన ఫీచర్ ఏంటంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్ .. కస్టమర్ ఎమోషనల్ స్టేటస్ అంచనా వేస్తుందట.. దీని ద్వారా ప్రశాంతం, ఓదార్పును అందిస్తుందట.
* అన్‌అకాడమీ (Unacademy) సంస్థను విక్రయిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు గౌరవ్ ముంజన్ తోసిపుచ్చారు. అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్‌కు దీనిని 800 మిలియన్ డాలర్ల(రూ.6.7 వేల కోట్లు)కు విక్రయిస్తున్నట్లు వార్తలొచ్చాయి. వాస్తవానికి అన్‌అకాడమీ అత్యధిక విలువ 3.4 బిలియన్ డాలర్ల (రూ.28 వేల కోట్లకు పైగా) కంటే ఇది చాలా తక్కువ. ఈ రూమర్లపై గౌరవ్ ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘‘నేను గతంలో చెప్పాను.. మళ్లీ చెబుతున్నాను. ఆఫ్‌లైన్ బిజినెస్‌లో ఈ ఏడాది అన్‌అకాడమీ సంస్థ అత్యున్నత స్థాయి వృద్ధిని సాధించింది. మొత్తంగా యూనిట్ ఎకనామిక్స్‌లో ఇది దూసుకుపోతోంది. సుదీర్ఘకాలం పాటు పనిచేసేలా మేము దీనిని నిర్మించాము. ఎలాంటి అమ్మకాలు చేయడంలేదు.. పుకార్లను నమ్మవద్దు’’ అని పేర్కొన్నారు.
* శ్రీమంతులు అడ్డాగా భారత్ మారిపోతున్నది. ప్రతియేటా దేశవ్యాప్తంగా బిలియనీర్లు గణనీయంగా పెరుగుతున్నారు. ప్రస్తుత సంవత్సరానికిగాను భారత్‌లో 185 మంది ఆగర్భ శ్రీమంతులు ఉన్నట్లు యూబీఎస్ తన నివేదికలో వెల్లడించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే సంపన్నవర్గాలు 21 శాతం మంది పెరిగారని, వీరి మొత్తం సంపద 905.6 బిలియన్ డాలర్లు లేదా రూ.75.19 లక్షల కోట్ల స్థాయిలో ఉన్నదని పేర్కొంది. నికరంగా వీరి సంపద 42 శాతం ఎగబాకిందని తెలిపింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z