Business

భారీగా పెరిగిన డాలరు-రూపాయి మారకం-BusinessNews-Jan 07 2025

భారీగా పెరిగిన డాలరు-రూపాయి మారకం-BusinessNews-Jan 07 2025

* సంక్రాంతి (sankranti 2025) పండగ దృష్ట్యా అదనపు బస్సులు నడపాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) నిర్ణయించింది. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ ఎండీ ప్రకటించారు. జనవరి 8 నుంచి మొదలు 13 వరకూ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి పలుచోట్లకు 2,153 బస్సులు, బెంగళూరు నుంచి 375, విజయవాడ నుంచి 300 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు చెప్పారు. తిరుగు ప్రయాణానికి ఈ నెల 16 నుంచి 20 వరకు 3,200 ప్రత్యేక బస్సులను నడపనున్నామని ఎండీ పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలుండవని, సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తామన్నారు. ఒకేసారి రెండు వైపులా టికెట్లు బుక్‌ (APSRTC Online Booking) చేసుకుంటే టికెట్ ధరపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్‌ బుకింగ్‌ చేసుకునే సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలని.. ప్రయాణికుల రద్దీకి (Sankranti Special Buses) అనుగుణంగా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

* దాదాపుగా మనుషులందరిదీ ఒకటే ఆలోచన.. జీవితంలో కావాల్సినంత సంపాదించి, నచ్చినట్టుగా జీవించాలని. ఆ లక్ష్యాన్ని కొందరు త్వరగా చేరుకుంటారు.. మరికొందరు సాధించుకునే ప్రయత్నంలోనే చివరి అంకానికి చేరుకుంటారు. కానీ ఓ యువ వ్యాపారవేత్తకు మాత్రం విచిత్ర పరిస్థితి ఎదురైంది. చిన్న వయసులోనే వేల కోట్ల రూపాయలు సంపాదించేశాడు. ఇప్పుడింక ఏం చేయాలో తెలియట్లేదని అంటున్నాడు (Vinay Hiremath). భారత సంతతికి చెందిన వినయ్ హిరేమత్ (Vinay Hiremath) టెక్‌ సంస్థ లూమ్‌ను స్థాపించి విజయం సాధించారు. దానిని గత ఏడాది అట్లాసియన్ సంస్థకు అమ్మేశారు. ఆ విక్రయం ద్వారా వినయ్‌కు 975 మిలియన్ డాలర్ల సొమ్ము దక్కింది. అంటే సుమారు రూ.8 వేల కోట్ల పైమాటే. అంత సంపాదించిన ఆయన వయసు 35 ఏళ్ల లోపే. అలాంటి వ్యక్తి కొత్త టెక్నాలజీ గురించి ఆలోచించుకుంటూనో, కుటుంబంతో సరదాగా గడుపుతూనో ఉంటారేమో అనుకుంటాం. కానీ రెండు రోజుల క్రితం ఆయన పెట్టిన పోస్టు మాత్రం ప్రతిఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘‘నేను ధనవంతుడినయ్యా.. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. కావాల్సినంత ఆర్థిక స్వేచ్ఛ ఉన్నా ఓ సందిగ్ధంలో ఉన్నాను. జీవితంపై అంత సానుకూలంగా ఏమీ లేను. ఎవరి సానుభూతి పొందడానికో నేను ఈ పోస్టు పెట్టడం లేదు. అసలు ఏ ఉద్దేశంతో ఈ సందేశం రాస్తున్నానో కూడా నాకు తెలియదు’’ అంటూ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు.

* ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ (Microsoft) భారత్‌లో భారీ పెట్టుబడి పెట్టనుంది. దేశంలో క్లౌడ్‌, కృత్రిమ మేధ సామర్థ్యాలను విస్తరించడం, డేటా సెంటర్ల విస్తరణ కోసం 3 బిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ ఛైర్మన్‌, సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) వెల్లడించారు. అలాగే, 2030 నాటికి 10 మిలియన్ల మందికి (కోటి మందికి) ఏఐ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బెంగళూరు వేదికగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. ప్రస్తుతం భారత్‌ పర్యటనలో ఉన్న సత్య నాదెళ్ల (Satya Nadella) సోమవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఏఐ విషయంలో భారత్‌ను ఉన్నత స్థానంలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన ఈవెంట్‌లో పెట్టుబడులపై ప్రకటన చేశారు. ఎప్పుడూ లేని స్థాయిలో భారత్‌లో 3 బిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెడుతున్నందుకు సంతోషంగా ఉందని సత్య నాదెళ్ల తెలిపారు. ఈ పెట్టుబడి భారత్‌లో ఏఐ ఆవిష్కరణలకు ఊతం ఇస్తుందని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న ప్రధాని మోదీ ఆలోచనల్లో కీలక భూమిక పోషిస్తుందన్నారు.

* దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు (Stock market) లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల నేపథ్యంలో మన సూచీలు ఓ మోస్తరుగా రాణించాయి. నిన్నటి భారీ నష్టాల నుంచి మదుపర్లకు కాస్త ఊరట కల్పించాయి. ముఖ్యంగా వైరస్‌కు సంబంధించి పెద్దగా ఆందోళన అక్కర్లేదన్న వార్తలు కూడా కొంత సానుకూలతకు కారణమయ్యాయి. సెన్సెక్స్‌ సూచీ ఉదయం 78,019.80 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 77,964.99) స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా మోస్తరు లాభాల్లో కదలాడింది. ఇంట్రాడేలో 78,452.74 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 234.12 పాయింట్ల లాభంతో 78,199.11 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 91.85 పాయింట్ల లాభంతో 23,707 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరో 5 పైసలు క్షీణించి 85.73గా ఉంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z