మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ధన వృద్ధికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. కుటుంబ ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు మారడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి పనిఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే సూచనలున్నాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరానికి తగ్గట్టుగా చేతిలో డబ్బు ఉంటుంది. ఆస్తి క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. కొద్దిగా శ్రమ, ఒత్తిడి తప్పకపోవచ్చు. వృత్తి జీవితంలో ఉన్న వారికి రాబడి బాగుంటుంది. వ్యాపారంలో కొద్దిగా లాభాలు కనిపిస్తాయి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనులు శ్రమతో పూర్తవుతాయి. కొద్దిగా అనారోగ్యం పీడించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టవచ్చు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాలలో లాభాలు ఆశించిన దాని కంటే బాగా పెరిగే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ప్రయాణాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ జీవితంలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడ తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవు తాయి. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. నిరుద్యోగులకు ఆశించిన కబురు అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, వ్యాపారాలలో సమస్యలు, ఒత్తిళ్లు కొద్దిగా తగ్గుతాయి. ఉద్యోగంలో అధికారులు, సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరం. తలపెట్టిన ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. కొందరు బంధువులతో అపార్థాలు, విభేదాలు తలెత్తే సూచనలున్నాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాలలో ప్రోత్సాహకాలకు, పదోన్నతులకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఆదాయ వృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో కొందరు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యం ఇస్తారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు, అపార్థాలు పరి ష్కారమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థిక వ్యవహారాలను సకాలంలో చక్కబెట్టి, లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఒడిదుడుకులు బాగా తగ్గుతాయి. ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంది. బంధువుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
రాజీ మార్గంలో ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు పెంచడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగంలో ఆశించిన ఆదరణ లభి స్తుంది. పదోన్నతి లభించే అవకాశం కూడా ఉంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకు తుంది. వృత్తి జీవితం ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వ్యాపారుల్లో లాభాలు పెరు గుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహ రించడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సకాలంలో పూర్తయి ఊరట కలుగుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆదాయపరంగా చాలావరకు అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో అదికారం చేపట్టే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. ధనపరంగా వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ఆరోగ్యంల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు లాభసా టిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అను కోకుండా పరిష్కారం అవుతుంది. చాలా కాలంగా పూర్తి కాని పనుల్ని కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం వరిస్తుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే అవ కాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఆదాయం బాగా పెరిగినప్పటికీ అను కోని ఖర్చుల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z