WorldWonders

బిచ్చగాళ్లకు డబ్బులిస్తే FIR నమోదు-NewsRoundup-Dec 16 2024

బిచ్చగాళ్లకు డబ్బులిస్తే FIR నమోదు-NewsRoundup-Dec 16 2024

* ఇటీవల భారత యువ ప్లేయర్ డి గుకేశ్ (Gukesh) ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా (World Chess Championship 2024) నిలిచిన సంగతి తెలిసిందే. అతిపిన్న వయసులోనే (18 ఏళ్లు) ఈ ఘనతను సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గుకేశ్ వచ్చే ఏడాది నార్వే చెస్‌ టోర్నమెంట్‌లో దిగ్గజ క్రీడాకారుడు, అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (Magnus Carlsen)తో తలపడనున్నాడు. నార్వేలోని స్టావెంజర్‌ నగరంలో 2025, మే 26 – జున్ 6 మధ్య ఈ టోర్నమెంట్ జరగనుంది. ‘వింబుల్డన్‌ ఆఫ్‌ చెస్‌’గా పేరున్న ఈ టోర్నీ ప్రతి ఏటా అగ్రశ్రేణి గ్రాండ్‌మాస్టర్లకు ఆహ్వానాలు పంపుతుంది. 2023 నార్వే చెస్‌ టోర్నమెంట్‌ను గుకేశ్‌ మూడో స్థానంతో ముగించాడు. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్ హోదాలో కార్ల్‌సన్‌కు సొంతగడ్డపై సవాలు విసిరేందుకు సిద్ధమవుతున్నాడు.

* మరోగంటలో గ్రూప్-2 పరీక్ష ముగిస్తుందనగా పరీక్ష రాస్తున్న ఓ అభ్యర్థికి గుండెపోటు వచ్చింది. తక్షణమే స్పందించిన ఎస్సై అతడిని వెంటనే ఆస్పత్రిలో చేర్చి ప్రాణాపాయం తప్పించారు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగింది. పటాన్‌చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ గ్రామం లక్ష్మీనగర్‌కు చెందిన ఎల్‌. నగేశ్‌ గ్రూప్‌-2 పరీక్షకు హాజరయ్యారు. నాలుగో పేపర్‌ రాస్తుండగా.. అతడికి గుండెపోటు వచ్చింది. దీంతో నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

* ఏపీ సీఎం చంద్రబాబుతో (Chandrababu) డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించారు. పవన్‌ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో.. ఏ శాఖను కేటాయించాలన్న దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. నాగబాబు ప్రమాణస్వీకార తేదీపైనా నిర్ణయం తీసుకునే అవకాశముంది.

* యాచకులు లేని (Free of Beggars) నగరంగా తీర్చిదిద్దేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ నగరం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే భిక్షాటనను నిషేధించిన జిల్లా అధికారులు.. యాచకులకు సాయం చేసే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భిక్షాటన చేసేవారికి డబ్బులిచ్చేవారిపైనా ఎఫ్‌ఐఆర్‌లు (FIRs) నమోదు చేస్తామని ప్రకటించారు. జనవరి 1, 2025 నుంచి ఈ నిబంధనలు అమలు చేస్తామని చెప్పారు.

* సినీ నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) పొలిటికల్‌ ఎంట్రీ అంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ఆయన జనసేనలో చేరబోతున్నారంటూ ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు వైరల్‌ అయ్యాయి. సోమవారం ఆళ్లగడ్డ వచ్చిన ఆయన దీనిపై స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతానికి ఏమీ మాట్లాడలేనని అన్నారు.

* పోక్సో చట్టం కింద తనపై పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని వైకాపా (YSRCP) నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్‌లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పిటిషనర్‌కు హైకోర్టు స్పష్టం చేసింది.

* ‘లాపతా లేడీస్‌’ (Laapataa Ladies) ఆస్కార్‌ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ గురించి బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) స్పందించారు. మహాభారతం తన కలల ప్రాజెక్ట్‌ అన్నారు. ఆ సినిమా విషయంలో తనపై ఎన్నో బరువు బాధ్యతలు ఉన్నాయని తెలిపారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఆ సినిమా తెరకెక్కించాలనుకుంటున్నానని చెప్పారు. ‘‘నా డ్రీమ్ ప్రాజెక్ట్‌ విషయంలో బాధ్యతతోపాటు భయం కూడా ఉంది. ఎలాంటి తప్పు లేకుండా భారీ స్థాయిలో దీనిని రూపొందించాలనుకుంటున్నా. భారతీయులుగా ఈ కథ మన రక్తంలో ఉంది. కాబట్టి, ఇది నాపై ఎంతో బాధ్యత పెంచింది. అందుకే దీనిని సరైన పద్ధతిలో సక్రమంగా తీర్చిదిద్దాలనుకుంటున్నా. ఈ ప్రాజెక్ట్‌తో భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలని అనుకుంటున్నా. ప్రతి భారతీయుడు గర్వపడేలా చేయాలనుకుంటున్నా. ఇది జరుగుతుందో? లేదో? తెలియదు. కానీ నేను మాత్రం దీని కోసం వర్క్ చేయాలనుకుంటున్నా’’ అని ఆమిర్‌ ఖాన్‌ చెప్పారు. సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి.

* జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. మంగళవారం(డిసెంబర్‌17) లోక్‌సభలో వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభలోని తమ పార్టీ ఎంపీలందరికి బీజేపీ విప్‌ జారీ చేసింది. జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ(129వ సవరణ) బిల్లు–2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లు–2024ను లోక్‌సభలో సోమవారమే ప్రవేశపెట్టాలని తొలుత నిర్ణయించారు. ఈ మేరకు లోక్‌సభ బిజినెస్‌ జాబితాలో సైతం వీటిని చేర్చారు. కానీ, తర్వాత బిజినెస్‌ నుంచి తొలగించారు. ఇప్పటికే జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. దీంతో బిల్లును పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రవేశపెట్టేందుకు లైన్‌ క్లియరైంది. దీంతో బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టగానే చర్చ కోసం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి రిఫర్‌ చేయాల్సిందిగా విపక్షాలు పట్టుపట్టే అవకాశం ఉంది. దీంతో స్పీకర్‌ జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. జమిలి ఎన్నికల బిల్లు గనుక పార్లమెంట్‌ ఉభయసభల్లో ఆమోదం పొందితే లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. దీనికి ఉభయసభల్లోని మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర క్యాబినెట్‌ గతంలోనే ఆమోదించిన విషయం తెలిసిందే.

* ప్రపంచంలోని కుబేరుల జాబితాలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తి, అమెజాన్ ఫౌండర్ ‘జెఫ్ బెజోస్’ గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే 241 బిలియన్ డాలర్ల సంపదకు నాయకుడైన ఈయన జీతం ఎంత ఉంటుందనేది బహుశా ఎవ్వరికీ తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం. జెఫ్ బెజోస్ సంపద భారీగా ఉన్నప్పటికీ.. కంపెనీలో అతని వార్షిక వేతనం 80000 డాలర్లు (సుమారు రూ.67 లక్షలు) మాత్రమే అని సమాచారం. 1998 నుంచి కూడా అతని బేసిక్ శాలరీలో ఎలాంటి మార్పు లేదని తెలిసింది. నేను సంస్థ వ్యవస్థాపకుడిని, కాబట్టి ఇప్పటికే కంపెనీలో పెద్ద వాటా కలిగి ఉన్నాను. ఇలాంటి సమయంలో ఎక్కువ జీతం తీసుకోవడం ఏ మాత్రం సమంజసం కాదని నిర్ణయించుకున్నాను, అందుకే తక్కువ జీతం తీసుకుంటున్నా అని బెజోస్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

* నానాటికీ పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీన్నొక పాన్‌ ఇండియా సమస్యగా అభివర్ణిస్తూ.. సోమవారం కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ మాత్రమే కాదు.. దేశంలో ఏయే నగరాల్లో అత్యధిక కాలుష్యం నమోదు అవుతుందో ఓ జాబితా అందించాలని ఆ ఆదేశాల్లో కేంద్రానికి స్పష్టం చేసింది. ‘‘వాయుకాలుష్యం ఏయే నగరాల్లో తీవ్రంగా ఉందో ఓ జాబితా ఇవ్వండి. ఇది ముమ్మాటికీ పాన్‌ ఇండియా సమస్యే. కేవలం ఢిల్లీకి మాత్రమే మేం ఈ అంశాన్ని పరిమితం చేయాలని అనుకోవడం లేదు. అలా గనుక విచారణ జరిపితే జనాల్లోకి తప్పుడు సంకేతం వెళ్తుంది. అందుకే ఈ ఆదేశాలిస్తున్నాం’’ అని ఢిల్లీ కాలుష్యంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ జరుపుతున్న జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఒకా, జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది.

* రాచకొండ పరిధిలో (Hyderabad) భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. రూ.1.25 కోట్ల విలువైన 53.5 కిలోల పాపిస్ట్రా డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని (Crime News) అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు వాటిని తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను మీర్‌పేట, ఎల్బీనగర్‌ పోలీసులు పట్టుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z