ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో ప్రతి నెల తెలుగు లలిత కళా వేదిక ద్వారా అంతర్జాల సదస్సులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే “భావ వైవిధ్యం.. అన్నమయ్య సంకీర్తనం”పై వెబినార్ నిర్వహించింది. ప్రముఖ ఆధ్యాత్మిక గాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులు పారుపల్లి శ్రీ రంగనాథ్ ఈ వెబినార్‌కు విచ్చేశారు.
గోవింద నామాలు పాడే అవకాశం ఎలా వచ్చింది.? తిరుమల దేవస్థానం ఆస్థాన గాయకుడిగా ఎలా స్థానం లభించింది ఇలాంటి అంశాలను శ్రీ రంగనాథ్ వివరించారు. గోవింద నామాలు పాడి వినిపించారు. ఆ తిరుమలేశుడికి అత్యంత ఇష్టమైన అన్నమయ్య సంకీర్తనలు పాడటంతో పాటు వాటి అర్థాలను కూడా ఆయన వివరించారు.
రంగనాథ్‌కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, నాట్స్ మాజీ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతిలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి నాట్స్ కార్యనిర్వాహక కార్యదర్శి( మీడియా) మురళీకృష్ణ మేడిచెర్ల అనుసంధానకర్తగా వ్యవహరించారు. లలిత కళా వేదిక సభ్యుడు గిరి కంభమ్మెట్టు, నేషనల్ కోఆర్డినేటర్ (విమెన్ ఎంపవర్మెంట్) రాజలక్ష్మి చిలుకూరి, నేషనల్ కోఆర్డినేటర్ (మార్కెటింగ్) కిరణ్ మందాడి సహకరించారు. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటిలు కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు.
Register for 8th NATS Sambaralu – https://sambaralu.org/
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z