తెలుగు భాషా సంస్కృతుల పరివ్యాప్తికి అంతర్జాతీయ స్థాయిలో విశేష కృషి చేస్తున్న కాలిఫోర్నియాకు చెందిన సిలికానాంధ్ర సంస్థ మరో అంతరించిపోతున్న కళకు పునరుజ్జీవం పోసే ప్రణాళిక రచించింది. నాటక రచనపై జనవరి 31 నుండి ప్రతి శుక్రవారం 90నిముషాల పాటు శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఏపీ ప్రభుత్వం నుండి ఉత్తమ నాటకం కింద 7 సార్లు నంది పురస్కారం అందుకున్న ప్రముఖ నాటక రచయిత దీర్ఘాసి విజయ్‌భాస్కర్ ఈ శిబిరంలో ఆసక్తి కలిగిన వారికి నాటక రచనలోని కీలకాంశాలను వివరిస్తారని ఒక ప్రకటనలో సిలికానాంధ్ర తెలిపింది.
మరిన్ని వివరాలకు – https://uofsa.edu/play-writing/
విజయ్‌భాస్కర్ గురించి – https://vizaibhaskar.com/
More Info About Deerghasi VizaiBhaskar – https://www.tnilive.com/2024/01/07/the-masterful-playwright-dr-deerghasi-vizaibhaskar/
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z