NRI-NRT

డల్లాస్‌లో “డాకు మహరాజ్” హంగామా

డల్లాస్‌లో “డాకు మహరాజ్” హంగామా

‘డాకు మహారాజ్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొనేందుకు డల్లాస్‌ చేరుకున్న హీరో నందమూరి బాలకృష్ణకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. డల్లాస్‌ వేదికగా జరిగే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌, ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో బాలకృష్ణ సందడి చేయనున్నారు.

‘డాకు మహారాజ్‌’గా సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా ఈ చిత్రాన్ని బాబీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్‌ కథానాయికలు. ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే జనవరి 4న అమెరికాలోని డల్లాస్‌ వేదికగా ఈ చిత్ర వేడుక నిర్వహిస్తున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ‘డాకు మహారాజ్‌’ రూపొందించారు. ఈ సినిమాకి సంబంధించిన వేడుకలు ఈనెల 7న హైదరాబాద్‌లో, 9న ఏపీలో నిర్వహించనున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z