తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్(TAL) ఆధ్వర్యంలో డిసెంబర్ 7న ఈస్ట్ హామ్‌లోని పిల్‌గ్రిమ్స్ వే చర్చిలో 16వ వార్షిక క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. జరుపుకుంది. పెద్దసంఖ్యలో ప్రవాస తెలుగు పిల్లలు పెద్దలు పాల్గొన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
ప్రత్యేక క్రిస్మస్ కేరోల్స్, నృత్య ప్రదర్శనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. పిల్లల ఆకర్షణీయమైన ప్రదర్శనల తరువాత, రెవరెండ్ సలోమి సుఖేష్, పాస్టర్ అజయ్, పాస్టర్ భరత్ క్రిస్మస్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రవీణ్ మణికొండ క్రిస్మస్ భక్తిగీతాలను ప్రదర్శించారు. ఈస్ట్‌హామ్ నియోజకవర్గ ఎంపీ సర్ స్టీఫెన్ టిమ్స్ ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారు.
TAL ఛైర్మన్ రవి సబ్బా అతిథులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ట్రస్టీలు అనిల్ అనంతుల, రవి కుమార్ రెడ్డి మోచర్ల, వెంకట్ నీల, శ్రీదేవి ఆలెద్దుల, అశోక్ మాడిశెట్టి, రాయ్ బొప్పన, జెమిమా దారా, రత్నాకర్ దారా, పద్మ కుందన్, కరుణాకర్, శ్రీధర్ వనం, సత్యేంద్ర పగడాల, రవీందర్ రెడ్డి, మల్లేష్ కోట, లక్ష్మణ్ కోట, గిరిధర్ పుట్లూరు, వాజిద్ భాషా తదితరులు పాల్గొని వేడుక విజయవంతానికి సహకరించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z