చికాగో ఆంధ్ర సంఘం(CAA) ఆధ్వర్యంలో “తెలుగు వైభవం” సాహితీ కార్యక్రమాన్ని నేపర్విల్ మాల్ ఆఫ్ ఇండియాలో నిర్వహించారు. పెద్దలు, పిల్లల క్యాటగిరీలలో వివిధ తెలుగు వినోదాత్మక పోటీలను – తెలుగు మాటల పోటీలు, చిరు నాటిక, బంధుత్వాల వివరణ, ప్రకృతి-వికృతులు, ఉక్తలేఖనం, వ్యాస రచన, పద్యం/డైలాగు పఠనం వంటి పోటీలను నిర్వహించారు. అన్విత పంచాగ్నుల “మా తెలుగు తల్లికి” ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోటీలకు సుజాత అప్పలనేని, పద్మారావు అప్పలనేని, మణి తెల్లాప్రగడ, మాలతి దామరాజు, లక్ష్మీ నాగ్ సూరిభొట్ల, యశోద వేదుల న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
సంస్థ 2024 అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి, చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు, ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి, అన్విత పంచాగ్నుల, తమిశ్ర కొంచాడ, శ్రీస్మిత నండూర, లక్ష్మీ దామరాజు గారు, వనజ ఓబి, సీరందాసు రామారావు, గీత రచయిత రాజా పెద్దప్రోలు, సంస్థ ట్రస్టీలు శ్రీనివాస్ పెదమల్లు, సుజాత-పద్మారావు అప్పలనేని, పూర్వ అధ్యక్షులు గౌరీశంకర్ అద్దంకి, శ్రీశైలేష్ మద్ది, లక్ష్మీనాగ్ సూరిభొట్ల, శ్రీనివాస్ సుబుద్ధి, శ్రియ కొంచాడ, ప్రియ మతుకుమల్లి, బోస్ కొత్తపల్లి , కిరణ్ వంకాలపాటి, బోర్డు సభ్యులు మురళీ రెడ్డివారి, హేమంత్ తలపనేని, నరసింహరావు వీరపనేని, ప్రభాకర్ మల్లంపల్లి, శ్రీనివాస్ పద్యాలలు ఈ పోటీల్లో పాల్గొని తమ సహకారాన్ని అందించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z