NRI-NRT

DFW-HYD విమానం కల నెరవేరుతుంది

DFW-HYD విమానం కల నెరవేరుతుంది

ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి దుబాయ్, మస్కట్, బహ్రెయిన్, దోహా, షార్జా, జెడ్డా, అబుదాబి, రియాద్, సింగపూర్, బ్యాంకాక్, మలేసియా, బ్రిటన్, జర్మనీ, శ్రీలంక, మాల్దీవులు, ఒమన్, ఖతార్, సౌదీ తదితరాలకు నేరుగా విమానాలు నడుస్తున్నాయి. గతంలో షికాగోకు విమాన సర్వీసులను నడిపారు. కోవిడ్‌ కారణంగా నిలిచిపోయాయి. త్వరలో షికాగోతోపాటు డాలస్, శాన్‌ఫ్రాన్సిస్కో నగరాలకు కూడా హైదరాబాద్‌ నుంచి కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి రోజూ సుమారు 55000 మంది దేశీయ, మరో 15000 మందికి పైగా అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఒక్క నవంబర్‌ నెలలోనే 40,179 మంది హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి విదేశీయానం చేశారు. 2467 అంతర్జాతీయ సర్వీసులు నడిచాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z