గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: శు.ఏకాదశి ఉ.9.44 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: కృత్తిక ప.1.42 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: తె..4.53 నుంyì 6,24 వర కు (తెల్లవారితే శనివారం), దుర్ముహూర్తం: ఉ.8.50 నుండి 9.34 వరకు, తదుపరి ప.12.30 నుండి 1.14 వరకు, అమృత ఘడియలు: ఉ.11.24నుండి 12.55 వరకు, వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 6.38, సూర్యాస్తమయం: 5.38.
మేషం…వ్యయప్రయాసలు. పనుల్లో నిదానంగా సాగుతాయి. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్య సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు కొంత మందగిస్తాయి.
వృషభం…కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. బాకీలు అందుతాయి. కుటుంబసమస్యల పరిష్కారం. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సొగుతాయి.
మిథునం….బంధువుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు.
కర్కాటకం…ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సోదరులు, మిత్రులతో వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. లక్ష్యాల సాధనలో ముందడుగు.
సింహం…నూతనోత్సాహం. ఆర్థిక ప్రగతి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహార విజయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.
కన్య…సన్నిహితులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. వ్యాపార లావాదేవీలు నత్తనడనకన సాగుతాయి. ఉద్యోగయత్నాలలో స్వల్ప ఆటంకాలు.
తుల….పనుల్లో స్వల్ప ఆటంకాలు. దూరప్రయాణాలు. బంధువుల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
వృశ్చికం….నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపార లావాదేవీలు పురోగతిలో సాగుతాయి.
వస్తులాభాలు.
ధనుస్సు….కాంట్రాక్టులు లభిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.
మకరం….వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో చికాకులు.
కుంభం…కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీనం…మిత్రుల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అందుతుంది. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z