* భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారాలను(Khel Ratna Award) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 ఏడాదికి గాను నలుగురు క్రీడాకారులను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలకు ఎంపిక చేసింది. చెస్ విభాగంలో డి.గుకేశ్(Gukesh Dommaraju), హాకీ విభాగంలో హర్మన్‌ప్రీత్ సింగ్(Harmanpreet Singh), పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్(Praveen Kumar), షూటింగ్ విభాగంలో మను బాకర్(Manu Bhaker)ను ఈ అవార్డులు వరించాయి. అలాగే, 32మందికి అర్జున, ఐదుగురికి ద్రోణాచార్య పురస్కారాలకు ఎంపిక చేశారు. అర్జున పురస్కారాలు దక్కించుకున్నవారిలో 17మంది పారా అథ్లెట్స్ ఉండటం విశేషం. జనవరి 17న ఉదయం 11గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా వీరంతా పురస్కారాలను అందుకుంటారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడామంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
* రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం (AP Cabinet) ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు సీఆర్‌డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న రెండు పనులకు ఆమోదముద్ర వేసింది. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు అంగీకారం తెలిపింది.
* అరుదైన ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కలను తరలిస్తున్న ఇద్దరిని డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 9.8 కిలోల ఇంద్రజాల, 0.286 కిలోల మహేంద్రజాల మొక్కలు, 6 శంఖాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో మొక్కలు సరఫరా చేసిన వ్యక్తిని ఒంగోలులో పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 6.64 కిలోల మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. అంతరించిపోతున్న జాతుల్లో ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
* ఉచితాల కోసం ప్రభుత్వంపై ఆధారపడొద్దని.. సొంతంగానే సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవాలని కేంద్ర పునరుత్పాదక విద్యుత్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి (Prahlad Joshi) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మంగళూరులో సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పర్యావరణానికి హాని కలిగించే శిలాజ ఇంధనాలను ఉపయోగించి ఉత్పత్తి చేసే ఉచిత విద్యుత్ పంపిణీ వెనుక ఉద్దేశాలపై తాను వ్యాఖ్యానించబోనన్నారు. అయితే, విద్యుత్ రంగంలో సుస్థిరతే దేశానికి సురక్షిత భవిష్యత్తుకు కీలకం కానుందని అభిప్రాయపడ్డారు.
* జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నలుగురికి భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, 32 అర్జున అవార్డులు, 5 ద్రోణాచార్య అవార్డులను కేంద్రం ప్రకటించింది. అర్జున పురస్కారాలు దక్కించుకున్నవారిలో 17మంది పారా అథ్లెట్స్ ఉండటం విశేషం. అర్జున అవార్డులు అందుకున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఉన్నారు. విశాఖకు చెందిన రన్నర్ జ్యోతి యర్రాజీ, వరంగల్ జిల్లాకు చెందిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తి ఎంపికయ్యారు.
* రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా? అని వ్యాఖ్యానించింది. ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పిటిషనర్‌కు పూర్వ నేర చరిత్ర ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అనుచిత పోస్టుల వ్యవహారంలో నమోదైన 2 కేసుల్లో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలైందని చెప్పారు.
* ఖలిస్థానీ వేర్పాటు వాది, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) త్వరలో కొత్తగా రాజకీయా పార్టీని (new political party) ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జనవరి 14న కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
* జనవరి 14 నుంచి 45 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ప్ర్యతేక రైళ్లను నడుపుతోన్న రైల్వే శాఖ.. తాజాగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారి కోసం అదనంగా మరో 26 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఏపీలోని గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ టౌన్; తెలంగాణలోని మౌలాలి జంక్షన్, వికారాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు వెళ్లనున్నాయి. భక్తుల అవసరాలు, భద్రత కోసం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో 45 కోట్లమంది భక్తులు పాల్గొని గంగాస్నానం ఆచరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
* విశాఖ కేంద్ర కారాగారంలో ఖైదీలను కుక్కేస్తుండటంతో కోళ్లఫారంను తలపిస్తోంది. సామర్థ్యానికి మించి రెట్టింపు ఖైదీలను ఇక్కడ ఉంచడంతో పర్యవేక్షణ, వసతుల కల్పన అధికారులకు సవాలుగా మారింది. తాజాగా ఇక్కడి నుంచి 200 మంది ఖైదీలను రాజమహేంద్రవరం జైలుకు తాత్కాలికంగా తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇరుకు గదిలో ఇబ్బందులు పడుతున్నారంటూ ఓ ఖైదీ బంధువులు ఇటీవల విశాఖ కారాగారం ఎదుట నిరసన చేపట్టినట్లు సమాచారం.
* కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రధాన అనుచరుడు మెరుగుమాల కాళీని అరెస్టు చేసిన పోలీసులు ఆయనను కోర్టుకు తరలించగా బుధవారం ఏజేఎఫ్‌సీఎం న్యాయమూర్తి పి.గాయత్రి 10 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నెల్లూరులోని కేంద్ర కారాగారానికి తరలించారు. కృష్ణాజిల్లా గుడివాడలో రంగా వర్ధంతి నిర్వహించొద్దని బెదిరించిన మెరుగుమాల కాళీ.. 2022 డిసెంబరు 25 రాత్రి తన అనుచరులతో కలిసి గుడివాడ తెదేపా కార్యాలయంతో పాటు పార్టీ నేత రావి వెంకటేశ్వరరావుపై పెట్రోల్ ప్యాకెట్లు, కత్తులు, రాడ్లతో దాడి చేశాడు. వైకాపా హయాంలో ఫిర్యాదుచేసినా కేసు పెట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక కాళీ, అతని అనుచరులపై హత్యాయత్నం కేసులు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో వన్‌టౌన్ పోలీసులు ఇప్పటికి 13 మంది నిందితులను అరెస్టు చేశారు.
* మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ కళాశాల హాస్టల్ వద్ద పోలీసుల విచారణ జరుగుతోంది. అమ్మాయిలు హాస్టల్ బాత్‌రూమ్‌లో ఉన్నప్పుడు వీడియోలు తీస్తున్నారన్న ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు.. అనుమానితులైన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థినుల బాత్‌రూం పక్కనే పనివాళ్ల గది ఉండటం అనుమానాలకు తావిస్తోందని పోలీసులు చెబుతున్నారు.
* కిరాణా దుకాణంలో పనిచేస్తున్న అశోక్ కుటుంబానికి ఆ సమయంలో రాజకీయ నేతలు ఎన్నో హామీలు ఇచ్చారు. ఆస్థా (Aastha Arora)కు ఉచిత విద్య అందిస్తామనడం అందులో ఒకటి. ‘‘మేము ఏదీ అడగలేదు. మీకు ఇవ్వాలని ఉద్దేశం లేనప్పుడు వాగ్దానాలు చేయడం ఎందుకు? మాకు యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) నుంచి మాత్రం రూ.రెండు లక్షలు అందాయి. ఆ డబ్బే తర్వాత ఆమె చదువుకు కొంతమేర ఉపయోగపడింది. కొన్నేళ్ల క్రితం ఆస్థాకు ఆరోగ్య సమస్య తలెత్తింది. తను పుట్టిన సఫ్దర్‌గంజ్ ఆసుపత్రికే తీసుకెళ్లాం. కానీ ఎలాంటి రాయితీ ఇవ్వలేదు’’ అని వెల్లడించారు. ఆయన భార్య బ్యూటీ పార్లర్‌లో పనిచేయగా.. ఆస్థా, ఆమె సోదరుడు మయాంక్‌ను వారి సంపాదనతోనే చదివించుకున్నారు. రాజకీయ నేతలు ఇచ్చిన హామీలతో తన బిడ్డకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మురిసిపోయిన ఆ తల్లికి నిరాశే ఎదురైంది. చిన్నప్పుడు చిన్నపాటి సెలబ్రిటీ హోదా రుచిచూసిన ఆస్థా (Aastha Arora)కు ఎదుగుతున్నకొద్దీ తన ఆర్థిక పరిస్థితి ఏంటో అర్థమైంది. డబ్బులు ఖర్చు పెట్టి ఇద్దరు పిల్లలను చదివించే స్థోమత ఆ కుటుంబానికి లేకపోవడంతో పది తర్వాత ఆస్థాను వాళ్ల నాన్న ప్రభుత్వ కళాశాలకు పంపారు. ఆర్థిక పరిస్థితి కారణంగా డాక్టర్ కావాల్సిన ఆ అమ్మాయి నర్స్ అయింది. తన చదువు విషయంలో తొలుత కాస్త చిన్నబుచ్చుకున్నా తన ముందున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. దాని ఫలితంగానే నర్సింగ్ పూర్తిచేసిన ఆమె.. మిలిటరీ నర్సింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించింది. ఇప్పుడు ఆర్మీలో నర్సింగ్ లెఫ్టినెంట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. పిల్లలకు ట్యూషన్లు చెప్తూ, ప్రైవేటు ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తూ తన కలను నెరవేర్చుకుంది. తన సోదరుడు మయాంక్ ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఇప్పుడు తమ సొంతింటి కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక మే 11న తన పుట్టినరోజు నాడు వరుణ్ ధావన్ యాక్షన్ మూవీ చూస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటోంది ఈ బిలియన్త్ బేబీ (billionth baby).
* గుజరాత్‌తోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోంజీ కుంభకోణం (Ponzi scam) సెగ క్రికెటర్లనూ తాకింది. బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామని ప్రజలను మోసం చేసి రూ.6 వేల కోట్లను సేకరించిన బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్ర సింగ్ ఝలాను ఇప్పటికే గుజరాత్ సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill)తోపాటు సాయి సుదర్శన్, రాహుల్ తెవాతియా, మోహిత్ శర్మ వంటి పలువురు ఇందులో పెట్టుబడి పెట్టినట్లు తాజాగా బయటకొచ్చింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z