‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్ సంస్థ ఆధ్వర్యంలో జూమ్ ఆన్లైన్ వేదికగా 40 దేశాల్లోని ప్రవాసాంధ్రులతో ఏపీ రాష్ట్ర MSME, SERP &NRI సాధికారత సంక్షేమ సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అంతర్జాలంలో సమావేశమయ్యారు. ప్రవాసాంధ్రుల పరిస్థితులను, కష్టనష్టాలను, సలహాలను, సూచనలను మంత్రి ఈ సందర్భంగా తెలుసుకున్నారు.
ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తెలుగు ఎన్ఆర్ఐల సమస్యలను పరిష్కరించేందుకు, ప్రవాసీయులతో సంబంధాలు మెరుగుపరిచేందుకే ఈ మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. అన్ని దేశాల తెలుగు సంస్థలను కలుపుతూ ఒక సమూహం ఏర్పాటు చేయాలని AP NRTS నుండి ప్రతి జిల్లాలోనూ కలెక్టరేటుకు అనుబంధంగా ఎన్నారైలకు సహకారం అందించేందుకు ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి, ప్రభుత్వం తరఫున అధికారులను నియమించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. విదేశాలలో తెలుగు భాషా బోధన అభివృద్ధికి తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. వివిధ దేశాల వారు విన్నవించిన సమస్యలను విని స్పందించారు.
APNRTS సీఈఓ పి హేమలతా రాణి, డిప్యూటీ డైరెక్టర్ కరీమ్, అసిస్టెంట్ డైరెక్టర్ పద్మావతి, ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, రాధిక మంగిపూడి, ఖతార్ నుండి విక్రమ్ సుఖవాసి , నార్వే నుండి డా. వెంకట్ తరిగోపుల, యుగాండా నుండి డా. బూరుగుపల్లి వ్యాసకృష్ణ, దక్షిణాఫ్రికా నుండి విక్రమ్ పెట్లూరు తదితరులు పాల్గొన్నారు. సింగపూర్ సంస్థ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, సుధాకర్ జొన్నాదుల, రాంబాబు పాతూరి, సుబ్బు వి పాలకుర్తి, గణేశ్న రాధాకృష్ణలు సహకరించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z