NRI-NRT

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ 100వ వార్షికోత్సవంలో అతిరుద్ర మహాయాగం

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ 100వ వార్షికోత్సవంలో అతిరుద్ర మహాయాగం

వందేండ్ల క్రితం ప్రారంభమైన సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ () శతాబ్దిక (1924-2024) వార్షికోత్సవము సందర్భముగా అతిరుద్ర మహాయాగము నిర్వహించారు. 21 నుండి 6 రోజుల పాటు పిజిపి హాల్, పెరుమాళ్ దేవాలయ ప్రాంగణములో ఈ వేడుక నిర్వహించారు.

సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన మహాదేవ, శివ, రుద్ర, శంకర, నీల లోహిత, ఈశాన, విజయ, భీమ, దేవ దేవ, భవోద్భవ, ఆదిత్యమఖ ఏకాదశ(11) కలశ రుద్రఘన మండపముల వద్ద 121 ఋత్విక్కులు ఒకేసారి రెండు ఏకాదశ రుద్రములు పారాయణ చేస్తూ ఉండగా మరో 11 మంది ఋత్విక్కులు రుద్ర హావనము చేస్తూ ఐదు రోజుల పాటు ప్రతి రోజు 2662 రుద్రముల పారాయణ చేసి మహా పూర్ణాహుతి అయిన 6వ రోజు 1331 రుద్రమల పారాయణతో 16,896 రుద్రములను జపించారు. అనంతరం ఏకాదశ కలశ మండపములవద్ద రుద్రముతో అభిమంత్రించిన 121 కలశాలతో పూర్ణాంబికా సమేత శ్రీ ఆనందేశ్వర మహా స్వామికి అభిషేకము, రుద్రార్చన నిర్వహించారు. SDBBS నిర్వహణ కమిటీలో L కార్తికేయన్, డాక్టర్ I స్వామినాథన్, N ఆనంద్ చంద్రశేఖర్, బాలాజీ, రామస్వామి, గణేష్ రాధాకృష్ణన్, ఈశ్వర్ శ్రీనివాసన్, రాజా రామన్, ఎస్ కృష్ణన్, కె సాయిరామ్, కె రామ ప్రసాద్, వేణు మాధవ్ మల్లవరపు తదితరులు ఉన్నారు.

దక్షిణ భారత రాష్ట్రాల నుండి 22 మంది పండితులు ఈ క్రతువులో పాల్గొన్నారు. చల్లా శ్రీ ప్రదాయ, చల్లా శ్రీకాంత్, అనంత్ బొమ్మకంటి, ధర్మారావు అక్కిపెద్ది, గంటి చంద్రశేఖర్, వాడాలి ప్రసాద్, బాలాజీ గరిమెళ్ళ, రాఘవేంద్ర దేవరకొండ, గిరి పిండిప్రోలు, వాసు జనపాటి, కృష్ణ అయ్యగారి, గోవర్ధన్, జగన్, ఫణీన్ద్ర, రమేష్ నేమాని, సుబ్రమణ్యం, గణపతి శాస్త్రి ఆకెళ్ళ, రామ సంతోష్ శ్రీకర్ ఆకెళ్ళ, కామేశ్వర రావు భమిడిపాటి, వెంకట రమణ పమిడిఘంటం, వంశీకృష్ణ శిష్ట్లా, రత్నకుమార్ కవుటూరు తదితరులు పాల్గొన్నారు. కంచి మఠం పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆశీర్వదించి పంపించిన ప్రసాదాన్ని నిర్వహణ కమిటీ సభ్యులు స్వీకరించారు. 6 రోజుల కార్యక్రమంలో 3వ రోజు భారీ వర్షం కురిసింది. వివరాలకు వెబ్‌సైట్: https://www.sdbbs.org చూడవచ్చు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z