ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) లాస్ ఎంజిల్స్ విభాగం ఆధ్వర్యంలో బాలల సంబరాలు ఆదివారం నాడు ఘనంగా నిర్వహైంచారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు, హాస్య నాటికలు, ఫాన్సీ డ్రెస్ ప్రదర్శన, ఫ్యాషన్ షో, గణితం, చదరంగ పోటీలు ఏర్పాటు చేశారు. 300 మందికి పైగా చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. సంబరాలు కన్నులపండువగా సాగాయి. గురు కృష్ణ కొంకా, రావిలిశెట్టి వెంకటనరసింహారావుల సామాజిక సేవలను గుర్తించి కమ్యూనిటీ సర్వీస్ అవార్డును అందజేశారు.
కార్యక్రమంలో బోర్డ్ సభ్యులు రవి ఆలపాటి, బోర్డ్ డైరెక్టర్ మధు బోడపాటి, నాట్స్ కార్యక్రమాల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ చిలుకూరి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ కృష్ణ కిషోర్ మల్లిన, నాట్స్ నేషనల్ కో ఆర్డినేటర్స్ కిషోర్ గరికపాటి, రాజలక్ష్మి చిలుకూరి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహార్, మెంటర్స్ హరి కొంక, వెంకట్ ఆలపాటిలు పాల్గొన్నారు. లాస్ ఏంజిల్స్ చాప్టర్ కోఆర్డినేటర్ మురళి ముద్దన, జాయింట్ కోఆర్డినేటర్ బిందు కామిశెట్టి, నాట్స్ టీం సభ్యులు గురు కొంక, శ్రీనివాస్ మునగాల, సిద్ధార్థ కోలా, అరుణ బోయినేని, శంకర్ సింగంశెట్టి, శ్రీపాల్ రెడ్డి, చంద్ర మోహన్ కుంటుమళ్ల, ముకుంద్ పరుచూరి, సరోజ అల్లూరి, పద్మ గుడ్ల, రేఖ బండారి, లత మునగాల, నరసింహారావు రవిలిశెట్టి, సుధీర్ కోట, శ్యామల చెరువు, మాలతి, నాగ జ్యోతి ముద్దన, హారిక కొల్లా, అనూష సిల్లా, హర్షవర్ధన్ రెడ్డిచెర్ల, ప్రణవ్ ఆలపాటి, చంద్రర్క్ ముద్దనలు సహకరించారు. రామ్ కడియాల భోజనాన్ని అందజేశారు. లాస్ ఏంజిల్స్‌లో బాలల సంబరాలను దిగ్విజయం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటిలు ధన్యవాదాలు తెలిపారు.
Register for NATS 8th America Telugu Sambaralu – https://sambaralu.org/
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z