* జ్యువెల్లర్లు, కొనుగోలు దారుల నుంచి గిరాకీ రావడంతోపాటు జోరుగా విక్రయాలు సాగుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీలో బంగారం, వెండి ధరలు శుక్రవారం ఒక్కరోజే భారీగా తగ్గుముఖం పట్టాయి. మళ్లీ తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.80 వేల దిగువకు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ధోరణి కూడా దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గడానికి మరో కారణంగా ఉంది. శుక్రవారం 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.1,400 తగ్గి రూ.79,500లకు పడిపోయింది. గురువారం తులం బంగారం ధర రూ.80,900 వద్ద స్థిర పడింది. మరోవైపు, కిలో వెండి ధర రూ.4,200 పతనమై రూ.92,800 వద్దకు పడిపోయింది. డిసెంబర్ నెలలో భారీగా వెండి ధర పతనం కావడం ఇదే మొదటిసారి. గురువారం కిలో వెండి ధర రూ.97,000 పలికింది. శుక్రవారం 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.1,400 పతనమై రూ.79,100 లకు చేరుకున్నది. గురువారం 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.80,500 పలికింది.
* భారతీయ విదేశీ మారక ద్రవ్యం (Forex Reserve) నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఈ నెల ఆరో తేదీతో ముగిసిన వారానికి భారత్ ఫారెక్స్ రిజర్వు నిల్వలు 3.235 బిలియన్ డాలర్లు తగ్గి 654.857 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. పలు వారాలుగా వరుస పతనం తర్వాత గత నెల 29తో ముగిసిన వారానికి 1.51 బిలియన్ డాలర్లు వృద్ధి చెందిన ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 658.091 బిలియన్ డాలర్లకు చేరాయి. సెప్టెంబర్ నెలాఖరులో 704.885 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు చేరుకున్నాయని ఆర్బీఐ తెలిపింది.
* కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మరోసారి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఫోర్బ్స్ (Forbes) విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితా (Worlds Most Powerful Women List)లో చోటు సాధించారు. ఫోర్బ్స్ ఏటా వ్యాపారం, వినోదం, రాజకీయ, దాతృత్వం తదితర రంగాల నుంచి ప్రభావవంతమైన వ్యక్తుల ర్యాంకింగ్‌లను విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి మొత్తం ముగ్గురికి చోటు దక్కింది. అందులో నిర్మలమ్మ తొలి స్థానంలో నిలిచారు. ఇక వరుసగా ఆరో సంవత్సరం ఈ జాబితాలో ఆమె చోటు దక్కించుకోవడం విశేషం.
* సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్ కంపెనీ అయిన అంబుజా సిమెంట్స్..గుజరాత్ ఖావ్డాలోని తన 200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసి విద్యుత్ పంపిణీని ప్రారంభించిందని కంపెనీ ఒక ఫైలింగ్‌లో తెలిపింది. 1 గిగావాట్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో భాగంగా దీన్ని ముందుగా ప్రారంభించింది. పవన, సౌర ప్రాజెక్టులతో సహా మిగిలిన 806 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి, సరఫరా 2025 మార్చి-జూన్ మధ్య దశలవారీగా ప్రారంభమవుతుందని కంపెనీ పేర్కొంది. ఖావ్డా నుంచి 156 మెగావాట్ల పవన విద్యుత్తు, రాజస్థాన్ నుంచి మరో 300 మెగావాట్ల సౌర విద్యుత్ దశలవారీగా 2025, మార్చి నాటికి పంపిణీ చేస్తామని కంపెనీ పేర్కొంది. మిగిలిన 350 మెగావాట్ల సౌర విద్యుత్తు సరఫరాను 2025 జూన్ నాటికి ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z