NRI-NRT

వాషింగ్టన్ తెలుగు సమితి (WATS) అధ్యక్షుడిగా రాజేశ్ గూడవల్లి

వాషింగ్టన్ తెలుగు సమితి (WATS) అధ్యక్షుడిగా రాజేశ్ గూడవల్లి

వాషింగ్టన్ తెలుగు సమితి (వాట్శ్) అధ్యక్షుడిగా రాజేశ్ గూడవల్లి బాధ్యతలు చేపట్టారు. 2025-26 కాలానికి ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. బోర్డు సభ్యులు మధు రెడ్డి, ప్రకాష్ కొండూరు, రామ్ తమ్మినేని, హరిని దేశరాజు, శివ వేదురుపాటి, శ్రీరామ్ పాటిబండ్లలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పూర్వాధ్యక్షులు శ్రీనివాస్ అబ్బూరి, వంశీ రెడ్డి, జయపాల్ రెడ్డి దొడ్డ, హరి ఎక్కాలి, భాస్కర్ గంగిపాముల, రామ్ పలురి, షకీల్ పొగకు, రామ్ కొట్టి తదితరులు పాల్గొన్నారు.

తనకు సహకరించిన వారందరికీ రాజేష్ ధన్యవాదాలు తెలిపారు. సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. యువతీ యువకుల కోసం కొత్త బోర్డు, వాషింగ్టన్ రాష్ట్రంలో తెలుగు సాంస్కృతిక దినోత్సవ నిర్వహణ, నిధుల సేకరణ వంటివాటిపై దృష్టి సారిస్తానని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z