Agriculture

ఈ రెండు గ్రామాలు…Pure Veggie Villages!

ఈ రెండు గ్రామాలు…Pure Veggie Villages!

అవగాహన కార్యక్రమలతో పనిలేకుండానే స్వచ్ఛంధంగా రెండు ఊర్ల ప్రజలంతా శాకాహారులుగా జీవిస్తున్నారట. నమ్మశక్యంగా లేకపోయిన ఆ రెండు ఊర్లలోని ప్రజలు మాంసం జోలికిపోరు. ఒకవేళ ఎవరైనా నాన్ వెజ్ తిన్నట్లు తెలిస్తే ఇక అంతే.. ! సదరు వ్యక్తులకు కఠిన శిక్షలు తప్పవు. వాళ్లంతా ఈ నియామానికి కట్టుబడి ఉండి శాకాహారులగానే ఉండటం విశేషం. ఎక్కడ ఉన్నాయంటే ఆ ఊర్లు..ఒకటి మహారాష్ట్రలో ఉండగా, ఇంకొకటి బిహార్‌లో ఉంది.

బిహార్‌లోని గయ జిల్లాలో బిహియా అనే ఊరుంది. అక్కడ మూడు శతాబ్దాలుగా ప్రజలు నియమ నిష్ఠలతో, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఆచారాలను పాటిస్తూ వస్తున్నారు. దాదాపు 400 కుటుంబాలు ఉన్న ఈగ్రామంలో 300 ఏళ్ల నుంచి అందరూ శాకాహారులుగానే కొనసాగుతున్నారు. వీరు పూజించే బ్రహ్మ బాబా ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే శాకాహార జీవన విధానాన్నే అవలంబించాలన్నది అక్కడ వారి నమ్మకం. ఎప్పటి నుంచో వస్తున్న ఈ ఆచారాన్ని ప్రస్తుత తరాలవారు కూడా పాటించడం విశేషం. ఇక్కడి వారిని పెళ్లి చేసుకుని వచ్చే వారు కూడా ఇదే జీవనశైలిని పాటించాల్సిందే. ఇక్కడ ప్రజలు కనీసం ఉల్లి, వెల్లుల్లి కూడా తినరు.

మరొక ఊరు..మహారాష్ట్ర.. సాంగ్లీ జిల్లాలోని ఖానాపూర్ తాలూకాలో రేనవి అనే గ్రామంలో ప్రజలు స్వచ్ఛమైన శాకాహారాలుగా జీవిస్తున్నారు. ఇక్కడ కూడా గయ గ్రామం మాదిరిగా వందల సంవత్సరాలుగా శాకాహారులుగా కొనసాగుతున్నారు. ఇక్కడ కూడా ఎవ్వరూ..మాంసాన్ని ముట్టరు. ఊళ్లోకి తీసుకురారు. ఈ గ్రామంలో ప్రసిద్ధ, పవిత్రమైన రేవణసిద్ధ దేవాలయం ఉంది. అందువల్ల ప్రజలు తరతరాలుగా శాకాహారం మాత్రమే తింటున్నారు. అన్ని కులాలు, మతాల వారు నివసిస్తున్న ఈగ్రామంలో ప్రజలంతా.. ఇక్కడి ఆచార వ్యవహారాలను ఇప్పటి వరకు పాటిస్తూ వస్తుండటం విశేషం. ఈ ప్రదేశం భక్తుల రద్దీతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. ఈ దేవాలయం ప్రతిజ్ఞ చేసే ప్రదేశంగా పేరుగాంచింది. వృద్ధులు కూడా విశ్వాసంతో ఇక్కడికి వస్తుంటారు. రావణుడి మహిమ కారణంగా ఈ గ్రామం పూర్తిగా శాకాహారంగా మారింది. హిందువులు, ముస్లింలతో సహా అన్ని మతాల ప్రజలు ఈ ఊళ్లో నివసిస్తున్నా.. వారు కూడా శాకాహారులుగానే ఉంటున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z