సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) ఆధ్వర్యంలో శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే మొదటి కార్యక్రమము)ని ఆదివారం నాడు ఘనంగా నిర్వహించి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, సంప్రదాయ భజనలు, ప్రత్యేక పాయసం నైవేద్యం సమర్పించారు. భక్తులకు అన్నదానం చేశారు. గణపతి, పూర్వాంగ పూజ, అయ్యప్ప స్వామి ఆవాహనంతో ప్రారంభమైన కార్యక్రమం, పూర్ణాంబికా సమేత శ్రీ ఆనందేశ్వరర్‌కు లఘున్యాసం, రుద్రాభిషేకం, రుద్రగణ పారాయణం, అయ్యప్ప స్వామికి సహస్రనామం, అష్టోత్ర అర్చన, భజనలు చేశారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత విజయా మోహన్ వేసిన రంగవల్లి ఆకట్టుకుంది. రాంకుమార్ బృందం నామసంకీర్తన భజన, కోలాట నాట్య ప్రదర్శన అలరించాయి. శంకర్ తాళాల(కంజీర), రత్నం గణేష్, విజయ్ కుమార్, కణ్ణన్, స్వచ్చంద కార్యకర్తలు సురేష్ శ్రీనివాసన్, వి జయరామన్, శ్రీరామ్, ఎంవి సీతారామన్, నారాయణన్ కె జె, శివకుమార్ వెంకటసుబ్రమణియన్, శ్రీకాంత్ సోమసుందరం, సత్యనారాయణన్ గోపాలన్, గణేష్ రామన్, మణికందన్ బాలసుబ్రమణియన్, స్వామినాథన్ రమణి, నారాయణసామి వెంకటసుబ్రమణియన్, గణేష్ కుమార్ వి వి, రమేష్ ముకుంత్, సుజిత్ కుమార్, SDBBS అధ్యక్షులు కార్తీక్, సెక్రటరీ ఆనంద్ చంద్రశేఖర్, కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు మణికండన్, పెరుమాళ్ టెంపుల్, హిందూ ఎండోమెంట్ బోర్డ్, కవిత ఫ్లవర్స్ తదితరులు పాల్గొని సహకరించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z