* వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు భక్తులందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్టు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ సమావేశం వివరాలను వెల్లడించారు.
* ప్రపంచంలోనే మరో అతిపెద్ద డ్యామ్‌ను నిర్మించడానికి సిద్ధం అవుతోన్న చైనా.. తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. సౌరశక్తి (solar power)ని సమర్థవంతంగా వినియోగించుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. శాస్త్రవేత్తలు దీనిని ‘త్రీగోర్జెస్ డ్యామ్ ఆఫ్ స్పేస్’ (Three Gorges Dam Of Space)గా అభివర్ణిస్తున్నారు. త్రీగోర్జెస్ డ్యామ్ (Three Gorges Dam ).. చైనాకు కలికితురాయి. మానవులు సృష్టించిన అతిపెద్ద నీటి నిల్వ చేసే కేంద్రం. ఇప్పుడు అదే రకంగా సౌరశక్తిని ఒడిసిపట్టేలా బీజింగ్ ప్లాన్ చేస్తోంది. ఆ దేశానికి చెందిన ప్రముఖ రాకెట్ సైంటిస్ట్ లాంగ్లెహావోను ఉటంకిస్తూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ దీనిపై ఓ కథనాన్ని రాసుకొచ్చింది. ఈ సరికొత్త సోలార్ ప్రాజెక్టులో భాగంగా భూమికి 32వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో కిలోమీటర్ వెడల్పుతో భారీ సౌరశ్రేణిని ఏర్పాటుచేయనున్నారు. దాంతో భూ వాతావరణంలో వచ్చే మార్పులు, రాత్రి పగలుతో సంబంధం లేకుండా నిరంతరం సౌర శక్తిని సేకరించడానికి వీలు కలుగుతుంది.
* వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారం సెలవునూ వదిలేయాలని ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్లు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు సెలబ్రిటీలు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొణె (Deepika Padukone) అసహనం వ్యక్తంచేస్తూ పోస్ట్ పెట్టారు. అలాగే ఛైర్మన్ వ్యాఖ్యలపై ఆ కంపెనీ ఇచ్చిన వివరణపై కూడా ఆమె మరో పోస్ట్ పెట్టారు. ‘‘ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు. ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలి’’ అంటూ ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించిన పోస్ట్‌ను నటి దీపిక షేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆశ్చర్యానికి గురయ్యా’’ అని పేర్కొన్నారు. తన పోస్ట్‌కు #MentalHealthMatters అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడిస్తూ వ్యక్తికి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై కంపెనీ వివరణ ఇవ్వగా.. దానిపైనా నటి స్పందించారు. ‘ఈ క్లారిటీ ఇచ్చి మరింత దిగజారారు’ అని రాసుకొచ్చారు.
* కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhan Reddy) ఓఎంసీ కేసుల విచారణలో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల విచారణను 4 నెలల్లోగా పూర్తి చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఇకపై గడువు పెంచబోయేది లేదని తేల్చి చెప్పింది. వీటి విచారణ 4 నెలల్లో పూర్తి చేయాలని సెప్టెంబరు 30నే సుప్రీం ధర్మాసనం ఆదేశించినప్పటికీ విచారణ పూర్తి కాలేదు. దీంతో మరింత గడువు కోరుతూ మరోసారి సర్వోన్నత న్యాయస్థానాన్ని సీబీఐ ఆశ్రయించింది.
* దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) గడువు సమీపిస్తున్న వేళ.. ఓటర్లను ఆకర్షించేందుకు ఉచితాల వైపు (Freebies) రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. ఈ క్రమంలో ప్రజా సమస్యల ప్రస్తావన లేకుండా పోతోందని వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దేశ రాజధానిని ఊపిరి సలపకుండా చేస్తున్న కాలుష్యం, శాంతిభద్రతలు, మహిళలపై నేరాలు వంటి సమస్యల గురించి ఊసెత్తడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్థిక సాయంతోపాటు ఇతర సంక్షేమ పథకాలతో ప్రధాన పార్టీలు పోటాపోటీగా హామీలు కురిపిస్తుండటం గమనార్హం.
* మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. నిన్న ఏసీబీ విచారణ అనంతరం బంజారాహిల్స్‌లోని భారాస కార్యాలయం వరకు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు కేటీఆర్‌తో పాటు గెల్లు శ్రీనివాస్, బాల్క సుమన్, మన్నె గోవర్థన్, క్రిశాంక్, జైసింహ తదితరులపై 305, r/w 62 BNS సెక్షన్ల కింద కేసు నమోదైంది.
* జనవరి 26 నుంచి రైతుభరోసా, ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. పథకాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అమలు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. నాలుగు పథకాల అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో గ్రామసభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని.. అందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్ధేశం చేశారు. ఈ మేరకు కలెక్టర్లతో జరుగుతోన్న సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
* కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా పిఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్లను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. అమ్మాయిలను వేధిస్తే ఈవ్టీజర్ల భరతం పడతామని హెచ్చరించారు.
* ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన జగనన్న కాలనీల పేరు మార్చుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ కాలనీలకు ‘పీఎంఏవై-ఎన్టీఆర్’ నగర్‌గా నామకరణం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
* విశాఖపట్నం ప్రత్యేక పోక్సో కోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. 14ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో యూట్యూబర్ ‘ఫన్ బకెట్’ భార్గవ్‌కు (fun bucket bhargav) 20ఏళ్ల జైలు శిక్ష విధించింది.
* డిగ్రీ అయినా పూర్తి చేయకున్నా వైద్యవిద్యను అభ్యసించినట్లు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యుడిగా చలామణీ అవుతున్న వ్యక్తిని కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకొని గురువారం రిమాండ్‌కు తరలించారు. కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి వివరాలు వెల్లడించారు. అక్రమంగా డబ్బులు సంపాదించాలన్న దురాశతో మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్కి చెందిన ముల్కల రవీందర్ తాను వైద్యవిద్యను అభ్యసిస్తున్నట్లు కుటుంబసభ్యులను నమ్మించాడు. ఓ ఆర్ఎంపీ వద్ద కొన్ని రోజులు శిక్షణ పొందాడు. అనంతరం అంతర్జాలంలో తన పేరుకు సరితూగేలా ఉన్న రవీందర్‌రెడ్డి అనే వైద్యుడికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన ధ్రువపత్రాలను డౌన్లోడ్ చేసుకున్నాడు. వాటిని ఫొటోషాప్‌లో ఎడిట్ చేసి…తన ఫొటో పెట్టుకున్నాడు.
* సైబర్ నేరగాళ్ల కోసం హైదరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్ (Crime News) చేపట్టారు. ఏపీ, కర్ణాటక, యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. వీరిపై తెలంగాణలో 30, దేశవ్యాప్తంగా 328 కేసులు నమోదయ్యాయి. నిందితుల నుంచి సెల్ఫోన్లు, చెక్‌బుక్‌లు, సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z