* ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. టెక్నాలజీ ఆపరేటెడ్, ఆంకాలజీ సేవలు అందించే హెల్త్‌కేర్ ప్లాట్‌ఫాం కర్కినోస్‌ను రూ.375 కోట్లకు కొనుగోలు చేసినట్లు శనివారం తెలిపింది. రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ అవసరమైన షేర్ల కేటాయింపుతో కర్కినోస్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలును పూర్తి చేసిందని రిలయన్స్ సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. కర్కినోస్ క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం/నిర్ధారించడం వంటి సాంకేతికతతో నడిచే వినూత్న పరిష్కారాలను అందించే సంస్థగా పేరు గాంచింది.
* ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన శ్రామిక శక్తిని తగ్గించి, బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపరిచేందుకు సిద్ధమవుతోంది. దీనికోసం మరోసారి స్వచ్ఛంద పదవీవిరమణ పథకం (VRS) అమలుచేయాలని యోచిస్తోంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదాన్ని కోరే యోచనలో ఉన్నట్లు సమాచారం. తద్వారా 35 శాతం శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని చూస్తోందని ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపరిచేందుకు వీఆర్‌ఎస్ (VRS) ద్వారా టెల్కోలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని డాట్‌కు బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు ప్రతిపాదన పంపినట్లు సమాచారం. ఇందుకోసం వీఆర్‌ఎస్ అమలుకు ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి రూ.15 వేల కోట్లను డాట్ కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టెలికాం సంస్థకు వచ్చే ఆదాయంలో రూ.7,500 కోట్లు అంటే దాదాపు 38 శాతం ఉద్యోగుల జీతాల కోసం కేటాయిస్తోంది. ఈ వ్యయాన్ని రూ.5,000 కోట్లకు తగ్గించాలని కంపెనీ యోచిస్తోంది. ఆర్థిక మంత్రిత్వశాఖతో పాటు కేబినెట్ ఆమోదం అనంతరం వీఆర్‌ఎస్ ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL)వేలాది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కొత్త స్వచ్ఛంద పదవీ విరమణ ప్రణాళిక.. వీఆర్‌ఎస్ 2.0ని (VRS 2.o) ప్రతిపాదించింది. సంస్థ ఆర్థిక సమతుల్యతను మెరుగుపరుచుకోవడానికి ఉద్యోగుల తగ్గింపును (Layoff) ప్రకటించింది. బీఎస్‌ఎన్‌ఎల్ తొలగింపులు దాదాపు 18,000 నుండి 19,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతాయని తెలుస్తోంది.
* రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) ప్రఖ్యాత అండర్‌గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లు (scholarship) 2024-25 బ్యాచ్‌కు సంబంధించిన ఫలితాలను తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు లక్ష మంది ఈ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోగా 5,000 మంది ప్రతిభావంతులైన అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులను రిలయన్స్ ఫౌండేషన్ ఎంపిక చేసింది. విద్యలో నాణ్యత, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించి యువత భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రిలయన్స్ ఫౌండేషన్ పదేళ్లలో 50,000 స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు స్కాలర్‌షిప్ కార్యక్రమంగా గుర్తింపు పొందింది. విద్యను సమాన అవకాశాలను అందించేందుకు మార్గంగా మార్చేందుకు రిలయన్స్ ఫౌండేషన్ నిబద్ధతను ఈ ప్రోగ్రామ్ నొక్కిచెబుతోంది. రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల (Telugu states) విద్యార్ధులు తమ ప్రతిభతో 2024-25 బ్యాచ్‌లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. 850 మంది విద్యార్థులతో ఆంధ్రప్రదేశ్ దేశంలో 1వ స్థానంలో నిలవగా, 411 మంది విద్యార్థులతో తెలంగాణ 4వ స్థానం సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం 1,261 మంది అభ్యర్ధులు (25.22%) స్కాలర్‌షిప్ సాధించారు.
* నేటి రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉంది. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులకు కచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. బ్యాంక్ ఖాతాదారులకు సాధారణంగా ఏటీఎం (ATM) కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తోపాటు మరిన్ని సౌకర్యాలు ఉంటాయి. అయితే గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది ప్రజలు పోస్టాఫీసులో (Post Office) పొదుపు ఖాతాలను తెరవడానికి ఇష్టపడతారు. పోస్టాఫీసులు అందుబాటులో ఉండటంతోపాటు అందులో సరళమైన విధానాలే ఇందుకు కారణం. బ్యాంకు ఖాతాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో దాదాపు అన్ని ప్రయోజనాలు పోస్టాఫీసులో పొదుపు ఖాతాను (Savings Account) తెరవడం వల్ల కూడా పొందవచ్చు. పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను ఎవరు తెరవగలరు.. ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయన్నది ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z