* ఓ నటితో అసభ్యంగా ప్రవర్తించారన్న అభియోగాలపై నమోదైన కేసుకు సంబంధించి సీనియర్ నటుడు, దర్శకుడు బాలచంద్ర మేనన్ (Balachandra Menon)కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకే కాదు.. పురుషులకూ గౌరవ మర్యాదలు ఉంటాయని పేర్కొంది.
* ఆస్ట్రేలియాతో (AUS w Vs IND w) మూడో వన్డేలోనూ భారత మహిళా జట్టు ఓటమిపాలైంది. ఆసీస్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 215 రన్స్‌కు ఆలౌటైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) (105; 109 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) శతకం వృథా అయింది.
* ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సమక్షంలో గూగుల్, ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఒప్పందం చేసుకున్నారు. విశాఖలో వ్యూహాత్మక పెట్టుబడులకు గూగుల్ ముందుకొచ్చింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐటీ అభివృద్ధి చేస్తామని గూగుల్ ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా భారతదేశ ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గూగుల్ ప్రతిపాదిత పెట్టుబడులను స్వాగతిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
* పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఇండియా కూటమికి మిత్రపక్షాల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై గౌరవం, నమ్మకంతో కూటమికి సారథ్యం వహించే విషయంలో తనకు మద్దతిస్తున్నారని అన్నారు. వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
* నాంపల్లి ఏక్‌మినార్ కూడలిలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో ఆయిల్ నింపేందుకు హిందూస్థాన్ పెట్రోలియం ట్యాంకర్ వచ్చింది. ఈ క్రమంలో ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన స్థానికులు, పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు.
* ఇజ్రాయెల్- హమాస్ (Israel-Hamas)ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ వరుస దాడులు పాలస్తీనా పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా గాజా(Gaza)లో టెల్‌అవీవ్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 26 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈమేరకు పాలస్తీనా వైద్య అధికారులు వెల్లడించారు.
* ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ (World Chess Championship) మ్యాచ్ రసవత్తర క్లైమాక్స్‌కు వేదికగా నిలుస్తోంది. 14 గేమ్‌ల ఈ ప్రపంచ మ్యాచ్‌లో 12 గేమ్‌లు ముగిసేసరికి భారత యువ సంచలనం గుకేశ్, డింగ్ లిరెన్ 6-6తో సమంగా ఉండగా.. బుధవారం జరిగిన 13వ గేమ్ డ్రాగా ముగిసింది. 69 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు డ్రాకు అంగీకరించారు. ప్రస్తుతం ఇద్దరు ఆటగాళ్లు 6.5-6.5 పాయింట్లతో సమానంగా ఉన్నారు. గురువారం జరిగే చివరి (14వ) గేమ్‌లో గెలుపొందిన ఆటగాడు ఛాంపియన్‌గా నిలుస్తాడు. ఒకవేళ చివరి గేమ్ కూడా డ్రా అయితే ఇద్దరు ఏడేసి పాయింట్లతో సమానంగా ఉంటారు. అలా జరిగితే శుక్రవారం టైబ్రేక్‌లో విజేతను నిర్ణయిస్తారు. టోర్నీలో మొదటి గేమ్ లిరెన్ గెలవగా.. రెండో గేమ్ డ్రా అయింది. మూడో గేమ్‌లో గుకేశ్ విజయం సాధించి స్కోరును సమం చేశాడు. తర్వాత వరుసగా ఏడు గేమ్‌లు డ్రాగా ముగిశాయి. 11వ రౌండ్లో విజయం సాధించిన గుకేశ్ 6-5తో ఆధిక్యంలోకి వచ్చాడు. కానీ,12వ గేమ్‌లో పెద్దగా పోటీ ఇవ్వలేక ఓటమిపాలయ్యాడు.
* ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం విడుదల చేశారు. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం, మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు రాసే విద్యార్థులందరికీ మంత్రి లోక్‌శ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
* నటుడు మంచు మనోజ్‌పై దాడి కేసులో విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం తనపై దాడి చేశారని మనోజ్ పహడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం కిరణ్‌ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు వినయ్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు. జల్‌పల్లిలో తనపై దాడి చేయడమే కాకుండా సీసీటీవీ ఫుటేజ్‌ను మాయం చేశారన్న మనోజ్ ఫిర్యాదు మేరకు .. మోహన్‌బాబు మేనేజర్ కిరణ్, విజయ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.
* రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో తీవ్రంగా హింసించి, అంతమొందించేందుకు ప్రయత్నించారన్న కేసులో కీలక నిందితుడైన సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ రావెల విజయ్‌పాల్‌ను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు జిల్లా ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రఘురామ కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఇటీవల విజయ్‌పాల్‌ను విచారించారు. ‘నాకు తెలియదు.. గుర్తు లేదు’ అని చెప్పి పలు ప్రశ్నలకు సమాధానాలు దాట వేశారు. విజయ్‌పాల్ విచారణకు సహకరించడం లేదని, పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు గుంటూరు జిల్లా ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఈనెల 13, 14 తేదీల్లో పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. విజయ్‌పాల్ ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
* నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 4న రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
* ఈ నెల 12వ తేదీ నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయంలో పని చేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఈ అటెండెన్స్ వర్తించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్, సచివాలయం హెడ్ నుంచి వేతనాలు పొందే ప్రతి ఉద్యోగికి వర్తించనున్నట్లు పేర్కొన్నారు.
* కాంగ్రెస్ ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరించి.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిన నందిని సిధారెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు ఉద్యమాభివందనాలు తెలిపారు. ‘కోటి రూపాయలు ముఖ్యం కాదు. కోట్లాది ప్రజల గుండెల తల్లి ముఖ్యం. అందుకే ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరించిన’ అని ప్రముఖకవి, రచయిత నందిని సిధారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. కోటి రూపాయల కన్నా, కోట్లాది ప్రజల గుండెల్లో కొలువైన తెలంగాణ తల్లే మిన్న, బతుకమ్మను తీసేయడం అంటే తెలంగాణ బతుకును అవమానించడమే అని, ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరిస్తూ.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిన నందిని సిధారెడ్డికి హృదయపూర్వక ఉద్యమాభినందనలు తెలుపుతున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘కోటి రూపాయలు ముఖ్యం కాదు. కోట్లాది ప్రజల గుండెల తల్లి ముఖ్యం. అందుకే ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరించిన’ అని ప్రముఖకవి, రచయిత నందిని సిధారెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లిని మార్చటం అంటే తెలంగాణ ప్రతీకలను మార్చటమేనని, శిల్పుల గిరాకీ కోసం చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు అదే శిల్పులు ‘నాడు కేసీఆర్ ప్రభుత్వంతో ఖర్చుపెట్టించారు..ఈనాడు ఈ ప్రభుత్వంతో ఖర్చుపెట్టిస్తున్నారు’ అని వాపోయారు. తెలంగాణ సాంస్కృతిక సోయిలేనివాళ్లే వెయ్యేండ్ల బతుకమ్మను లేకుండా చేశారని మంగళవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తేల్చిచెప్పారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z