* కర్ణాటక (Karnataka)లోని బెళగావి (Belagavi) రణరంగంగా మారింది. విద్య, ఉద్యోగ రంగాల్లో 15 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ లింగాయత్ (Lingayat Community) పంచమసాలి వర్గీయులు ఆందోళనకు దిగారు. వివిధ ప్రాంతాల నుంచి బెళగావికి ర్యాలీగా చేరుకున్న ఆందోళన కారులు.. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే విధాన సౌధను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళన కారుల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.
* దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CUET-UG)లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక మార్పులు చేపట్టింది. వచ్చే ఏడాది నుంచి కేవలం కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలోనే పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 12వ తరగతిలో అభ్యసించిన సబ్జెక్టులతో సంబంధం లేకుండా విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు 2025 నుంచి ఏ సబ్జెక్టునైనా ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. సీయూఈటీ – యూజీలో ప్రతిపాదిత మార్పులపై తాము ఏర్పాటు చేసిన నిపుణుల ప్యానెల్ సమీక్షించిందని యూజీసీ ఛైర్మన్ ఎం.జగదీశ్ కుమార్ వెల్లడించారు.
* విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. స్కానింగ్ కోసం వచ్చిన ఓ మహిళను సిబ్బంది వేధింపులకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం విశాఖకు చెందిన ఓ మహిళ తలకు గాయమై సోమవారం రాత్రి ఆసుపత్రికి వచ్చింది. స్కానింగ్ చేయించాలని వైద్యులు సూచిచండంతో .. అదే ఆసుపత్రిలోని స్కానింగ్ సెంటర్‌కు వెళ్లింది.
* ఎన్ని ఇబ్బందులొచ్చినా ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో కొనసాగిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారం అవుతున్నాయి. ప్రతి పౌరుడికి నమ్మకం కలిగేలా ప్రజావాణి నిర్వహిస్తున్నాం. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజల అవసరాలు తీర్చాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం. మీ కోసమే మేం ఉన్నామనే భావన అధికారులు.. ప్రజలకు కల్పించాలి. రాజ్యాంగ పీఠికలోని లక్ష్యాలను ప్రజలకు అందించాలని ప్రయత్నిస్తున్నాం’’ అని భట్టి విక్రమార్క తెలిపారు.
* కొవిడ్ 19 మహమ్మారి (Covid 19) కనీవినీ ఎరుగని విపత్తు అని, టీకాల పంపిణీ ప్రక్రియ (Vaccination) ప్రజల ప్రాణాలను రక్షించిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొవిడ్ వ్యాక్సిన్ కారణంగా ఇద్దరు మహిళలు మృతి చెందారని ఆరోపిస్తూ సుప్రీం కోర్టు (Supreme Court)లో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్రం ఈ విధంగా స్పందించింది.
* ప్రస్తుత క్రికెట్ ఫ్యాబ్4లో ఒకడిగా ఉన్న ఇంగ్లాండ్ బ్యాటర్ జోరూట్ (Joe Root) ప్రస్తుతం ప్రపంచంలో ఉత్తమ ఆటగాడు ఎవరో చెప్పాడు. అయితే, భారత యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ (Rishabh Pant)లలో రూట్ ఒక్కరిని కూడా అత్యుత్తమ ఆటగాడిగా పరిగణించలేదు. తన సహచర ఆటగాడు హ్యారీ బ్రూక్ (Harry Brook) బెస్ట్ ప్లేయర్ అని పేర్కొన్నాడు. అతను ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడని ప్రశంసించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో 25 ఏళ్ల బ్రూక్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు బాదాడు. 2022లో అరంగేట్రం చేసిన అతను 23 మ్యాచ్‌ల్లోనే 8 శతకాలు సాధించడం విశేషం. ఈనేపథ్యంలోనే బ్రూక్‌ను రూట్ ప్రశంసల్లో ముంచెత్తాడు. ‘ప్రస్తుతానికి హ్యారీ బ్రూక్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు. అతడిని చూస్తే ముచ్చటేస్తుంది. ఒత్తిడిని తట్టుకొని ఆడే సామర్థ్యం అతడి సొంతం. మైదానంలో అన్నివైపులా షాట్లు ఆడతాడు. సిక్స్ కోసం తల మీదుగా స్కూప్ షాట్ అద్భుతంగా ఆడతాడు. మిగిలిన రకాల షాట్లు కూడా సునాయసంగా కొడతాడు’ అని జో రూట్ పేర్కొన్నాడు.
* విదేశాల్లో పైచదువులు చాలామంది కల. అందులోనూ అమెరికాలో ఉన్నతవిద్య అభ్యసించేందుకు మరింత ఎక్కువ ఇష్టపడుతుంటారు. అలా మన దేశం నుంచి ఏటా వేల మంది విద్యార్థి వీసాలపై (US Student Visa) అగ్ర రాజ్యానికి వెళ్తుంటారు. అయితే, ఈసారి ఆ సంఖ్యలో భారీ తగ్గుదల కన్పించడం గమనార్హం. ఈ ఏడాది తొలి 9 నెలల్లో భారతీయ విద్యార్థులకు (Indian Students) జారీ చేసే ఎఫ్-1 స్టూడెంట్ వీసాలు 38శాతం తగ్గాయి. ఈమేరకు అమెరికా విదేశాంగ శాఖ గణాంకాలు వెల్లడించాయి. బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ నెలవారీ నివేదికల డేటా ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు మధ్య 64,008 మంది భారతీయ విద్యార్థులకు ఎఫ్-1 వీసాలను (F-1 Student Visa) జారీ చేశారు. గతేడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 1,03,495గా ఉండటం గమనార్హం. కొవిడ్ తర్వాత భారతీయ విద్యార్థులకు వీసాలు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. 2021 తొలి తొమ్మిది నెలల్లో 65,235 మందికి ఎఫ్-1 విద్యార్థి వీసాలు ఇవ్వగా.. 2022 జనవరి-సెప్టెంబరు మధ్య 93,181 మంది భారతీ విద్యార్థులకు వీసాలు దక్కాయి.
* తాను ఆస్తి కోసమో, డబ్బు కోసమో పోరాటం చేయడం లేదని సినీనటుడు మంచు మనోజ్ (Manchu Manoj) అన్నారు. తనను తొక్కేయడానికి భార్య, పిల్లల అంశాన్ని తీసుకొస్తున్నారని ఆరోపించారు. కుటుంబ వివాదం నేపథ్యంలో జల్‌పల్లిలో మనోజ్ మీడియాతో మాట్లాడారు. ‘‘నేను చేసేది ఆత్మగౌరవ పోరాటం. ఇది నా భార్య, పిల్లల రక్షణకు సంబంధించిన విషయం. నన్ను అణగదొక్కేందుకు నా భార్యను బెదిరింపులకు గురిచేయడం.. నా ఏడునెలల పాపను దీనిలోకి లాగడం.. నా పిల్లలు ఇంట్లో ఉండగానే ఇలా ప్రవర్తించడం సరికాదు. పోలీసుల వద్దకు వెళ్లి రక్షణ కోరాను. నాకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తామనే వారు నా మనుషులను బెదరగొట్టి వేరే వాళ్లని లోపలికి పంపించారు. నా మనుషులను ఇక్కడి నుంచి పంపించే అధికారం పోలీసులకు ఎక్కడిది? ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు?నాకు మద్దతు కోసం ప్రపంచంలోని అందర్నీ కలుస్తా’’ అని మనోజ్ వ్యాఖ్యానించారు.
ఇదే అదునుగా భావించిన స్కానింగ్ సెంటర్ ఇన్‌ఛార్జి ప్రకాశ్ .. స్కానింగ్ కోసం దుస్తులు తీసేయాలని చెప్పాడు. ఆ తర్వాత ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళ కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు ప్రకాశ్‌కు దేహశుద్ధి చేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న విశాఖ మూడో పట్టణ సీఐ రమణయ్య ఆసుపత్రికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతో రోగులు నరకం చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
* ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను చంపేస్తామంటూ ఓ ఆగంతకుడు ఆయన పేషీకి ఫోన్ కాల్స్ చేయడంతో పాటు సందేశాలు పంపించడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. బెదిరింపు కాల్స్, సందేశాల గురించి పేషీలోని సిబ్బంది పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు వేగవంతం చేశారు. బెదిరింపు కాల్స్ చేసిన నూక మల్లికార్జునరావును అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితుడు మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. రహస్యప్రాంతంలో అతన్ని విచారిస్తున్నారు. పవన్‌కల్యాణ్ పేషీకి 95055 05556 నంబరు నుంచి కాల్ వచ్చినట్లు గుర్తించారు. ఈ నంబరు ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన మల్లికార్జునరావు పేరుతో ఉందని పోలీసులు తేల్చారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద టవర్ నుంచి కాల్స్ వచ్చినట్లు తేలింది. నగర కమిషనర్ రాజశేఖర్‌బాబు టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచి, లా అండ్ ఆర్డర్ విభాగాలకు చెందిన పోలీసులతో నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ఆఘమేఘాలపై గాలింపు చేపట్టినా ఫోన్ స్విచాఫ్ చేయడంతో ఎక్కడ ఉన్నదీ గుర్తించడం కష్టంగా మారింది. విజయవాడతో పాటు తిరువూరులోనూ గాలింపు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడు మల్లికార్జునరావును అదుపులోకి తీసుకున్నారు.
* బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టెలివిజన్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (Kaun Banega Crorepati). ప్రస్తుతం 16వ సీజన్ ప్రసారమవుతోంది. ఈ కార్యక్రమంలో తన సతీమణి జయా బచ్చన్ (Jaya Bachchan)పై అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె కాల్ చేస్తే ఎందుకు టెన్షన్ పడతారో చెప్పారు. ‘‘ఇంట్లో బంధువులున్నా, అతిథులు వచ్చినా జయ వారితో బెంగాలీలోనే మాట్లాడుతుంది. తాను ఫోన్ కాల్ చేసిన సమయంలో పక్కన ఎవరైనా ఉన్నా ఆ భాషలోనే మాట్లాడడం ప్రారంభిస్తుంది. నాకేమో ఆ భాష అర్థం కాదుగానీ అర్థమైనట్టు నటిస్తా (నవ్వులు). ఇప్పటికీ నేను బెంగాలీ మాట్లాడలేను. ‘నాకు ఎక్కువగా తెలియదు, కొంచెం అర్థమైంది’ అని మాత్రం చెప్పగలను’’ అని పేర్కొన్నారు.
* తాను అధ్యక్ష పదవి చేపట్టగానే అక్రమ వలసదారులు అందరినీ అమెరికా నుంచి వెళ్లగొట్టి, చట్టబద్ధంగా వలస వచ్చేవారికి మార్గం సులువు చేస్తానని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. ఇది భారతీయులకు శుభవార్త కావచ్చు. ఈ మేరకు ఆయన ఎన్.బి.సి. టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివిధ అంశాలు వెల్లడించారు. ‘‘అమెరికాలో సాధికారికంగా ప్రవేశం పొందాలనుకునేవారు ఈ దేశాన్ని ప్రేమించాలి. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఏమిటో చెప్పగలగాలి’’ అని ట్రంప్ అన్నారు. ‘‘కొన్ని దేశాల జైళ్ల నుంచి నేరస్థులు నేరుగా అమెరికాకు వస్తున్నారు. అలాంటి 13,099 మంది నేరస్థులు అమెరికా వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ ప్రమాదకర వ్యక్తులను మన దేశంలో ఉండనివ్వకూడదు. తక్షణం వెళ్లగొట్టాలి’’అని ఉద్ఘాటించారు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన తల్లిదండ్రుల సంతానం (డ్రీమర్స్)లో చాలామంది ఇక్కడే పుట్టి పెరిగారని, వారిలో చాలామంది గొప్ప ఉద్యోగాలు, వృత్తులు చేస్తున్నారని చెప్పారు. వారి సమస్యను పట్టించుకుంటానని స్పష్టంచేశారు. ప్రతిపక్ష డెమోక్రాట్లతో కలసి ఒక పరిష్కారం కనుగొంటానని వివరించారు.
* వైకాపా భూబకాసురులు రాష్ట్రంలో వేల ఎకరాలు కబ్జా చేశారని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ప్రభుత్వ భూముల నుంచి దేవాదాయ, అసైన్డ్ భూముల వరకు అన్నీ కొట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
* చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతోన్న పలు కంపెనీలపై కామారెడ్డి భాజపా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు.
* వ్యవసాయ యాంత్రీకరణ, డ్రీప్ ఇరిగేషన్ పథకాల అమలును వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అధిక మొత్తంలో రైతులకు లబ్ధి చేకూర్చాలన్నారు.
* రెండేళ్లకుపైగా కత్తులు దూసుకుంటున్న రష్యా-ఉక్రెయిన్.. భారత్‌కు యుద్ధనౌకను అందించడం కోసం వేర్వేరుగా కలిసి పని చేశాయి. భారత నౌకాదళంలో చేరిన అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ తుశిల్ తయారీలో రష్యా, ఉక్రెయిన్ భాగస్వామ్యమయ్యాయి. ఈ నౌక రష్యా డాక్‌యార్డ్‌లో తయారు కాగా.. దీనికి ఇంజిన్‌ను ఉక్రెయిన్ సమకూర్చడం గమనార్హం
* మోసం, నమ్మకద్రోహం, అవినీతి ఆరోపణల కేసులో దశాబ్దాల రాజకీయ జీవితంలో నెతన్యాహు తొలిసిరిగా కోర్టు బోనెక్కారు. విచారణ కొనసాగుతోంది. అంతే కాకుండా నేరారోపణలు ఎదుర్కొంటున్న తొలి ఇజ్రాయెల్ ప్రధానిగా నిలిచారు.
* పార్లమెంటులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభకు ఛైర్మన్‌గా ఉన్న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankar)పై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
* బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా (Team India) ఘన విజయం సాధించగా.. అడిలైడ్ టెస్టులో ఆసీస్ (Australia) గెలిచింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ 1-1తో సమం అయింది. డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final)కు చేరాలంటే ఇరుజట్లకు ఈ సిరీస్ చాలా కీలకం. కాబట్టి, మున్ముందు సిరీస్ మరింత హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అభిమానుల్లో కూడా మ్యాచ్‌లపై ఆసక్తి పెరిగింది. మెల్‌బోర్న్ వేదికగా డిసెంబరు 26 నుంచి నాలుగో టెస్టు (Boxing Day Test) ప్రారంభం కానుంది. ఈ బాక్సింగ్ డే టెస్టు టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ స్టేడియం సామర్థ్యం లక్ష కాగా.. మ్యాచ్‌కు ఇంకా 15 రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే మొదటిరోజు ఆటకు సంబంధించిన టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తొలి రోజుకు సంబంధించి అందుబాటులో ఉన్న పబ్లిక్ టికెట్లన్నీ అమ్ముడైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఎక్స్ (ట్విటర్)లో వెల్లడించింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z