NRI-NRT

మలేషియా ఆంధ్రా సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు

మలేషియా ఆంధ్రా సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఇనుమడింపజేసేలా విదేశాల్లోనూ మన పండుగలను చేసుకోవడం ముదావహమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మలేషియాలో మా అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమైన సంక్రాంతి సంబరాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మానవ సంబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగల గొప్పతనాన్ని చాటుతున్నారని ప్రశంసించారు. 2019లో ప్రారంభించి మలేషియాలోని తెలుగు వారందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చిన అసోసియేషన్ భవిష్యత్తులో మరిన్ని గొప్ప కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. మలేషియాలో తెలుగు వాళ్లందరూ కలిసి చేస్తున్న సంక్రాంతి సంబరాలకు తప్పకుండా హాజరవుతామని డాక్టర్ అమర్‌కు చాలాకాలం క్రితం హామీ ఇచ్చామని, అయితే ఇదే సమయానికి విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ టూర్‌లు ఆ తర్వాత ఖరారయ్యాయని పేర్కొన్నారు. అయినప్పటికీ మలేషియాలోని తెలుగు వారిని నిరాశ పరచకూడదన్న ఉద్దేశంతో సీఎంవోకు సమాచారమిచ్చి సంక్రాంతి సంబరాల్లో భాగమయ్యానన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z