తానాకు FBI-IRS-DOJల నుండి నోటీసులు అందాయని, అవి టాప్ సీక్రెట్ దస్తావేజులుగా పరిగణించి ఎవరికీ చూపకూడదనే కఠిన నియమ నిబంధనలు ఉన్నాయని, కావున అవి బోర్డు సభ్యులకు కూడా చూపలేమని తానా బోర్డు సమావేశంలో పేర్కొన్న వ్యాఖ్యలు ఫక్తు అబద్ధమని తేలిపోయింది. తానా నాయకత్వానికి ఈ నోటీసుల PDFను ఈమెయిల్ చేశారు. అందులో ఎక్కడా కూడా ఇది టాప్ సీక్రెట్ అని పేర్కొనలేదు. అందుకే కాబోలు, ఈ PDFను బఠాణీల మాదిరి అన్ని వాట్సాప్ గ్రూపుల్లో ప్రవాసులు విచ్చలవిడిగా షేర్ చేస్తున్నారు.
TANA FBI Notices Can Be Seen Here
* అయితే అటు లేకపోతే ఇటు!
ఈ నోటీసుల్లో దర్యాప్తు సంస్థలు అడిగిన సమాచారాన్ని చూస్తే ఎవరికైనా మతి చెదురుతుంది. ఆరేళ్లుగా తానా సభ్యులు, నాయకులు, కార్యక్రమాలు, దాతలు, విరాళాలు, మ్యాచింగ్ గ్రాంట్లు, సభలు, సమావేశాలు, లెక్కలు, దస్త్రాలు, రశీదులు, బోర్డు సమావేశాల సారాంశాలు, ప్రతినిధుల పేర్లు, చిరునామాలు, ఖర్చులు, పద్దుల వివరాలు సర్వం, సకలం, సమస్తం తమకు సమర్పించాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. డిసెంబరు 26న జ్యురీ ఎదుటకు వీటన్నింటినీ తీసుకుని రావాలని కోరినప్పటికీ నోటీసులను దిండు క్రింద మడతపెట్టి దాచుకుని, కాలయాపన చేసిన కారణంగా ప్రస్తుతం తానా డబ్బులను వృథా చేస్తూ లాయర్లతో పొడిగింపుల కోసం వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. గత మూడు రోజులుగా TNI తానాలోని ప్రస్తుత, గత తరం సభ్యులు, నాయకులతో మాట్లడగా వారందరిదీ ఒకటే మాట. ఈ దర్యాప్తుతో అధికారులు సంతృప్తి చెందితే తానా ఇటు ఉంటుంది. లేకపోతే ఇప్పటికే కొన్ని జాతీయ స్థాయి తెలుగు సంఘాలకు పట్టిన గతే తానాకు కూడా పట్టవచ్చుననే అనుమానాలు వెలిబుచ్చారు.
“వన్ మ్యాన్ ఆర్మీ” ప్రదర్శనలు ఇప్పటికైనా మానుకుని సమర్థులైన వారితో ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఈ నోటీసులకు దీటైన సమాధానాలు పంపి సంస్థను కాపాడితేనే సభ్యుల్లో నమ్మకాన్ని ప్రోదిచేయగలిగేది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z