ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ‘నెల నెలా తెలుగు వెన్నెల’ 209వ సాహిత్య సదస్సు ఘనంగా జరిగింది. ‘జగము నేలిన తెలుగు’ అంశంపై డిసెంబర్ 15న డాలస్‌లో నిర్వహించిన ఈ సదస్సు అలరించింది. టాంటెక్స్ పూర్వ అధ్యక్షుడు దివంగత లావు రామకృష్ణకు నివాళి అర్పించారు. ముఖ్య అతిథిగా సీనియర్ పాత్రికేయులు డీపీ అనురాధ పాల్గొని దాదాపు 2వేల ఏళ్ల నుంచి నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మాట్లాడుతున్న తెలుగు ప్రజల మూలాల్ని అన్వేషిస్తూ పరిశోధక దృష్టితో అనేక దేశాల్లో పర్యటించినట్లు చెప్పారు. ఆగ్నేయాసియా దేశాల్లో స్థిరపడిన తెలుగుజాతి ప్రజల్ని కలుసుకొని వారి పుట్టుపూర్వోత్తరాలు, భాషాభిమానం అనుభవపూర్వకంగా తెలుసున్నానన్నారు. ఆదిమ తెలుగు జాతి ప్రాచీన ప్రాభవం నేటికీ ఎలా గుబాళిస్తుందో తనదైన శైలిలో వివరించారు. టాంటెక్స్ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z