తితిదే ఛైర్మన్‌గా బీ.ఆర్.నాయుడు నియామకం పట్ల అమెరికా ప్రవాసులు ఆయనకు అభినందనలు తెలుపుతూ సంబరాలు నిర్వహించారు. శ్రీధర్ చిల్లర సమన్వయంలో న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ హాలులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ వేడుకలో స్వాతి అట్లూరి నృత్య పాఠశాల విద్యార్థులు అన్నమయ్య కీర్తనలపై నృత్యాలు ప్రదర్శించారు. శ్రీధర్ చిల్లర ప్రసంగిస్తూ బి. ఆర్. నాయుడు తితిదే పవిత్రతను కాపాడుతూ భక్తులకు శ్రీవారిని మరింత చేరువ చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం బి. ఆర్. నాయుడు పంపిన ప్రత్యేక వీడియో సందేశాన్ని ప్రదర్శించారు. ప్రవాసులకు తన ధన్యవాదాలు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z